Latest Updates
-
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!
కంప్యూటర్ మెడిటేషన్ చెయ్యడం ఎలా?
కంప్యూటర్ లో ఎక్కువ సేపు పని చేసిన తర్వాత కొంచెం సేపు విశ్రాంతిని పొందదానికి కంప్యూటర్ మెడిటేషన్ ఏంతో తోడ్పడుతుంది. సులభమైన కొన్ని యోగా కదలికలు మరియు కొన్ని అనుకూల వాక్యాల ద్వారా మీ మనస్సుని ఉత్తేజపరచి, అంతర్గత అడ్డంకుల్ని తొలగించడం సాధ్యం. ఐదు నిమిషాలలోనే ప్రశాంతత, ప్రేమ ,ఆనందం, ఉత్తేజం మరియు శక్తిని పొందడం సులభం. ఈ మెడిటేషన్ పద్దతిని తెలుసుకుందాం.

1. భగవంతుని ధ్యానంలో ప్రశాంతతని కనుగొనండి.
2. మీ ప్రార్ధనల ద్వారా ప్రేమ,సంతోషం ఆనందాలని అన్ని జీవులకి పంపించండి. "ఫలానా వారికి ప్రేమ,ఆనందం,ప్రశాంతత అనబడే కాంతులని పంపిస్తున్నాను. అందరూ సుఖంగా ఉండాలి. ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి" అని ప్రార్ధించండి.
3. ఈ కంప్యూటర్ మెడిటేషన్ ని అన్ని వర్గాల ప్రజలు పాటించవచ్చని తెలుసుకోండి. నాస్తికులు కూడా దీనిని ఆచరించవచ్చు. మీకు అవసరమయ్యే పదాలని లేదా వాక్యాలని స్వీకరించండి. మీకు అనుగుణంగా వాక్యాలను మార్చుకుని వాటిని ద్వారా ధ్యానం చేయ్యండి. సర్వశక్తిమంతుడు గా, విశ్వశక్తిగా, లేదా ఈ జీవితాలను నడిపే ఒక గొప్ప శక్తిగా దేవుడిని నిర్వచించండి. మీకు ఏ విధంగా దేవుడిని ప్రార్ధిస్తే ఆనందంగా ఉంటుందో అలాగే దేవుడిని స్తుతించండి.
4. దేవుడా, నా మార్గాన్ని నిర్దేశించడానికి మీ సహాయాన్ని అర్ధిస్తున్నాను. దయచేసి నాకు సహాయం చెయ్యి అని ప్రార్ధిస్తూ దేవుడితో మరియు యోగులతో అనుసంధానం ఏర్పరుచుకోండి.
5. అంతర్గత ప్రశాంతత పొందండి. "పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని స్వీకరిస్తాను. నా జీవితాన్ని సానుకూలంగా గడుపుతాను" అని అనుకోండి.
6. మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. "ఓం శాంతి, ఓం శాంతి" అని ఒక నిమిషం పాటు జపించండి.
7. ప్రశాంతతని చేకూర్చే ఆలోచనలపై దృష్టిని కేంద్రీకరించండి. ఆందోళనలు కలిగించే ఆలోచనలని నిర్మూలించండి.
8. పాజిటివ్ వాక్యాలని కనుగొని వాటిని జపించండి.
9. ప్రార్ధనలో ఎక్కువ సమయం గడపండి. ప్రార్ధన ప్రశాంతతని పొందడానికి ప్రధానమైన మార్గం ప్రార్ధన. ప్రార్ధన లో ని చివరి దశలో హీలింగ్ ప్రభావాలు కలుగుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
