Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Face Sweating : ముఖంపై ఎక్కువగా చెమటలా..? ఐతే ఈ చిట్కా ట్రై చేయండి..?
ఈ ఎండా కాంలో చెమటలు తీవ్రంగా రావడం సహజం. కొందరికి ఆ చెమటలు విపరీతంగా వస్తాయ్. కొందరి శరీరాలు ఫ్యాన్ గాలిలో కూడా చమటలు తెప్పిస్తాయ్. శరీరాన్ని చల్లగా ఉంచడానికి శరీరం చెమటను బయటకు రప్పించి చల్లబరుస్తుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. దీంతో శరీరంలోని ఉష్ణోగ్రత కంట్రోల్‌లోకి వస్తుంది. ముఖంపై ఎక్కువ చెమటలు చిరాకు తెప్పిస్తుంటాయ్. ముఖంపై చెమటలను ఎలా తగ్గించవచ్చో, దానికోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖంపై చెమటలను తగ్గించాలంటే..
స్పైసీ ఫుడ్‌ను తగ్గించడం
స్పైసీ ఫుడ్‌లో ఉండే నూనె, ఇతర పదార్ధాలు వంట్లో వేడిని పెంచుతాయ్. వేసవిలో ఈ వేడి మరింత ఎక్కువవడం వల్ల చెమటలు విపరీతంగా వస్తాయ్. స్పైసీ ఫుడ్‌ను తగ్గిస్తే కొంత చెమటలు తగ్గే అవకాశముంది.

వత్తిడిని తగ్గించుకోవాలి
మానసిక వత్తిడి వల్ల ముఖంపై చెమటలు వస్తుంటాయ్. నిత్యజీవితంలో ఉండే ఆందోళనలు ప్రతీ రోజూ వెంటాడుతుంటే శరీరంపై తరచూ చెమటలు పడతాయ్. శరీరం ఒక్కసారిగా చల్లబడి చెమటలు బయటకు రావడం చూస్తుంటాం. దీనిని తగ్గించాలంటే ప్రతీ రోజూ కొంత సమయం ధ్యానం చేసుకోవడానికి కేటాయించాలి. వ్యాయామం చేయడం వల్ల కూడా వత్తిడి తగ్గుతుంది.
మద్యం
మద్యం తాగితే శరీరంలో వేడి పెరుగుతుంది. శరీరాన్ని హైడ్రేట్ కాకుండా డీహైడ్రేట్ చేస్తుంది. ఎంత ఎక్కువగా మద్యం తాగితే అంత చెమటలు పడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బరువును తగ్గించుకోవాలి
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల కూడా చెమటలు ఎక్కువగా పడతాయ్. ఎప్పటి బీఎమ్‌ఐ (బాడీ మాస్ ఇండెక్స్)ను చెక్ చేసుకుంటూ ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్. బరువును తగ్గించుకొని అదుపులో పెట్టుకుంటే చెమట తగ్గడమే కాదు చాలా అనారోగ్య సమస్యలు తగ్గుతాయ్.
దుస్తులు
వేసుకునే దుస్తులను బట్టి కూడా శరీరంలో చెమటలు వస్తుంటాయ్. టైట్ ఫిట్టింగ్ బట్టలను, నైలాన్ ఫాబ్రిక్ వంటి వాటిని వేసుకోకుండా ఉండాలి. శరీరానికి కంఫర్ట్ అనిపించేలా లూజ్ కాటన్ దుస్తులను మాత్రమే తొడుక్కోవాలి.
స్నానం చేయడం
శరీరంపై మురికి ఎక్కువగా ఉంటే కూడా చమటలు వస్తుంటాయ్. రోజూ ఉదయం నిద్దర లేవగానే, ఇంకా పడుకునే ముందు మొత్తంగా రెండు సార్లు స్నానం చేస్తే శరీరం నుంచి చెమటలు రాకుండా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
