Latest Updates
-
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!
మీరు పెద్ద బద్దకస్తులా? సోమరిపోతులవడం వెనుక ఎవ్వరికీ తెలియని అతిపెద్ద రహస్యం ఇదే
ఏ వ్యక్తి అయినా సరే లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే కష్టపడి పనిచేస్తే మాత్రమే సరిపోదు..కొన్ని అలవాట్లు కూడా ముఖ్యం. భవిష్యత్తు జీవితం విజయవంతంగా, అందంగా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైయిల్ ని అనుసరించడం ముఖ్యం. అయితే కొన్నిసార్లు సోమరితనం లేదా బద్దకం మీరు మంచి లైఫ్ స్టైల్ అనుసరించకుండా అడ్డుకుంటుంది, దీని కారణంగా మొత్తం మీ లైఫ్ డిస్ట్రర్బ్ అవుతుంది. శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది. అయితే అసలు బద్దకం సంకేతాలు ఏంటి? ఇది ఎందువల్ల వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చూడండి.
సోమరితనం సంకేతాలు
-అవసరానికి మించి నిద్రపోవడం
-ఒక పని చేస్తూనే మరొక పనితో పరధ్యానం చెందడం
-వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ చూపకపోవడం.
-మీ రోజువారీ పనులను వాయిదా వేయడం
-దేనిపైనా ఆసక్తి లేకపోవడం
-ఎప్పుడూ శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది
-ముఖ్యమైన పనులను కూడా వాయిదా వేయడం
-బాధ్యతల నుండి పారిపోవడం

సోమరితనం లేదా బద్దకంగా ఉండటం వెనుక నిజమైన కారణాలు ఇవే
విటమిన్ D లోపం
ఎముకలు బలంగా ఉంచడంలో విటమిన్ డి చాలా ముఖ్యమైనది. శరీరంలో తగినంత విటమిన్ డి లేకపోతే ఎముకలు బలహీనంగా మారతాయి. దీనివల్ల బలహీనత, సోమరితనం కలుగుతుంది.
ఊబకాయం
ఊబకాయం ఇన్సులిన్ నిరోధకత,హార్మోన్ల మార్పులకు కారణమవుతుంది. ఇది ఎనర్జీ లెవల్స్ ని తగ్గిస్తుంది, నిద్ర సమస్యలను కలిగిస్తుంది..ఫలితంగా ఇది అలసటకు దారితీస్తుంది.
ఐరన్ డెఫిషియన్సీ
శరీరంలో ఐరన్ లోపం కారణంగా కణాలకు ఆక్సిజన్‌ను పంపిణీ చేయడానికి కారణమయ్యే హిమోగ్లోబిన్ తగినంత మొత్తంలో ఉత్పత్తి చేయబడదు. ఆక్సిజన్ లేకపోవడం వల్ల సోమరితనం ఆధిపత్యం చెలాయిస్తుంది.
విటమిన్ బి12 లోపం
విటమిన్ బి 12 లోపం కారణంగా ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం ప్రారంభమవుతుంది, ఇది రక్తహీనతకు కారణమవుతుంది. దీని కారణంగా సోమరితనంగా అనిపించడం ప్రారంభమవుతుంది.
నిరాశ, ఆందోళన
నిరాశకు గురైనప్పుడు, ఏ పని చేయడంపైనా ఆసక్తి ఉండదు ఆందోళ,న కారణంగా ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు. దీని వల్ల మనిషి సోమరిగా మారుతాడు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
