Latest Updates
-
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం!
అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్!

గుండెల్లో మంటగా ఉండటం
దీనినే హార్ట్ బర్న్ అంటారు. చాలామంది గుండెల్లో మంటగా ఉందని చెప్పటం మనం తరచూ వింటూంటాం. దీనివల్ల గుండెల్లో కొన్ని సందర్భాలలో గొంతులో మంటగా ఉంటుంది. దీనికి కారణం అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ తదితరమైన వాటిగా చెప్పవచ్చు. అసలు ఈ రకంగా గుండెల్లో మంట అనేది అనేక కారణాల వలన రావచ్చు. సాధారణంగా మన శరీరంలో కొన్ని రకాల ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తీసుకొన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణ ప్రక్రియలో సహాయ పడతాయి. కానీ ఘాటుగా ఉండే ఈ ఆమ్లాల నుండి ఏ ఇబ్బందీ కలగకుండా శరీరంలో ఒక పొర జీర్ణాశయం లోపలి భాగాన్ని కాపాడుతూ ఉంటుంది. మనం తినే ఆహారం ఆహార నాళం నుంచి జీర్ణాశయంలోకి వెళుతుందని, మనకు తెలుసు. అలా ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళేముందు ఆహార నాళంలో ఒక చివర ఉండే కవాటం లేదా వాల్వ్ ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళేంతవరకూ తెరచుకొని తర్వాత మూసుకుంటుంది. అయితే, ఈ వాల్వ అనవసరంగా తెరచుకోవటం వలన కొన్నిసార్లు ఈ ఆమ్లాలు ఆహార నాళంలోకి ప్రవేశిస్తాయి. ఈ ఆమ్లాలను ఎదుర్కొనే శక్తి ఈసోఫేగస్ అని పిలువబడే ఈ ఆహార నాళానికి ఉండదు. కాబట్టి ఆహార నాళంలో మంట ఏర్పడుతుంది. దీనినే గుండెల్లో మంట అని మనం అంటాం. ఒక్కోసారి జీర్ణాశయంపైన ఒత్తిడి అధికంగా కలిగి జీర్ణాశయంలోని ఆమ్లాలు ఈ ఆహార నాళంలో ప్రవేశించడం వలన కూడా గుండెల్లో మంట వస్తుంది.
జాగ్రత్తలు
1. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు పుల్లని పదార్ధాలను అధికంగా తినడం మానివేయాలి.
2. అజీర్ణం ఏర్పడకుండా చూసుకోవాలి.
3. భోజనం చేసిన తర్వాత డైజిన్, జెలూసిల్ వంటి ఏంటాసిడ్స్ వేసుకొంటే ఈ గుండె మంటను నివారించవచ్చు.
4. గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు ప్రారంభంలోనే సంబంధిత మందులు వాడటం అత్యుత్తమం.
5. జీర్ణసంబంధమైన వ్యాధులకు వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు, చికిత్స పొందాలి.
6. కొందరు గుండె మంటను, గుండెపోటుగా భావించి భ్రమపడతారు. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు.
కనుక గుండెకు ఏ రకమైన సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఎప్పటికపుడు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ వైద్యుల సలహా సంప్రదింపులను పొందాలి. సరైన సమయంలో చేయబడే చికిత్స ఎల్లపుడూ లాభిస్తుంది. శరీరంకు హానికలుగకుండా, అధిక వ్యయంకాకుండా కూడా వుంటుంది. గుండె పరిస్ధితిని పరీక్షించటంలో ఇ.సి.జి. ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇసిజి పరీక్షలు చేయిస్తే చాలు మీ గుండె ఎంత ఆరోగ్యంగా వున్నదనేది వైద్యులు నిర్ధారిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
