Latest Updates
-
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.!
మారుతున్న కాలంలో డయాబెటిస్ అనేది సర్వసాధారణం అనిపించినా, ఈ దీర్ఘకాలిక వ్యాధి తీసుకువచ్చే నష్టాలు, సమస్యలు అన్నీఇన్నీ కావు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడంతో వివిధ రకాల ఆరోగ్య సమస్యలూ తలెత్తుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా ఇందుకు ఓ కారణం. ఈ క్రమంలో షుగర్‌ను కంట్రోల్ చేయడానికి భోజనం తర్వాత కాసేపు నడవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కానీ వాకింగ్‌కి, డయాబెటిస్‌కి సంబంధమేంటని అనుకోవచ్చు. ఇందుకు కారణాలేంటి.. భోజనం తర్వాత ఎంతసేపు నడవాలి.. నిపుణుల సలహాలు తెలుసుకుందాం..

డయాబెటిస్ నియంత్రణలో భాగంగా భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐదు నిమిషాలు సరిపోతుందా, లేక పది, ఇరవై నిమిషాల పాటు నడవాలా అనే సందేహం రావచ్చు. దీనిపై పలు వైద్య పరిశోధనలు నిర్వహించారు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేయన్ నివేదిక ప్రకారం.. భోజనం తర్వాత స్వల్వ నడక శరీరంపై పాజిటివ్ రిజల్ట్ చూపిస్తుంది. అయితే ఎంత సేపు నడిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చూద్దాం..
ఐదు నిమిషాల నడక..
మీకు భోజనం తర్వాత ఎక్కువ సేపు నడిచే సమయం లేకపోతే ఐదు నిమిషాల పాటు నడిచినా సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తిన్న తర్వాత కదలకుండా కూర్చోవడం కంటే, కొన్ని అడుగులు వేయడం ద్వారా కండరాలను ఉత్తేజపరుస్తాయి. దీంతో శరీరంలో ఇన్సులిన్ లేకపోయినా గ్లూకోజ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఫలితంగా ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా పూట ఏదైనా చిన్నపాటి నడక తప్పనిసరి. ఈ అలవాటు మేలు చేస్తుంది.

పది నిమిషాల నడకరోజులో తమ కోసం కొంత సమయం కేటాయించేవారు.. వీలైతే భోజనం తర్వాత పది నిమిషాల పాటు నడవడం చాలా మంచి పని. హెవీగా భోజనం చేసిన తర్వాత ఇలా 10 నిమిషాల నడక ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా కండరాలు నిరంతరం చురుగ్గా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ మెరుగుపడతాయి. ఒకేసారి మీరు ఎక్కువ సమయం నడవలేకపోతే.. పది నిమిషాల నడకతో ప్రారంభించండి.
20 నిమిషాల నడక
ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించేవారు, సమయాన్ని కేటాయించేవారు, 20 నిమిషాల పాటు నడవగలగడం అత్యంత ప్రయోజనకరం. ఇలా నడవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ సేపు పెరగకుండా చూస్తుంది. ఇంకా మీరు డెస్క్ జాబ్‌ల్లో ఉన్నట్లయితే ఎక్కువ సేపు కూర్చోకుండా ప్రతి 20 నిమిషాలకోసారి చిన్నపాటి విరామం తీసుకోవడం ద్వారా శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ సమతుల్యత మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తద్వారా శారీరక దృఢత్వం, గుండె ఆరోగ్యం బలపడుతుంది. మీ శరీర సామర్థ్యం, ఆహారపు అలవాట్లు, షుగర్ లెవెల్స్ ఆధారంగా వాకింగ్ సమయాన్ని ఎంచుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
