Latest Updates
-
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
శీతాకాలంలో జుజుబీ ఫ్రూట్ తింటే బాడీ ఐరన్‌లా మారుతుంది.. ఎక్కడ దొరుకుతుందంటే?
ప్రకృతి మనకు కొన్ని కొన్ని సీజన్‌లో కొన్ని కోన్ని పండ్లను, కొన్ని ఆహార పదార్థాలను అందజేస్తుంది. అలానే కేవలం శీతాకాలంలోనే కొన్ని పండ్లు దొరుకుతాయి. ఇవి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అలాగే ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో పాటు అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడతాయి. ఇంతకీ ఆ పండు ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? ఎలా కొనుక్కోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రేగి పండు
రేగి పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కేవలం శీతాకాలంలో మాత్రమే లభిస్తాయి. సహజంగా పకృతి నుంచి లభించే ఈ పండు చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చలికాలం ప్రారంభం కాగానే ఈ పండు గిరిజన ప్రాంతాల్లో లభిస్తుంటుంది. అలాగే కొండ ప్రాంతాల్లో, పొదల్లో పెరుగుతాయి. ఈ పండు వివిధ సైజుల్లో ఉంటుంది. దీనిని మార్కెట్‌లో కిలో వంద రూపాయలకు అమ్ముతున్నారు.

గాయాలు మానడంలో..
రేగి పండు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం.. రేగి పండు తినడం వల్ల దగ్గు, జ్వరం, మలేరియా వంటి రోగాలు నయమవుతాయి. అలాగే ప్లేట్‌లెట్స్ లోపం ఉన్న వ్యక్తులు ఈ రేగిపండు తినడం వల్ల ఆ లోపాన్ని అధిగమించొచ్చు అని అంటున్నారు. ఇందులో విటమిన్ సీ, క్యాల్షియం, ఐరన్, పాస్పరస్, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గాయాల వెంటనే నయం చేసేందుకు సహాయపడతాయి.
జీర్ణ వ్యవస్థ కోసం
ఈ రేగి పండు జీర్ణ వ్యవస్థను పటిష్టం చేయడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని గింజలు, ఆకులు తినడం వల్ల అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. అలాగే కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
వాంతులు, వికారం కోసం
రేగి పండు గర్భిణీలకు ఒక వర ప్రసాదినిగా పరిగణిస్తారు. గర్భిణీల్లో వాంతులు, వికారం నివారించడానికి ఉపయోగపడతాయి. అలాగే దీని విత్తనాలు కూడా ఈ వ్యాధులను తగ్గించేందుకు సహాయపడతాయి. ప్రసవం తరువాత పాలిచ్చే మహిళల్లో పాల ఉత్పత్తి, పాల లోపం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆదాయం
ఈ పండు ద్వారా గిరిజన గ్రామాల్లోని మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారు. ఈ పండును పొదలు, కొండలు, పొలాల నుంచి సేకరించి మార్కెట్లో అమ్ముతుంటారు. కిలో వంద రూపాయలకు పైగానే విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. సహజసిద్ధంగా లభించే ఈ పండుతో ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా లభిస్తుంది. ఇలాంటి పండును ఈ శీతాకాలంలో తినడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
