Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
మీ ఇంట్లో RO వాటర్ వాడుతున్నారా? మలమూత్రాల ద్వారా వచ్చే ఈ-కొలి బ్యాక్టీరియా..తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
మన ఇంట్లో ఒక RO ప్యూరిఫైయర్ ఉంటే చాలు, మనం తాగే నీళ్లు 100 శాతం సేఫ్ అని, ఎలాంటి జబ్బులు రావని చాలామంది ధీమాగా ఉంటారు. కానీ అసలు ముప్పు ఫిల్టర్ అయిన తర్వాతే మొదలవుతుందని మీకు తెలుసా? ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ మద్రాస్ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగుచూశాయి. ఫిల్టర్ అయిన నీటిని మనం ఇంట్లో నిల్వ చేసుకునే విధానంలో ఉన్న లోపాల వల్లే అందులో ఈ-కొలి(E. coli) లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరుతోందని, ఇది తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తోందని తేలింది.

అసలు స్టడీ ఏం చెబుతోంది?
ఐఐటీ మద్రాస్ పరిశోధకులు చెన్నై నగరంలో RO ప్యూరిఫైయర్లు వాడుతున్న ఇళ్ల నుంచి 262 ఫిల్టర్ వాటర్ శాంపిల్స్ ను సేకరించి పరీక్షించారు. ఇందులో ఏకంగా 81 శాంపిల్స్ లో ఈ-కొలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు. సాధారణంగా ఈ బ్యాక్టీరియా మానవులు లేదా జంతువుల వ్యర్థాల ద్వారా నీటిలో కలుస్తుంది. దీనివల్ల డయేరియా, తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, జ్వరం రావడమే కాకుండా, కొన్నిసార్లు కిడ్నీలకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
ఇక్కడ గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ ఇళ్లలోని RO మిషన్లు బాగానే పనిచేస్తున్నాయి. వాటిలో ఎలాంటి లోపం లేదు. కానీ ఫిల్టర్ అయిన తర్వాత నీటిని పట్టుకునే పాత్రలు, నిల్వ చేసే విధానం వల్లే నీరు మళ్లీ కలుషితం అవుతోంది. చాలామంది వాటర్ ప్యూరిఫైయర్‌ను కొని బిగించిన తర్వాత, దాన్ని శుభ్రం చేయడం (సర్వీసింగ్) పూర్తిగా మర్చిపోతారు. ఇలా నెలల తరబడి ఫిల్టర్ ను శుభ్రం చేయకపోవడం వల్ల, ఆ ఫిల్టర్ లోపలే బ్యాక్టీరియా, బూజు లాంటి సూక్ష్మక్రిములు వృద్ధి చెంది, చివరికి మనం తాగే నీటిలో కలుస్తున్నాయి.
శుభ్రమైన నీరు మళ్లీ ఎలా కలుషితం అవుతోంది?
మనలో చాలామందికి తెలియకుండానే చేసే కొన్ని చిన్న పొరపాట్లే మన పాలిట శాపంగా మారుతున్నాయి.
-సరిగ్గా తోమకుండా ఉన్న ప్లాస్టిక్ లేదా స్టీల్ బిందెల్లో నీరు పట్టుకోవడం.
-నీళ్లు పట్టిన తర్వాత పాత్రలపై మూతలు పెట్టకుండా వదిలేయడం.
-ఒకే పాత్రను కడగకుండా రోజుల తరబడి మళ్లీ మళ్లీ వాడటం.
చాలా ఇళ్లలో చేసే అతిపెద్ద తప్పు.. RO నీళ్లు పట్టుకునే ముందు, ఆ పాత్రను పంపు నీళ్లతో కడగడం. ఇలాంటి అలవాట్ల వల్ల ట్యాప్ వాటర్ లేదా గాలిలో ఉండే బ్యాక్టీరియా ఆ పాత్రలోకి చేరి, ఫిల్టర్ నీటిలో వేగంగా వృద్ధి చెందుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే వంటగదిలోని సింకులు, శుభ్రం చేయని ప్యూరిఫైయర్ ట్యాప్ లు కూడా బ్యాక్టీరియాకు ఆవాసంగా మారుతున్నాయి.

మనం ఏం చేయాలి? నిపుణుల సూచనలు ఇవే
-నీటిని నిల్వ చేసే బిందెలు, బాటిళ్లను ప్రతిరోజూ శుభ్రంగా కడగాలి.
-నీళ్లు పట్టిన తర్వాత పాత్రలపై ఎప్పుడూ మూత ఉంచాలి.
-పాత్ర లోపల చేతులు పెట్టకుండా, బయటి అంచులను మాత్రమే పట్టుకుని వాడాలి.
-నిర్ణీత సమయానికి RO ఫిల్టర్లను మెకానిక్ తో సర్వీసింగ్ చేయించాలి.
-నీళ్ల బిందెలను వంటగది సింక్‌కు దూరంగా, ఎండ నేరుగా పడని చల్లని ప్రదేశంలో ఉంచాలి.
-ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న ఇళ్లలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అక్కడ నీటి కాలుష్యం చాలా తక్కువగా ఉన్నట్లు ఈ స్టడీలో తేలింది.
మరోవైపు, ఈ RO ఫిల్టర్ల వల్ల నీటి వృథా కూడా భారీగానే జరుగుతోందని అధ్యయనంలో తేలింది. పది లీటర్ల నీటిని ఫిల్టర్ చేస్తే, మనకు తాగడానికి కేవలం 3 లీటర్ల స్వచ్ఛమైన నీరు మాత్రమే లభిస్తోంది. మిగిలిన 7 లీటర్ల నీరు విషపూరితమైన భార లోహాలతో కలిసి బయటకు పోతోంది. దీనికి తోడు, ఈ ఆరో విధానం నీటిలోని చెడును మాత్రమే కాకుండా, మన శరీరానికి అత్యంత అవసరమైన సహజ ఖనిజ లవణాలను , అయాన్లను కూడా నాశనం చేస్తోంది. దీనివల్ల ఆ నీరు తాగినా శరీరానికి తగిన పోషకాలు అందవు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
