Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఎసిడిటీ, గుండెల్లో మంట ఇబ్బంది పెడుతోందా? ఇలా చేస్తే తగ్గిపోతుంది
ఎసిడిటీ సమస్య చాలా మందిని బాధిస్తుంది. కడుపులో తీవ్రమైన నొప్పి, మంట, ఉబ్బరం, ఎక్కిళ్లు, త్రేన్పులు, యాసిడ్ రిఫ్లక్స్ ఇలాంటివి చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటారు. ఇవన్నీ కడుపులో ఎసిడిటీకి లక్షణాలు. తిన్న తర్వాత ఎసిడిటీ లక్షణాలు ఇబ్బంది పెడుతుంటే ఈ చిట్కాలతో సులభంగా, త్వరగా ఉపశమనం లభిస్తుంది. మరి ఆ చిట్కాలేమిటో తెలుసుకుందామా..
ఎసిడిటీ, గుండెల్లో మంట లక్షణాలు:
ఎసిడిటీ అనేది కడుపులో యాసిడ్స్ ఎక్కువ ఉత్పత్తి కావడాన్ని సూచిస్తుంది. కడుపుల్లోని గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే యాసిడ్ సాధారణంగా ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఎక్కువ యాసిడ్ ఉత్పత్తి కావడం వల్ల అది యాసిడ్ రిఫ్లక్స్ కు దారితీస్తుంది. అంటే యాసిడ్ కడుపులో నుంచి గొంతులోకి పైకి లేస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల గుండెల్లో మంటగా ఉంటుంది. ఛాతీ దిగువన మంటగా, నొప్పిగా అనిపిస్తుంది.

- ఉదరభాగంలో అసౌకర్యం
- ఆవలింతలు
- ఉబ్బరం
- మెడ, గొంతు, ఛాతీలో మంట
- వికారం లేదా వాంతులు
- వెక్కిళ్లు
- విరేచనాలు
కడుపులో ఎసిడిటీ సమస్య తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోతే వస్తుంది. ఎసిడిటీ సమస్య ఉన్న వారు సమయం ప్రకారం సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మసాలా కూరలు, పుల్లటి పులుసులు తినకుండా ఉండాలి. ఒకవేళ గ్యాస్ సమస్య వస్తుందని తెలిసినా తీసుకుంటే కడుపులో మంట ఇబ్బంది పెడుతుంది.
ఈ చిట్కాలతో ఎసిడిటీ దూరం:
అతిగా తినొద్దు:
ఎక్కువ మొత్తంలో తినడం ఎసిడిటీకి కారణం అవుతుంది. కడుపు నిండుగా ఉన్నప్పుడు కడుపులోని యాసిడ్లు అన్నవాహికను వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తాయి. దీని వల్ల యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం, కడుపు నొప్పి, అసౌకర్యం కలుగుతుంది. అందుకే తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినాలి.
ఆల్కహాల్:
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కడుపులో ఎక్కువ మొత్తంలో యాసిడ్స్ ఉత్పత్తి అవుతుంది ఇది కడుపు లైనింగ్ ను దెబ్బతీస్తుంది. ఇది నొప్పిని, వాపును కలిగిస్తుంది. పొట్టలో పుండ్లు కూడా అవుతాయి.
చూయింగ్ గమ్:
చూయింగ్ గమ్ లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. ఇది యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా pH స్థాయిల్లో సమతుల్యం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి చూయింగ్ గమ్ నమలడం మంచిది.
కుడి వైపున పడుకోవద్దు:
తిన్న తర్వాత పడుకునేటప్పుడు కుడి వైపు పడుకోవద్దు. ఎడమ వైపు పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ జరగదు.
పుదీనా టీ:
పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. అజీర్ణం, ఎసిడిటీతో ఇబ్బంది పడే వారు పుదీనా చాయ్ తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లం టీ:
జీర్ణ సంబంధిత సమస్యలను అల్లం దూరం చేస్తుంది. అల్లంలోని ఎసిడిటీ-ట్రిగ్గర్ చేసే పైలోరీ బ్యాక్టీరియాను నాశనం చేసే గుణాలు ఉన్నాయి. వాపును, వికారాన్ని తగ్గిస్తాయి.
సోంపు:
సోంపు లేదా సోపు గింజల్లో అనెథోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కడుపులో మంటను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. త్రేన్పులు రాకుండా నివారిస్తుంది. సోంపులో విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. సోంపుకు యాంటీ అల్సర్ గుణాలు ఉండటం వల్ల ఎసిడిటీని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications