Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి!

పెరిగిన బరువు, పొట్ట చూసుకుని బాధపడుతున్నారా? జిమ్‌ కు వెళ్లి గంటల తరబడి చెమటోడ్చే సమయం లేదా? కేవలం రోజుకు 3-4 నిమిషాల సమయం కేటాయిస్తే చాలు మీ బరువు తగ్గడంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు మాయమవుతాయి. దీనికోసం జపనీయులు క్రమం తప్పకుండా చేసే ఒక అద్భుతమైన ఫ్రీ హ్యాండ్ ఎక్సర్ సైజ్ ని మీరు చేస్తే చాలు.

జపాన్‌ లో పొద్దున్నే పార్కులు, స్కూల్స్ లో, ఆఫీసుల్లో రేడియో ఆన్ చేసి, ఆ మ్యూజిక్ కి అనుగుణంగా గుంపులు గుంపులుగా ఈ వ్యాయామాన్ని చేస్తారు. దీనినే జపాన్‌ భాషలో రాజియో తైసో అంటే రేడియో వ్యాయామాలు అని పిలుస్తారు. ఈ ఎక్సర్ సైజ్ చేయడానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. చేతులు, కాళ్లు సాగదీయడం, నడుమును వంచడం, తేలికపాటి జంపింగ్ వంటివి మాత్రమే ఉంటాయి.

Japanese weight loss secret rajio taiso 3 minute workout for belly fat

ఈ వ్యాయామం మధ్యలో దీర్ఘ శ్వాసలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఎముకలు లేదా కీళ్లపై ఎలాంటి అదనపు భారం పడదు కాబట్టి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా దీనిని అత్యంత సులభంగా చేయవచ్చు.

ఈ వ్యాయామాన్ని ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం కేవలం 3 లేదా 4 నిమిషాల పాటు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది కేలరీలను కరిగించి త్వరగా బరువు తగ్గించడమే కాకుండా, శరీరానికి ఒక అందమైన ఆకృతిని ఇస్తుంది. కండరాల బలం కూడా విశేషంగా పెరుగుతుంది. జపనీయుల సుదీర్ఘ ఆయుష్షుకు, వారిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకపోవడానికి ఈ వ్యాయామమే ప్రధాన కారణం అని వారు గట్టిగా విశ్వసిస్తారు.

కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు!కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు!

మీ ఇంట్లోనే రేడియో తైసో వ్యాయామాలు చేయండిలా

సాగదీయడం (స్ట్రెచింగ్)
నిటారుగా నిలబడి, రెండు చేతులను తల పైకి ఎత్తాలి. గాలి పీలుస్తూ నెమ్మదిగా, తేలికగా పైకి గెంతాలి. మీ కాళ్లపై మరీ ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోండి.

చేతులు, పాదాల కదలిక
రెండు చేతులను పక్కలకు సమాంతరంగా చాచి, మీ పాదాల చీలమండలను నెమ్మదిగా పైకి, కిందికి కదపాలి.

భుజాల వృత్తాకార కదలిక
రెండు చేతులను ముందుకు చాచి, ఆపై వాటిని తల మీదుగా గుండ్రంగా తిప్పుతూ పక్కలకు తీసుకురావాలి. అదే సమయంలో భుజాలను కూడా వృత్తాకారంగా తిప్పాలి.

ఛాతీని విస్తరించడం
చేతులను మడిచి ఛాతీ దగ్గరకు తీసుకువచ్చి, ఆపై పక్కలకు బలంగా చాచాలి. ఆ తర్వాత నెమ్మదిగా కిందికి దించాలి.

పక్కలకు వంగడం

ఒక చేతిని తల పైకి ఎత్తి, మరో చేతిని నడుముపై ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా శరీరాన్ని ఎడమ నుండి కుడికి, అలాగే కుడి నుండి ఎడమకు వంచాలి.

శరీరాన్ని తిప్పడం (ట్విస్టింగ్)
కాళ్లను స్థిరంగా ఉంచి, నడుము పైభాగాన్ని మాత్రమే ఎడమవైపుకు, కుడివైపుకు మార్చి మార్చి తిప్పాలి. ఇది నడుము చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తుంది.

ముందుకు వంగడం
మీ రెండు చేతులను తల పైకి ఎత్తి, ఆపై రెండు చేతులను కిందికి దించి మీ కాలి వేళ్లను తాకడానికి ప్రయత్నించండి. ఈ భంగిమలో 10 సెకన్ల పాటు ఉండి, నెమ్మదిగా సాధారణ స్థితికి తిరిగి రండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, September 23, 2026, 18:56 [IST]
Desktop Bottom Promotion