Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
సమోసాలు, జిలేబీలపై హెచ్చరికలు..ఊబకాయంపై కేంద్రం కొత్త అస్త్రం?
జిలేబీ,సమోసా అంటే ఇష్టపడనివాళ్లు ఎవరూ ఉండరు. ఆఫీసుల్లో,ఫ్యాక్టరీల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు బ్రేక్ సమయంలో లేదా టీ బ్రేక్ సమయంలో సమోసా తినే అలవాటు ఉంటుంది. ఇక ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే జిలేబీ గుర్తుకొస్తు్ది. నోరూరిపోయే వీటి రుచికి ఎవరైనా ఫిదా అయిపోతారు. రాజస్తాన్,యూపీ,మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో అయితే పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి సమోసా,జిలేబీ తింటుంటారు. అయితే ఇకపై వీటిని తినాల్సిందే ఓ నిమిషం ఆలోచించాల్సిందే. మనలో చాలామందికి ఇష్టమైన తినుబండారాలైన సమోసా,జిలేబీపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందంటూ ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.
మనదేశంలో ఊబకాయం బారిన పడుతున్న వాళ్ల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. దీని కారణంగా అనేక అనారోగ్యాలు చట్టుముడుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రధాని మోదీ కూడా ఊబకాయం తగ్గించుకోడానికి ఆయిల్ వాడకం తగ్గించుకోవాలని అనేక రకాల టిప్స్ తరచూ సూచిస్తున్నారు. అనేక ఫ్లాట్ ఫామ్ లపై దీని గురించి మాట్లాడుతూ ఫిట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. సమోసా,జిలేబీ ఊబకాయానికి ప్రధాన కారణంగా ఉంటున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం వీటిపై సిగరెట్ ప్యాకెట్ల తరహాలో ఆరోగ్య హెచ్చరికలు తప్పనిసరి చేసిందని ఆ వైరల్ వార్తలో ఉంది. వేయించిన,చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తినడం ఊబకాయాన్ని పోత్సహించడమే కాకుండా అధిక రక్తపోటుకి కారణమవుతుంది..అదేవిధంగా ఇది డయాబెటిస్,గుండె జబ్బులు,కిడ్నీ ఫెయిల్యూర్,బ్రెయిన్ స్ట్రోక్,క్యాన్సర్ కు దారితీస్తుంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం..దేశంలోని అన్ని గవర్నమెంట్ క్యాంటీన్లు, తినుబండారాల దుకాణాల్లో సమోసాలు, జిలేబీల వంటి పదార్థాల దగ్గర తప్పనిసరిగా హెచ్చరిక బోర్డులు పెట్టాలి. ఈ బోర్డులపై ఆయా పదార్థాలలో ఎంత నూనె, ఎంత చక్కెర ఉన్నాయో స్పష్టంగా ప్రదర్శించాలి. రోజూ మనం తినే ఈ అల్పాహారంలో ఎంత కొవ్వు దాగి ఉందో ప్రజలకు తెలియజేయడమే ఈ రంగురంగుల పోస్టర్ల ముఖ్య ఉద్దేశం అని వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. జిలేబీ,సమోసాపై ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం తీసుకోలేదు.
కోట్ల మంది సమస్యగా
భారతదేశంలో ఊబకాయం ఒక నిశ్శబ్ద మహమ్మారిలా విస్తరిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంచనాల ప్రకారం 2050 నాటికి మన దేశంలో ఊబకాయుల సంఖ్య 44.9 కోట్లకు చేరుకునే అవకాశముంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications