Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
వర్షాలు ముంచెత్తుతున్నాయి.. చిన్నారుల్లో జలుబు, దగ్గు ఇబ్బంది పెడుతున్నాయా?
వర్షాలు మొదలయ్యాయి. వర్షాలతో పాటు రోగాలు కూడా వస్తాయి. వాతావరణ మార్పు కారణంగా, వర్షంలో తడవడం వల్ల చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు జలుబు, దగ్గు, జ్వరం లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. పలువురిలో వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వర్షాకాలం ప్రారంభంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని వల్ల కూడా రోగాల బారిన పడతారు.

చిన్నారులు అయితే జలుబు, దగ్గు, జ్వరం లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు త్వరగా గురవుతారు. ఈ కాలంలో చాలా మంది చిన్నారులను ఇబ్బంది పెట్టే సమస్యలు ఇవి. జలుబు వేయగానే, దగ్గు మొదలు కాగానే, శరీరం వేడెక్కగానే చాలా మంది మెడికల్ షాపులకు వెళ్లి ఓవర్ ది కౌంటర్ మందులు తీసుకొచ్చుకుని వాడేస్తుంటారు. ఈ మందుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం తగ్గుతుంది అనడంలో ఎలాంటి అనుమానం అవసరంలేదు.
అయితే చిన్నారులకు మందులు వేయకూడదని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. అలాంటి వారు మందులు వాడటానికి బదులు ఇంట్లోనే లభించే కొన్ని రకాల వంటింటి పదార్థాలతో జలుబు, దగ్గు, జ్వరం లాంటి వాటిని తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* వర్షాకాలంలో చిన్నారులకు వేడి నీటితో స్నానం చేయించాలి. తలంటు స్నానం చేయించేటప్పుడు వేడి నీటిలో కొన్ని చుక్కల నువ్వుల నూనె వేయాలి. దీని వల్ల పిల్లల్లో శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి.
* కొంచెం పసుపు, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని చిన్నారులతో తినిపించాలి. తర్వాత గోరు వెచ్చని నీరు తాగించాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
* గొంతు నొప్పి, దగ్గు సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు ఉప్పు, వాము, పసుపు కలిపి వేడి చేసి చిన్న గుడ్డలో కట్టుకోవాలి. దాంతో గొంతుపై నెమ్మదిగా కాపడం పెట్టాలి. ఇలా చేస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
* పసుపు కొమ్ములు, గోధమలను సమాన మొత్తంలో తీసుకుని వాటిని నూనె లేకుండా దోరగా వేయించాలి. తర్వాత మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని కొంత మొత్తంలో ఉదయం, సాయంత్రం పిల్లలకు ఇవ్వాలి. ఇలా చేస్తే శ్వాస కోశ సమస్యలు, దగ్గు తగ్గుతాయి.
* వాము ఒక టీస్పూన్, బెల్లం 4 టీస్పూన్లు తీసుకుని వాటిని మెత్తగా నూరుకోవాలి. ఈ కషాయాన్ని పిల్లలతో తాగించాలి. ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి.
* ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు పసుపు, పటికబెల్లం పొడిని బొగ్గు నిప్పుపై వేసి చిన్నారులతో పట్టించాలి. ఇలా చేయడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. జలుబు, దగ్గు సమస్య దూరం అవుతుంది.
* గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి పిల్లలతో తాగించాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications