Latest Updates
-
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఇక నుంచి వైద్యులందరూ కారణం లేకుండా యాంటీబయోటిక్స్ ఇస్తే జైలుకే..జర జాగ్రత్త!!
ప్రతి చిన్న జ్వరానికి డాక్టర్ దగ్గరకు వెళ్తే యాంటీబయాటిక్స్ ఇచ్చేవారూ ఉన్నారు, ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఇచ్చిన వెంటనే జ్వరం త్వరగా తగ్గుతుంది కాబట్టి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇచేస్తున్నారు.
ఏ మందుల షాపుకో వెళ్ళి జలుబు, దగ్గో, జ్వరమో చెబితే చాలు, షాపువారు కూడా మొదట యాంటీబయోటిక్ ఇచ్చేస్తున్నారు. ఇలా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండి యాంటీ బయోటిక్స్ ను విచ్చల విడిగా వాడేస్తున్నారు. అయితే ఇక నుంచి మీ డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ కానీ, మెడికల్ షాపు వాళ్ళు నేరుగా ఇచ్చే యాంటీబయోటిక్స్ గానీ తీసుకోవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

వైద్యుడికి కూడా నోటీసు
ఇకపై ఏ రోగికైనా యాంటి మైక్రోబియల్ , యాంటీబయాటిక్స్ రాస్తుంటే..వాటిని ఎందుకు రాస్తున్నారో పూర్తి కారణాలను ప్రిస్క్రిప్షన్ లో పేర్కొనాలని కేంద్ర ఆరోగ్య శాఖ వైద్యులను ఆదేశించింది. ఇలా యాంటిబయోటిక్స్ వాడటం వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. డా. అతుల్ గోయల్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్) మీరు యాంటీబయాటిక్స్ ఇస్తే, తప్పనిసరిగా స్లిప్‌లో రాయాలని వైద్యులందరికీ చెప్పారు.
యాంటీబయోటిక్స్ సప్లై చేస్తే శిక్షతో పాటు ఫైన్ కూడా
అర్హతలున్న డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల వాళ్ళు యాంటీబయోటిక్ లను విక్రయించకూడదని, అలా చేస్తే యాక్షన్ తీసుకుని శిక్షతో పాటు ఫైన్ చెల్లించాలని ఈ లేఖలో పేర్కొన్నారు.
ఇది ఒక నిశ్శబ్ద మహమ్మారి
డాక్టర్లను తయారుచేసే మెడికల్ కాలేజీలకు ఈ లేఖ పంపించామని కేంద్రప్రభుత్వం తెలిపింది. మైక్రోబియల్ నిరోదక ఒక నిశ్శబ్ద మహమ్మారి . ఎందుకంటే 2025 నాటికి దీని వల్ల కోటిమందికి పైగా మరణించే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గతంలోనే హెచ్చరించింది.
యాంటీబయాటిక్ అంటే ఏమిటి?
యాంటీబయాటిక్ అనేది కొన్ని ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఉపయోగించే శక్తివంతమైన మందు. దీన్ని ఉపయోగించడం వల్ల హానికరమైన బాక్టీరియా వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది.
సాధారణంగా, రక్తంలోని తెల్లరక్తకణాల ద్వారా బ్యాక్టీరియా నిరోధిస్తుంది. కానీ తెల్ల రక్తకణాలు బ్యాక్టీరియాతో పోరాడడంలో విఫలమైనప్పుడు, యాంటీబయాటిక్స్ ఇలా ఇవ్వబడతాయి.
యాంటీబయాటిక్ ఎలా పని చేస్తుంది?
* యాంటీబయాటిక్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, అది హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది.
* ఇది బ్యాక్టీరియా అధిక ఉత్పత్తిని నివారిస్తుంది.
యాంటీబయాటిక్స్ ఎప్పుడు ఉపయోగించాలి?
చిన్న చిన్న జబ్బులకు యాంటీబయాటిక్స్ వాడకూడదు. మన శరీరం బ్యాక్టీరియాను చంపలేనప్పుడు మాత్రమే దీనిని ఉపయోగించాలి.
యాంటీబయాటిక్స్ యొక్క దుష్ప్రభావాలు ఏమిటి?
* అనారోగ్యం
* వాంతులు
* ముఖం మీద పొక్కులు
* కడుపు నొప్పి
* సూర్యరశ్మిని చూడలేకపోవడం
* కొన్ని యాంటీబయాటిక్స్ నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి
* ప్లేట్‌లెట్లను తగ్గిస్తుంది
* కిడ్నీలో రాళ్లు ఏర్పడడం.
అలెర్జీ సమస్య
* ముఖం మీద పొక్కులు
* నాలుక మందంగా మారడం
* దగ్గు
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఈ లక్షణాలు కనిపిస్తే, తక్షణ చికిత్స అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications