Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. సేఫ్టీకి ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో పగటి సమయంలో బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇక తీవ్రమైన వడగాల్పులు, వేసవి తాపంతో శరీరంలో మార్పులు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వేసవిలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని టిప్స్ తప్పనిసరి పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

తగినంత నీరు అవసరం
శరీర ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినప్పుడు తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. తల తిరగడం, గందరగోళం, వికారం లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి. వేసవిలో రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి. ఇక బయటకు వెళ్లేటప్పుడు ఇంకా ఎక్కువే తాగాల్సి ఉంటుంది. వాటర్ బాటిల్ క్యారీ చేయడం ఉత్తమం. ఈ కాలంలో తరచుగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ ద్రావణం, సబ్జా నీళ్లు తీసుకోవడం ద్వారా బాడీ డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉంటుంది.
వీటికి దూరంగా ఉండండి
వేసవిలో మద్యం, కెఫీన్, చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. లేదంటే అవి మీ శరీరాన్ని మరింత డీహైడ్రేషన్‌కి దారితీస్తాయి. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్, మసాలా వంటకాలు, ఫ్రైడ్ ఫుడ్స్‌ను తీసుకోకండి. అవి శరీర వేడిని పెంచడమే కాకుండా జీర్ణక్రియను కష్టతరంగా మార్చుతుంది.
తేలికైన ఆహారం..
వేసవిలో మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారనేది చాలా ముఖ్యం. నీరు శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, టమోటాలు వంటి వాటికి ఎక్కువగా తీసుకోవాలి. పండ్ల రసాలు, రాగి జావ, సలాడ్లు మేలు చేస్తాయి. త్వరగా అరిగిపోయే తేలికైన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ కాలంలో స్ట్రీట్ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాడైపోయిన, ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారాన్ని తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి.
స్కిన్ కేర్..
బయటకు వెళ్లినప్పుడు సూర్యుని వేడి ప్రత్యక్షంగా మీ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరి. ఫేస్ మిస్ట్ లేదా వాటర్ స్ప్రేని మీ బ్యాగ్‌లో క్యారీ చేయండి. సన్ గ్లాసెస్, స్కార్ఫ్, గొడుగు వంటి వాటిని తీసుకెళ్లండి. వేసవిలో వదులుగా ఉండే, లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం. తద్వారా మీ చర్మానికి గాలి తగిలి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

రోజువారీ పనుల్లో మార్పులు..
గరిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా వీలైతే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లడం మానుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే దాని ప్రకారంగా మీ రోజువారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకోండి. చల్లటి నీటితో స్నానం చేయడం ద్వారా మరింత ఉపశమనం కలుగుతుంది. వ్యాయామాలు, వాకింగ్‌లు ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలోనే పూర్తి చేయడం శ్రేయస్కరం.
వేసవిలో ఇల్లు చల్లగా..
తీవ్రమైన ఎండ, వడగాల్పుల కారణంగా ఇంట్లోకి వేడి ప్రవేశిస్తుంది. అందుకోసం పగటిపూట కర్టెన్లు మూసివేయాలి. రాత్రిపూట కిటికీలు తెరిచి ఉండటం ద్వారా స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి చేరుతుంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను దానికి అనుగుణంగా వినియోగించుకోండి. ఇక, పిల్లలు, వృద్ధులు, గర్భిణీల ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలను, పెంపుడు జంతువులను పార్కింగ్ వాహనాల్లో ఒంటరిగా వదిలేసి వెళ్లకండి.
ఎవరైనా వడదెబ్బకి గురైనట్లయితే వెంటనే ఆ వ్యక్తిని చల్లని ప్రదేశానికి తరలించండి. ఆ వ్యక్తి స్పృహలో ఉంటే శరీరాన్ని నీటితో లేదా తడి గుడ్డతో చల్లబరచండి. ప్రథమ చికిత్సలో భాగంగా వెంటనే ద్రవ పదార్థాలు ఇవ్వండి. అనంతరం వైద్య సహాయం కోసం ఆస్పత్రికి తరలించండి. వేసవిలో మీరు ఇంట్లోనే ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా హాస్పిటల్‌కి వెళ్లే అవసరం తప్పుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
