Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే?
ఒకప్పుడు తెలుగు, తమిళం, మళయాలం అంటూ అన్ని బాషల్లో వరసుపెట్టి సినిమాల్లో నటిస్తూ, తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఖష్భూ ..ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీ అయ్యారు.
అయితే ఒకప్పుడు వెండితెరపై బొద్దుగా, ముద్దుగా కనిపించిన ఖుష్బూ సుందర్..ఇప్పుడు చాలా సన్నగా అయిపోయారు. ఆమెను చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. 56 ఏళ్ల వయసులో ఆమె గుర్తుపట్టలేనంత సన్నగా, ఎంతో యవ్వనంగా మారిపోయారు. గత ఐదేళ్ల వ్యవధిలో ఖుష్బూ ఏకంగా 40 కిలోల బరువు తగ్గి అందరికీ ఒక రోల్ మోడల్ గా నిలిచారు.

బరువు తగ్గాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే?
ఒకానొక సమయంలో ఖుష్బూ ఏకంగా 98 కిలోల బరువు ఉండేవారు. రజనీకాంత్ నటించిన పెద్దన్న సినిమా చూస్తున్న సమయంలో తెరపై తనని తాను చూసుకుని, బరువు తగ్గాలని ఆమె మొదటిసారిగా నిర్ణయించుకున్నారట. దానికి తోడు అధిక బరువు వల్ల మోకాళ్ల నొప్పులు కూడా మొదలవడంతో, వెంటనే తన ఫిట్ నెస్ ప్రయాణాన్ని ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు.
జపనీయుల టెక్నిక్
చాలామంది బరువు తగ్గాలంటే ఇష్టమైన భోజనం మానేయాలి, జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చాలి అనుకుంటారు. కానీ ఖుష్బూ ఇవేమీ చేయలేదు. తన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు మాత్రమే చేసుకున్నారట. ఆమె బరువు తగ్గడానికి ప్రధాన కారణం జపనీయుల ఆహారపు అలవాట్లు.
మనలో చాలామంది సమయానికి తినాలి కదా అని, ఆకలి ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి తినేస్తుంటారు. కానీ ఖుష్బూ మాత్రం శరీరానికి నిజంగా ఆకలి అనిపించినప్పుడు మాత్రమే తినాలి అనే కఠిన నియమాన్ని పెట్టుకున్నారు. అంతేకాదు జపనీయుల తరహాలో పెద్ద కంచంలో తినడం మానేసి, ఒక చిన్న గిన్నెలో తినడం అలవాటు చేసుకున్నారు. జపాన్ వాళ్లు 80, 90 ఏళ్ల వయసులో కూడా ఫిట్ గా ఉండటానికి ప్రధాన కారణం పోర్షన్ కంట్రోల్(తక్కువ పరిమాణంలో తినడం) అని గ్రహించిన ఆమె, ఇంట్లో తనకోసం ఒక చిన్న ప్లేట్ ను ప్రత్యేకంగా పెట్టుకున్నారు.

ఇష్టమైన ఆహారం మానలేదు..
బరువు తగ్గే క్రమంలో ఖుష్బూ తనకు ఇష్టమైన ఆహారాన్ని ఎప్పుడూ దూరం చేసుకోలేదు. తనకు ఎంతో ఇష్టమైన మటన్ బిర్యానీ, స్వీట్లు, ఐస్ క్రీమ్స్, చక్కెర వేసిన మిల్క్ టీ.. ఇలా అన్నీ తీసుకున్నారు. కానీ తినే పరిమాణాన్ని మాత్రం అదుపులో ఉంచుకున్నారు. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా బిర్యానీ, ఒకే ఒక మటన్ ముక్క వేసుకుని తినేవారు. టీ తాగినా చాలా మితంగానే తీసుకునేవారు.
జిమ్ కు వెళ్లకుండానే..
ఖుష్బూ జిమ్ కు వెళ్లి బరువైన వ్యాయామాలు చేయలేదు. ప్రతిరోజూ 45 నిమిషాల పాటు క్రమం తప్పకుండా నడక అలవాటు చేసుకున్నారు. అలాగే తన భర్తతో కలిసి ఇంట్లోనే నిత్యం యోగా సాధన చేసేవారు. ఇలా కఠినమైన డైట్ లేకుండా, జిమ్ మెట్లు ఎక్కకుండా, కేవలం జీవనశైలి మార్పులు, మితాహారం, నడక ద్వారా 40 కిలోలు తగ్గి అందరినీ అవాక్కయ్యేలా చేశారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
