Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
Hug Day 2025: కౌగలింతతో ఆరోగ్య ప్రయోజనాలివే..రోజులో ఎన్నిసార్లు,ఎంతసేపు హగ్ చేసుకోవాలి?
వాలంటైన్ వీక్ లో భాగంగా ఈ రోజుని(ఫిబ్రవరి 12)హగ్ డే(Hug Day 2025) గా జరుపుకుంటారు. ప్రజలు ఈ రోజును మ్యాజిక్ హగ్ ఇచ్చి జరుపుకుంటారు. మీ భాగస్వామిని మాత్రమే కౌగిలించుకోవాల్సిన అవసరం లేదు..ఈ రోజున మీ అమ్మ, నాన్న, ఫ్రెండ్, సోదరి, సోదరుడు, మీ పెంపుడు జంతువులను కూడా ఆప్యాయంగా కౌగిలించుకోవడం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు. కౌగిలించుకోవడం అనేది ఒక భావోద్వేగం. చాలా సంతోషంగా ఉన్నప్పుడు, చాలా విచారంగా ఉన్నప్పుడు కూడా ఇతరులను కౌగిలించుకొని ఎమోషనల్ అవుతుంటారు.
కౌగిలింత భావోద్వేగాలను మాత్రమే కాకుండా ప్రేమను కూడా వ్యక్తపరుస్తుంది. హగ్ చేసుకోవడం ద్వారా మీరు అవతలి వ్యక్తికి మీ ప్రేమ, ఆప్యాయతలను అనుభూతి చెందేలా చేయవచ్చు. అయితే కౌగిలించుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని మీకు తెలుసా? హగ్ చేసుకోవడం ద్వారా శరీరంలో ఏం మార్పు జరుగుతుంది? ఒక రోజులో ఎన్నిసార్లు,ఎంత సమయం కౌగిలించుకోవాలి?

కౌగిలించుకోవడం ద్వారా శరీరంలో విడుదలయ్యే 3 హార్మోన్లు
ఆక్సిటోసిన్
చేతులు పట్టుకున్నప్పుడు లేదా ఏదైనా రకమైన స్పర్శ సంభవించినప్పుడు కూడా ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. భావోద్వేగ బంధానికి ఇది చాలా ముఖ్యం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను పెంచడమే కాకుండా ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కూడా బలపరుస్తుంది. ఈ హార్మోన్‌ను ప్రేమ హార్మోన్ అని కూడా అంటారు. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ హార్మోన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
డోపమైన్
కౌగిలించుకోవడం వల్ల డోపమైన్ అనే ప్రేమ హార్మోన్ కూడా విడుదలవుతుంది. ఈ హార్మోన్ ఒక వ్యక్తికి మంచి అనుభూతిని కలిగిస్తుంది.
సెరోటోనిన్
హగ్ చేసుకున్నప్పుడు సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఇది మానసిక స్థితిని బాగా ఉంచుతుంది.
కౌగలించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ?
మానసిక స్థితి కూల్ గా
కౌగిలించుకోవడం వల్ల ప్రేమ భావన కలగడమే కాకుండా మానసిక స్థితి కూడా బాగుంటుంది. ఎవరైనా దేని గురించైనా ఆందోళన చెందుతుంటే మీ కౌగిలింత వారి ఉద్రిక్తతను చాలా వరకు తగ్గిస్తుంది. కౌగిలించుకోవడం వల్ల సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. ప్రతి వ్యక్తి తమ దినచర్యలో కౌగిలింతలను చేర్చుకోవాలి. కౌగిలించుకోవడం వల్ల ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఎందుకంటే అవతలి వ్యక్తి తమకు విలువ ఇస్తున్నారని వారు భావిస్తారు.
ఒత్తిడి పోతుంది
కౌగిలింతలు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. నిజానికి, కౌగిలించుకోవడం వల్ల మీ కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది, దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా పిలుస్తారు. మీ కార్టిసాల్ స్థాయి ఎక్కువగా ఉంటే. అది ఒత్తిడి,ఆందోళన వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
10 సెకన్ల పాటు కౌగిలించుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలపడుతుంది. సాయంత్రం ఆఫీసు నుండి అలసిపోయి ఇంటికి చేరుకున్న వారు తమ భాగస్వామి వచ్చిన వెంటనే కౌగిలించుకుంటే వారి అలసట కొన్ని సెకన్లలోనే మాయమై రిలాక్స్ గా, ఉత్సాహంగా ఉంటారు.
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
కౌగిలింతలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి . దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ సరిగ్గా సరఫరా అవుతుంది.
మీ మెదడు పదునుగా మారుతుంది
కౌగిలింతలు మన జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తాయి. ఇది శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మెదడుని షార్ప్ గా ఉంచుతుంది.
గుండె ఆరోగ్యం
ఒక పరిశోధన ప్రకారం 20 సెకన్ల కౌగిలింత గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఒక రోజులో ఎన్నిసార్లు కౌగిలించుకోవాలి?
ఒక రిపోర్ట్ ప్రకారం పురుషులు, మహిళలు ఒక రోజులో 8 నుండి 12 సార్లు కౌగిలించుకోవాలి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి మనుగడకు రోజుకు 4 కౌగిలింతలు అవసరం, 8 కౌగిలింతలు సమతుల్యంగా ఉంచుతాయని..రోజుకు 12 కౌగిలింతలు జీవితంలో పురోగతి సాధించడానికి ప్రేరేపిస్తాయని రిపోర్ట్ చెబుతుంది. కౌగిలింతలు ఒకేసారి కనీసం 20 సెకన్ల పాటు ఉండాలి.
నొప్పి నివారిణిలా పనిచేస్తుంది
రోజుకు 8 నుండి 12 సార్లు ఒకరినొకరు కౌగిలించుకునే జంటలు ఇతరుల కంటే చాలా తక్కువ నొప్పిని అనుభవిస్తారని ఓ రిపోర్ట్ తెలిపింది. కౌగిలింత నొప్పి నివారణ లాగా పనిచేస్తుంది. ఇది బాధను, దుఃఖాన్ని కూడా మరచిపోయేలా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications