Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
పిల్లల్లో హైపర్‌యాక్టివ్‌నెస్.. ఏం చేస్తున్నారో గమనిస్తున్నారా.?
ఈ కాలం చిన్నారులు చాలా చురుకుగా ఉండటం చూస్తుంటాం. వారి చలాకీతనం చూస్తుంటే మా చిన్నప్పుడు మేము ఇలా ఉండేవాళ్లమా.. అని ఈ తరం పెద్దవాళ్లే కాదు.. 90’s కిడ్స్ కూడా ఆశ్చర్యపోతారు. పిల్లలు యాక్టివ్‌గా ఉంటే అది వారి భవిష్యత్తుకు సానుకూల సంకేతంగా తల్లిదండ్రులు భావిస్తారు. కానీ పీడియాట్రిక్ ఎక్స్‌పర్ట్స్ ఈ చర్యను హైపర్‌యాక్టివ్‌గా పరిగణిస్తున్నారు.

ప్రస్తుత జనరేషన్‌లో చాలా మంది పిల్లలు ఎక్కువగా మాట్లాడతారు. చురుకుగా ఉంటారు.. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇతరుల కంటే ఎక్కువగా యాక్టివ్‌గా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిని తల్లిదండ్రులు తేలికగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. హైపర్ యాక్టివ్‌గా ఉండేవాళ్లు.. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండటమే కాదు.. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వారికి కష్టంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రవర్తన సాధారణ అల్లరిలా కాకుండా భిన్నంగా కనిపిస్తుంది. అయితే ఇది అనారోగ్యం కాదని.. ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ అని భావిస్తారు. సాధారణ భాషలో దీనిని ఏడీహెచ్‌డీ అని చెబుతారు.
ఒకచోట నిలకడగా కూర్చోలేకపోవడం
ఏడీహెచ్‌డీ స్వభావం ఉన్న పిల్లలు తరచుగా లేచి నిలబడటం, అటూ ఇటూ పరుగెత్తడం, గెంతులు వేయడం లాంటివి చేస్తుంటారు. కూర్చున్నప్పుడు కూడా తమ చేతులు, కాళ్లను నిరంతరం కదిలిస్తూ ఉంటారు.
అతిగా మాట్లాడటం: ఏడీహెచ్‌డీ ఉన్న నాలుగేళ్ల లోపు పిల్లలు పరిమితికి మించి అతిగా మాట్లాడుతుంటారు. ఇక కొంచెం పెద్దవారైతే, వారు ఇతరుల మాటలను మధ్యలో అడ్డుకునేందుకు యత్నిస్తారు.
ఏకాగ్రత లోపం: అతి చురుకైన పిల్లలు ఏకాగ్రతగా పని చేయడంలో ఇబ్బంది పడతారని నిపుణులు చెబుతున్నారు. చదువు లేదా ఇతర పనులపై దృష్టి సారించలేకపోవడం, త్వరగా విసుగు ప్రదర్శించడం, చెప్పిన విషయాలు మర్చిపోవడం, బొమ్మలు, పుస్తకాలు లేదా వస్తువులను పదేపదే పోగొట్టుకోవడం వంటివి పిల్లలు అతి చురుకుగా ఉన్నారనడానికి సంకేతాలుగా పరిగణించాలి.
తొందరపాటు స్వభావం: అతి చురుకైన పిల్లల్లో తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. వారిలో ఓపిక తక్కువ, త్వరగా కోపం ప్రదర్శిస్తారు. ఇలాంటి పిల్లలు తరచుగా గట్టిగా మాట్లాడటం లేదా ఇతరులకు నచ్చని పనులను చేస్తుంటారు.

ఒక్కోసారి ఈ సమస్య జన్యుపరమైనది కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొంతమంది పిల్లల్లో మెదడు అభివృద్ధి, న్యూరోట్రాన్స్మిటర్ పనితీరు భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. అధిక స్క్రీన్ సమయం కారణంగా నిద్రలేమి, చిరాకుతో ఏడీహెచ్‌డీకి దారితీయొచ్చు.
పరిష్కారమేంటి.?
పిల్లల్లో ఈ సమస్యను పరిష్కరించేందుకు మొదటగా, వారి కోసం ఒక ఆరోగ్యకరమైన దినచర్యను ఏర్పాటు చేయాలి. వారికి నిద్ర, భోజనం, చదువుకునే సమయాలు క్రమబద్ధంగా ఉండేలా చూసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా, వారికి ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్, టీవీలను దూరంగా ఉంచాలి. వారిలో శారీరక శ్రమను పెంచుతూ.. ఆరుబయట ఆడుకోవడం, సైకిల్ తొక్కడం, నడవడం లేదా పరుగెత్తడం వంటివి అలవాటు చేయాలి. తద్వారా వారు సాధారణ జనజీవనాన్ని అలవాటు పడతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
