Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే కిడ్నీ సంబంధిత వ్యాధులు బాధపెడుతున్నాయి. కిడ్నీల పనితీరు నెమ్మదించడం, రాళ్లు ఏర్పడటం ఇలా పలు సమస్యల బారిన పడుతున్నారు. ఇందుకు అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో లోపాల కారణంగా మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో కిడ్నీలు ఆరోగ్యకరంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక ప్రొటీన్ ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి, దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండాలని.. ప్రొటీన్‌ను సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను చేర్చుకోవడం ద్వారా వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా మూత్రపిండాలపై ఒత్తిడి పడకుండా ఆరోగ్యకరంగా పనిచేస్తాయి.
మూత్రపిండాలు ప్రతిరోజూ సుమారు 180 లీటర్ల రక్తాన్ని వడపోసి శుభ్రపరుస్తాయి. శుభ్రమైన రక్తాన్ని శరీరం తిరిగి గ్రహిస్తుంది. తద్వారా జీవక్రియ సక్రమంగా పనిచేస్తుంది. సరైన జీవక్రియ కోసం మూత్రపిండాల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది.
ఫిట్‌నెస్, ఇతర ఆరోగ్య విషయాలకు సంబంధించి కొందరు సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు. అయితే వీటిని అధికంగా తీసుకోకూడదు. ఎక్కువగా సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే అవి మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. వైద్యుడి సలహా లేకుండా ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన మూత్రపిండం ఒకటి ఉన్నా మనిషి ఏ సమస్యా లేకుండా బతకవచ్చు. మూత్రపిండం దానం చేసినా సంపూర్ణకరమైన జీవితం గడపవచ్చు.
మూత్రపిండాల ఆరోగ్యానికి పుష్కలంగా నీరు తాగాలి. రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడం ద్వారా శరీరం నుంచి వ్యర్థాలు సమర్థవంతంగా బయటకు పోతాయి. తద్వారా శరీరం శుభ్రపడుతుంది. బయటి చర్మం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది.
అయితే కేవలం మూత్రపిండాలు వ్యర్థాలను బయటకు పంపేందుకు మూత్రాన్ని మాత్రమే ఉత్పత్తి చేయవని నిపుణులు అంటున్నారు. అవి రక్తపోటును నియంత్రించి ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు దోహదపడుతుంది. శరీరంలో కాల్షియం సమతుల్యతను కాపాడి హార్మోన్ల ఉత్పత్తి చేస్తాయి.
కాగా, కొందరు మూత్రం రంగు తీరు అసాధారణంగా ఉన్నా.. ఏమైనా తేడాలు కనిపించినా నిర్లక్ష్యం వహిస్తారు. వ్యాధి ముదిరిన తర్వాత వైద్యుడిని సంప్రదిస్తారు. కానీ స్వల్పంగా లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. తద్వారా ప్రమాదకర పరిస్థితికి దారితీయకుండా.. శరీరంలో ఇతర భాగాలపై ప్రభావం పడకుండా ఉంటుంది.
అధికంగా పెయిన్ కిల్లర్స్ వాడటం కూడా మూత్రపిండాలకు హాని కలగవచ్చు. అయితే చాలా మందిలో మూత్రపిండాల పనితీరు 70 నుంచి 80 శాతం తగ్గినప్పటికీ అందుకు సంబంధించి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. నిద్రలేమి, తగినంత వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండటం.. ఇవన్నీ జీవక్రియపై ప్రభావం చూపి మూత్రపిండా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.

మరోవైపు మూత్రపిండాల నొప్పి ఎల్లప్పుడూ కిడ్నీ వ్యాధికి సంకేతం కాదని వైద్యులు అంటున్నారు. ఇది నడుము లేదా వెన్నునొప్పి తరచుగా కండరాలు, వెన్నెముక సమస్యలకు సంబంధించినది కావచ్చని చెబుతున్నారు. చాలావరకు మూత్రపిండాల వ్యాధులు ప్రారంభ దశలో నొప్పి లేకుండా ఉంటాయని.. ఏ తేడాలు గుర్తించినా వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
