Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మలబద్దకం సమస్య ఆలోచనలకు కూడా లింక్ అయి ఉంటుంది..!! ఈ చిట్కాతో నివారించుకోండి..!!
మల బద్దకం ఇప్పుడు ఒక పెద్ద సమస్య అయిపోయింది. మీరు గనుక ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లోనో లేదా సూపర్ మార్కెట్స్ లో ఆహారాన్ని తింటూ ఉంటే అప్పుడు సహజంగాని నీటి శాతం తక్కువగా ఉండే ఆహారాన్ని తింటున్నట్లే. మాంసాహారం తింటున్నా కూడా సమస్యే. ఎందుకంటే అది జీర్ణవ్యవస్థలో మెల్లగా కదులుతోంది. కాబట్టి మీరు తినే ఆహారం ఏదైనా సరే అందులో నీటి శాతం అధికంగా ఉండాలి. మీ శరీరం 70 శాతంపైగా నీటితో నిండి ఉంటుంది. ఏదైనా కూరగాయలు తీసుకుంటే అందులో 70% పైగా నీరు ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాయగూరలూ, పండ్లూ గింజలూ ఇంకా మూలకాలను సరిపడా తీసుకోవడం ద్వారా మలం సాఫీగా కదలడానికి ఇబ్బంది ఉండదు. ఇక్కడ సమస్యంతా మీరు నీటి శాతం తక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తింటున్నారు. కాబట్టి కాయగూరలు, పండు గింజలు ఇంకా మూలకాలను సరిపడా తీసుకోవడం ద్వారా సమస్య తీరిపోతుంది. మీరు ఎప్పుడు ఏదో ఒకటి మేస్తూనే ఉంటారు. ఒక భోజనానికి మరో భోజనానికి మధ్యలో ఏమి తీసుకోనట్లయితే మలబద్ధకం సమస్య రానేరాదు. ఎప్పుడు మేస్తూనే ఉంటే అదే సమస్య.

సాంప్రదాయం ప్రకారం మొదటి ముద్దగా నెయ్యిని తినే వారు. ఆహారన్ని లూబ్రికేట్ చేస్తుంది. కడుపులో జీర్ణమవడానికి కూడా సాయపడుతుంది. నెయ్యి మనకు గ్రీజ్ లాగా పనిచేస్తుంది. పసుపును, వేపఆకు పుడిని కలిపి చిన్న ఉండలుగా చేసి ఉదయమే తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న క్రిములు, బ్యాక్టీరియా తొలగిపోతాయ్.
పాల పదార్ధాల్లో ఉండే ఎన్జైములు నేడు బట్టల తయారీల్లో ఉపయోగిస్తారు. ఈ పదార్ధాలు నీటిలో కరగవు. మీరు పాల పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటే అవి మీ పెద్ద ప్రేగులో పేరుకొని పోతాయ్. త్రిఫలం అనేది మూడు పదార్ధాల అద్భుతమైన సమ్మేళనం. ఇవి ఉష్ణ మండల ప్రాంతాల్లో మీకు దొరుకుతాయ్. వీటిని కలిపి కాస్త నీటితో లేదంటే తేనెతో కలిపి తీసుకుంటే వ్యవస్థ శుద్ధి చేయబడుతుంది.
ప్రతీ రోజు రాత్రి ఒక చుక్క ఆముదాన్ని నీటిలో కలిపి రాత్రి సమయంలో తాగితే మీ పేగులు ఎల్లప్పుడు శుభ్రంగా ఉంటాయ్. దీంతో మలబద్దకం సమస్యలు అస్సలు రాదు. మీ మనసులో జరిగేదానికి జీర్ణక్రియకు కూడా సంబంధం ఉంటుంది. మీలో ఆలోచనలు, భావాలు సంకుచితంగా ఉంటే మీకు సహజంగానే మలబద్దకం కలుగుతుంది. మెదడులో ఏది జరిగినా జీవితపు మూలాధారాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు భయపడినప్పుడు మీకు విరోచనాలన్నా అవుతాయ్, లేదంటే మలబద్దకం అయినా అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications