Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
Belly fat : ఈ చిట్కాలతో వేగంగా పొట్ట చుట్టూ కొవ్వును కరిగించుకోవచ్చు..
శరీరంలో కొవ్వు కేవలం సాధారణ స్థాయిలో కంటే ఎక్కువగా ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయ్. డయాబెటీస్, షుగర్, బీపీ, లివర్ వ్యాధులు, ఇవన్నీ కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల సంభవిస్తాయ్. కొవ్వను తగ్గించుకుంటే దాదాపు చాలా అనారోగ్యాల నుంచి బయటపడతాము. మరీ కొవ్వు అసలే లేకుండా ఉండడం కూడా సరైంది కాదు. అందుకే బాడీ మాస్ ఇండెక్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.
కొవ్వును ఎలా తగ్గించవుకోచ్చో ఇప్పటి వరకు చాలా మార్గాలను చూపించారు. ప్రస్తుతం మీకు అందిస్తున్న ఈ పద్ధతితో మీ పొట్ట చుట్టూ కొవ్వు ఖచ్చితంగా తగ్గుతుంది. కొన్ని వారాల పాటు ఈ చిట్కాను ట్రై చేయండి. ఫలితం మీకే తెలుస్తుంది.
సన్ బాత్
సన్‌బాత్ పద్ధతి ద్వారా ఒక్క రూపాయ్ ఖర్చు కూడా లేకుండా మీరు కొవ్వు తగ్గించుకోవచ్చు. ఎండ నుంచి వైటమిన్ డి లభిస్తుంది. అది యముకలను మరింత బలంగా మార్చడానికి దోహదపడుతుంది. ఉదయాన్నే లేచి ఇంటి టెర్రస్‌పై ఎండలో కొన్ని నిమిషాలు ఉండడం వల్ల శరీరంపై పడే సూర్య కిరణాలు మొత్తం బాడీని ఆరోగ్యవంతంగా మారుస్తుంది. వైటమిన్ డి ఒక్కటి మాత్రమే కాదు. చర్మానికి కూడా ఈ ఎండ చాలా మంచిది.

జ్యూస్‌లు తగ్గించాలి
ఎండాకాలంలో రోడ్డుపై వీధుల్లో ఎక్కడపడితే అక్కడ జ్యూస్ సెంటర్లు కుప్పలు తెప్పలుగా వుంటాయ్. ఆ జ్యూస్ సెంటర్లలో చేసిన జ్యూస్‌లలో చెక్కర ఎక్కువగా వేస్తారు. అవి ఎక్కువగా తాగడం వల్ల కొవ్వు పెరుగుతుంది. ఆ జ్యుస్‌లలో ఐస్ వాటర్ కూడా కలపడంతో కొవ్వు పెరిగేందుకు వీలు కల్పిస్తుంది. కాబట్టి ఇలాంటి జ్యూస్‌లను సేవించకూడదు.
ఒత్తిడితో కొవ్వు పెరుగుదల
మానసిక ఒత్తిడి పెరిగితే శరీరంలో కార్టిసాల్ ఉత్పత్తి అవుతుంది. కార్టిసాజ్ వల్ల శరీర బరువు కూడా పెరుగుతుంది. రోజూ పది నిమిషాలు మెడిటేషన్ చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి కార్టిసాల్ ఉత్పత్తి కాకుండా ఉంటుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలు కూడా తగ్గిపోతాయ్.
రోజూ ఉదయం నీరు తాగడం
ప్రతీ రోజూ నిద్రలోంచి లేవగానే ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో ఒక చెంచా తేనె కొంత నిమ్మరసం పిండుకొని తాగాలి. ఇలా ప్రతీ రోజూ చేస్తే 15 రోజుల తరువాత మీ శరీరంలో జరిగే మార్పును పొట్టపై, పొట్ట చుట్టూ పెరిగే కొవ్వును తగ్గడం మీరే చూస్తారు.
కంటి నిండా నిద్ర
సరిగ్గా నిద్రించకపోవడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వు పెరిగే అవకాశం వుంది. నిద్రించకపోవడం వల్ల కొన్ని రకాల హార్మోన్లు ఉత్పత్తయ్ బరువు పెరగడానికి కారణమవుతుంది. ఈ హార్మోన్ల వల్ల ఆకలికూడా పెరుగుతుంది. దీంతో ఎక్కువగా తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి.
లైట్ జాగింగ్
ప్రతీ రోజు జాగింగ్ మీరు ఇంట్లో నుండే చేసుకోవచ్చు. ఇది చేయడానికి మీకు థ్రెడ్‌మిల్, ప్రత్యేకమైన షూస్ కూడా అవసరం లేదు. ఉదయం లేవగానే నీళ్లు తాగి, బ్రష్ చేసుకున్న తరువాత మీ రూంలో ఉన్న చోటనే నిలబడి అక్కడే జాగింగ్ చేయండి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా జాగింగ చేయాలి. జాగింగ్ ఎలా చేస్తామో మొత్తం అదే పద్ధతిలో చేయాలి, కేవలం అడుగు ముందుకు వేయవద్దు అంతమాత్రమే.
పై చిట్కాలన్నలింటినీ 21 రోజుల పాటు నిరంతరాయంగా పాటించాలి. 22వ రోజున మీరు ఖచ్ఛితంగా ఆశించిన ఫలితాన్ని చూస్తారు. ఖర్చేమీ ఎక్కువ లేకుండా సులభంగా బరువు తగ్గుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications