Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
భారతీయులకు బిగ్ షాక్ ..73శాతం పెరగనున్న షుగర్ కేసులు..మీకు రాకూడదంటే ఇలా చేయండి
ప్రస్తుతం ప్రపంచంలో చాలామందిని భయపెట్టే వ్యాధి షుగర్. దీనిని మధుమేహం లేదా డయాబెటిస్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మనదేశంలోనే ఎక్కువమంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. అందుకే మనదేశాన్ని వరల్డ్ డయాబెటిస్ క్యాపిటల్ అని కూడా పిలుస్తుంటారు. ఇంటర్నేషల్ డయాబెటిస్ ఫెడరేషన్(IDF)డేటా ప్రకారం భారత్ లో ప్రస్తుతం దాదాపు 9 కోట్లమంది డయాబెటిస్ పేషెంట్లు ఉన్నారు. అయితే తాజాగా బయటికొచ్చిన ఓ రిపోర్ట్ ఇప్పుడు దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది.
భారత్ లో మధుమేహం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. 2050 నాటికి భారత్ లో డయాబెటిస్ కేసులు 15.6 కోట్లకు చేరుకునే అవకాశముందని అంచనాలు బయటికొచ్చాయి. అంటే ఇప్పుడున్న కేసులకన్నా 73శాతం పెరుగుతాయని అర్థం. ముంచుకొస్తున్న ఆరోగ్య సంక్షోభానికి హెచ్చరిక అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లుదు. వేగంగా మారుతున్న జీవనశైలి, క్రమరహిత డైట్స్, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలలో భారత్ తీవ్ర ఆరోగ్య సంక్షోభం దిశగా పయనిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఈ భయానక పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపడం అత్యంత అవసరం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ రోజును సరైన విధంగా ప్రారంభిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించవచ్చు. మీ రోజు ఎలా మొదలవుతుందనే దానిపై మీ రక్తంలో చక్కెర స్థాయిలు లేదా షుగర్ లెవల్స్ రోజంతా ఎలా ఉంటాయనేది ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సాధారణ అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మధుమేహం బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆ 15.6 కోట్ల మందిలో మీరూ ఒకరు కాకూడదంటే ఏం చేయాలో ఇక్కడ చూడండి.
ఉదయం పాటించాల్సిన 7 సింపుల్ సూత్రాలు
సూర్యోదయం అప్పుడే నిద్రలేవండి
ఉదయపు సూర్యకిరణాలు మీ శరీరంలోని సిర్కాడియన్ రిథమ్‌ను క్రమబద్ధీకరిస్తాయి. ఇది ఇన్సులిన్ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పగటి వెలుగుకు అనుగుణంగా ఉండటం రక్తంలో చక్కెర జీవక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ ఉదయం కనీసం 15 నిమిషాలు కిటికీ దగ్గర కూర్చోవడం లేదా బాల్కనీలో నిలబడటం కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
నిద్రలేచిన వెంటనే ఫోన్ ను పక్కన పెట్టండి
కళ్ళు తెరవగానే ఫోన్ లో మునిగిపోవడం చాలామందికి అలవాటు. కానీ ఇది మీ మెదడును వేగంగా ఆలోచించేలా చేస్తుంది. ఈ చర్య ఆందోళనను పెంచుతుంది. ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. కాబట్టి నిద్రలేచిన తర్వాత ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి లేదా ఒక డైరీలో రాయడం ప్రారంభించండి. ఇది ఉదయపు కార్టిసాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థిరంగా ఉండేలా చేస్తుంది.
బ్రేక్ ఫాస్ట్ లేటుగా తినొద్దు
నిద్రలేచిన తర్వాత ఎక్కువసేపు తినకుండా ఉండటం వల్ల మీ శరీరం ఒక రకమైన ఒత్తిడికి గురవుతుంది. తర్వాత మీరు ఆహారం తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరుగుతాయి. నిద్రలేచిన ఒక గంటలోపు ప్రోటీన్లు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, మంచి కొవ్వులు కలిగిన సమతుల్యమైన అల్పాహారం తీసుకోవడం రోజంతా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. పెసరట్టు, గింజలతో ఓట్స్ లేదా అవోకాడోతో శనగపిండి టోస్ట్ వంటివి మంచి ఆప్షన్స్.
మెంతి నీరు
మన పూర్వీకులు చెప్పిన ఈ చిట్కా సైన్స్ కూడా అంగీకరిస్తోంది. రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ మెంతులు నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
10 నిమిషాల వ్యాయామం
ఉదయం పూట చేసే కఠినమైన వ్యాయామాలు కార్టిసాల్ అనే హార్మోన్ ను పెంచుతాయి, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉంది. అందుకే యోగా, గడ్డిపై నడవడం లేదా 10 నిమిషాల ప్రాణాయామం వంటి తేలికపాటి వ్యాయామాలతో మీ రోజును ప్రారంభించండి. ఇలాంటి తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామాలు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు చాలా మంచివని అధ్యయనాలు చెబుతున్నాయి.
దాల్చిన చెక్క టీ
ఈ చిన్నపాటి చిట్కా అద్భుతాలు చేస్తుంది. దాల్చిన చెక్క ఇన్సులిన్ మరింత బాగా పనిచేయడానికి సహాయపడుతుంది..లవంగాలలో వాపును తగ్గించే గుణాలు ఉన్నాయి. ఒక కప్పు నీటిలో ఒక దాల్చిన చెక్క ముక్క, రెండు లవంగాలు వేసి మరిగించి ఉదయం గోరువెచ్చగా తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఈ పండ్లే తినాలి
ఖాళీ కడుపుతో పండు తినడం అంత మంచిది కాదని చాలామంది అనుకుంటారు. కానీ జామ, నేరేడు, కివి, ఉసిరి వంటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే, ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు తింటే చాలా మంచిది. ఇవి అల్పాహారం తర్వాత చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తాయి, జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. ఈ సాధారణ ఉదయపు అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకుంటే మధుమేహం యొక్క ప్రమాదాన్ని తగ్గించవచ్చు, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











