బానపొట్ట తగ్గాలంటే ఈ కఠిన నియమాలు పాటించక తప్పదు..!

మీకు ఇష్టమైన పాత జీన్స్ పాంట్ సరిపోనంటగా మీ నడుము కొలత పెరుగుతూనే ఉందా? మనిషి శరీరంలో పొత్తికడుపు లేదా పొట్ట దగ్గరే అధిక కొవ్వు పేర్కోవడం మొదలుపెట్టి దాన్ని కుండలాగా కనపడేలా చేస్తుంది. బానపొట్ట వల్ల మీరు అనాకారిగా కనపడడమే కాక మీ అత్యుత్తమ దుస్తులు కూడా మీకు పట్టకపోవడం వల్ల అది మీకు చిరాకు కలిగిస్తుంది.

పూర్వం, పొట్ట పెరగడం వయసైపోవడానికి, బలమైన మందుల వాడకం వల్ల వచ్చింది అనడానికి గుర్తుగా ఉండేది. అయితే, ఇప్పటి ఫాస్ట్ ఫుడ్ ల వల్ల, సౌకర్యవంతమైన జీవన శైలి వల్ల యువకులు, చురుకుగా ఉండే వ్యక్తులకు కూడా బానపొట్ట వచ్చేస్తుంది.

బీర్ లో టాప్ 10 ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్: క్లిక్ చేయండి

ఇప్పటి వన్-క్లిక్, వన్-మెస్సేజ్, వన్-కాల్ వాతావరణం వల్ల పొట్ట తగ్గించుకుని నియంత్రించు కోవాలి అంటే కొంత శ్రమ అవసరమే. బానపొట్ట తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ నిపుణులు సూచించిన వ్యాయామాలు చేయడానికి మీకు విశ్వాసంతో కూడిన దృక్పధం, అంకితభావం ఉండాలి.

బానపొట్ట తగ్గించుకునే మార్గాలు:

బీర్ త్రాగడానికి - బాన పొట్టకు సంబంధమేంటి..?

సానుకూల దృక్పధం: ఏ ప్రయత్నం లోనైనా విజయం సాధించాలి అంటే, విజయం సాధించడం అనేది ఒక వ్యక్తీ మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మీరు సాధించగలరు అనుకుంటే ఖచ్చితంగా గెలవగలరు. అందువల్ల మీరేదైనా పని చేపట్టే ముందు జీవితం పట్ల సానుకూల దృక్పధం కలిగిఉండడం ముఖ్యం - అది పెద్ద వ్యాపార వ్యవహారమైనా లేదా బరువు తగ్గే ప్రయత్నమైనా.

బీర్ త్రాగడానికి - బాన పొట్టకు సంబంధమేంటి..?

లక్ష్యాలు పెట్టుకోండి: విజయం సాధించాలి అంటే లక్ష్యాలు నిర్దేశించుకోవడం ముఖ్యం. మీరు బానపొట్ట తగ్గించుకోవాలి అంటే ముందుగా చిన్నవి, వాస్తవికమైనవి, సాధ్యమైనవి అయిన లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. లక్ష్యాలు మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేస్తాయి - చిన్న లక్ష్యాల సాధన మిమ్మల్ని పెద్ద వాటివైపు ప్రేరేపిస్తుంది.

బీర్ త్రాగడానికి - బాన పొట్టకు సంబంధమేంటి..?

నడక: పొట్ట తగ్గించుకోవడానికి అన్నిటికన్నా తేలికైన వ్యాయామం నడవడమే. మీ దినచర్యలో చురుకుగా నడవడాన్ని ఒక భాగం చేసుకుని, తేలిగ్గా కొన్ని కిలోల బరువు తగ్గొచ్చు. నడవడం బరువు కోల్పోవడానికి అవసరమైన క్యాలరీ లోటుకు కూడా ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.

