Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఇడ్లీ,చపాతీ,దోశ పిండిలో రోజూ ఈ పొడి కొంచెం కలుపుకోండి..జీవితంలో ఏ రోగాలు రావు!
మనదేశాన్ని వరల్డ్ డయాబెటిస్(Diabetes) క్యాపిటల్ గా కూడా పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలో అత్యధికంగా మధుమేహం పేషెంట్లు ఉన్న దేశం మనదే కాబట్టి. అయితే ఒక్కసారి డయాబెటిస్ వస్తే జీవితాంతం దాన్ని కంట్రోల్ లో ఉంచుకోగలం తప్ప పూర్తిగా నియంత్రించలేం. అది కూడా క్రమశిక్షణతో కూడా డైట్,జీవనశైలి(Lifestyle) వల్లనే డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచగలం. అయితే డయాబెటిస్ పేషెంట్లు తమ ఆహారంలో భాగంగా పనస పిండి తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పనస పిండిని కేరళ రాష్ట్రంలో ఎక్కువగా వినియోగిస్తారు.
పనస పండు గింజలలో(Jackfruit seed) ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పనస పండు గింజలతో చేసిన పిండి ఆరోగ్యానికి పోషకమైనదిగా పరిగణించబడుతుంది. గోధుమ పిండి లేదా బియ్యప్పిండిలో పనసపండు పిండిని కలుపుకుని రోజూ తినవచ్చు. పనసపండు లాగానే పనస పిండి(Jackfruit flour) కూడా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా డయాబెటిస్ మాత్రమే కాదు అనేక రకాల ఇతర ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.

పనస పిండి తినడం వల్ల ప్రయోజనాలు
డయాబెటిస్ కంట్రోల్
పనస పిండి తినడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. ఇది గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటే రోజూ మీ ఆహారంలో పనసపండు పిండిని చేర్చుకోండి.
రక్తపోటు నియంత్రణ
పనస పిండిని తీసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఈ పిండిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది..ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. మీరు బ్లడ్ ప్రజర్ తో బాధపడుతున్నట్లయితే రోజూ గోధుమ పిండిలో పనస పిండి కలిపి తినండి.
ఊబకాయాన్ని తగ్గిస్తాయి
అధిక బరువు లేదా ఊబకాయాన్ని తగ్గించడంలో పనస పిండి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది ఫైబర్ యొక్క చాలా మంచి మూలంగా పరిగణించబడుతుంది, వీటిని తీసుకోవడం ద్వారా మీరు ఎక్కువ సమయం కడుపు నిండుగా అనిపించి అతిగా తినకుండా ఉండగలుగుతారు.
ఎముకలను బలపరుస్తుంది
మీ ఆహారంలో పనస పిండిని చేర్చుకోవడం ద్వారా మీ ఎముకల బలాన్ని పెంచుకోవచ్చు. ఇది ఎముకల పెరుగుదలను మెరుగుపరుస్తుంది. ఇది ఎముక నిర్మాణాన్ని మెరుగుపరచడంలో కూడా మీకు సహాయపడుతుంది.
ఫ్యాటీ లివర్
ఫ్యాటీ లివర్ సమస్య నుంచి పనస పిండి ఉపశమనం లభిస్తుంది. ఆయిల్ ఫుడ్ వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ఈ పనస పిండి తీసుకోవాలి.
మలబద్ధకం
మలబద్ధకం లేదా అజీర్తితో బాధపడేవారు పనస పిండిని తినాలి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
పనస పిండిని ఆహారంలో ఎలా చేర్చుకోవాలి
-ఒక రోజులో సుమారు 30 గ్రాముల పనస పిండిని తినవచ్చు.
-పనస పిండిని నేరుగా తినకుండా ఇతర పిండిలో కలుపుకుని తినండి.
-రోటీ, చీలా, ఉప్మా, ఇడ్లీ పిండుల్లో పన పిండి కలుపుకొని ఆ విధంగా కూడా తినవచ్చు.
Note: ఇంటర్నెట్ లో లభించిన ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. ఒక్కొక్కరి శరీర తీరు ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి దీనిని పాటించే ముందు నిపుణుల సచూనలు తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