బీర్ త్రాగడానికి - బాన పొట్టకు సంబంధమేంటి..?

వైట్ బ్రెడ్ తినకండి: ఉదయానే అల్పహరంతో బ్లాక్ కాఫీతో కూడిన వైట్ బ్రెడ్ ను మీరు ఆస్వాదిస్తూ ఉండవచ్చు, అయితే వైట్ బ్రెడ్ ఆరోగ్యకరమైన ఎంపిక కాదని మీరు తెలుసా. వైట్ బ్రెడ్ లాంటి శుద్దీకరించిన పదార్ధాలు తినేవారిలో పొట్ట భాగంలో కొవ్వు పేర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.

బీర్ త్రాగడానికి - బాన పొట్టకు సంబంధమేంటి..?

భోజనం మానేయకండి: మీ బిజీ షెడ్యూల్ వల్ల మీరు భోజనాలు మనేస్తూ ఉంటారు, మీకు పొట్ట భాగంలో కొవ్వు పేరుకుంటుంటే అందువల్ల మీరు సంతోష పడుతూ ఉండవచ్చు. కానీ బరువు తగ్గడానికి భోజనం మానేయడం అంత మంచి ఆలోచన కాదు, ఎందుకంటే శరీరంలో జీవక్రియను వేగవంతం చేయాలంటే ప్రతి భోజనం అవసరమే. అదువల్ల మీరు ఏ ఆహారాన్ని మానవద్దు, అంతేకాక పూర్తిగా ఆహారాన్ని నమిలి తినడం వల్ల మీ ఆకలి మందగిస్తుంది. చల్లని నీటి బదులు వేడి నీటిని తాగండి, ఇది మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది, క్యాలరీలను మరింత తగ్గిస్తుంది.

బీర్ త్రాగడానికి - బాన పొట్టకు సంబంధమేంటి..?

మీ భంగిమను మెరుగుపరుచుకోండి: అప్రస్తుతంగా అనిపించినా, ఇది మీరు శ్రద్ధ తీసుకోవలసిన విషయమే. నడిచేటపుడు వంగిపోవడం లేదా ముందుకు వంగడం లాంటివి బానపొట్ట రావడానికి కారణం కావచ్చు. అందువల్ల మీరు నిటారుగా నడవడం, కూర్చోవడం నేర్చుకుని బానపోట్ట తగ్గించుకోండి, వెన్నునొప్పి పోగొట్టుకోండి.

బీర్ త్రాగడానికి - బాన పొట్టకు సంబంధమేంటి..?

మీ పొత్తికడుపు కండరాలకు వ్యాయామం ఇవ్వండి: పొత్తికడుపు దగ్గరి కండరాలు బలహీనంగా ఉంటె కూడా బానపొట్ట రావచ్చు. మీ దినచర్యలో వాటికోసం ప్రత్యేకమైన వ్యాయామం ఉండేలా చూసుకుంటే ఈ సమస్య తగ్గించుకోవచ్చు. ఏదైనా జిమ్ లో చేరండి లేదా ఆ వ్యాయామాలు ఏమిటో కనుక్కుని ఇంటివద్దే చేయండి.

బీర్ త్రాగడానికి - బాన పొట్టకు సంబంధమేంటి..?

బీర్ తక్కువగా తాగండి: బీర్ ఎక్కువగా సేవిస్తే లివర్ లోను, చుట్టుపక్కల ఇతర అంతర్గత అవయవాల లోనూ కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. మామూలుగా వచ్చే బానపొట్ట కన్నా బీరు తాగితే వచ్చే పొట్ట మరింత గట్టిగా ఉంటుంది. మీ పొట్టను ధృడంగా చేసేవి కండరాలు కాదు, కానీ ప్రమాదకరమైన కొవ్వు పేరుకుంటే గుండె, జీర్ణవ్యవస్థ కు సంబంధించిన సమస్యలు రావచ్చు.

Desktop Bottom Promotion