Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
కిడ్నీలో రాళ్లు..చాలామందికి తెలియని విషయం ఇధే!
ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ల సమస్య సర్వసాధారణమైపోయింది. మహిళలు, పురుషులు అని తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. అయితే అందరి మదిలో మెదిలే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే.. కిడ్నీలో రాళ్ల వల్ల కలిగే నొప్పి స్త్రీ, పురుషులిద్దరికీ ఒకేలా ఉంటుందా? లేక ఏమైనా తేడా ఉందా? నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నివేదికల ప్రకారం కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి గల కారణాలు ఇంచుమించుగా ఇద్దరిలోనూ ఒకేలా ఉంటాయి. అయితే స్త్రీ, పురుషుల శరీర నిర్మాణం, హార్మోన్ల లెవల్స్ లో ఉండే సహజమైన వ్యత్యాసాల కారణంగా నొప్పి తీవ్రతలో, లక్షణాలలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి.
పురుషులలో నొప్పి ఎందుకు అంత తీవ్రంగా ఉంటుంది?
పురుషులలో కిడ్నీ స్టోన్ నొప్పి చాలా తీవ్రంగా ఉండటానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి.
శరీర నిర్మాణం: సాధారణంగా నడుము, పొత్తికడుపులో నొప్పి మొదలవుతుంది. అయితే ఆ రాయి మూత్రపిండాల నుంచి మూత్రనాళంలోకి జారినప్పుడు పురుషుల శరీర నిర్మాణం కారణంగా ఆ నొప్పి వారి వృషణాల వరకు కూడా వ్యాపిస్తుంది. ఇది అత్యంత తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది.

డీహైడ్రేషన్: వేడి వాతావరణంలో పనిచేసే పురుషులు ఎక్కువగా చెమట పట్టడం వల్ల డీహైడ్రేషన్ కు గురవుతారు. దీనివల్ల మూత్రం చిక్కబడి, రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
కాల్షియం, ఆక్సలేట్: కొన్ని పరిశోధనల ప్రకారం పురుషుల మూత్రంలో స్త్రీలతో పోలిస్తే కాల్షియం, ఆక్సలేట్ వంటి మినరల్స్ ఎక్కువగా విసర్జించబడతాయి. ఇవే రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం. అందుకే పురుషులకు కిడ్నీలో రాళ్లు పదేపదే వచ్చే అవకాశం కూడా ఎక్కువ.
మహిళల్లో కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి?
మహిళలు కూడా తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు. కానీ నొప్పితో పాటు వారిలో కొన్ని అదనపు లక్షణాలు కనిపిస్తాయి.
మానసిక, శారీరక ప్రభావం: రాళ్ల సమస్య వల్ల మహిళలు తీవ్రమైన అలసట, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు.
ఇన్ఫెక్షన్ల ముప్పు: రాళ్లకు సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్ విధానాల సమయంలో మహిళలకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI) సోకే ప్రమాదం పురుషుల కంటే ఎక్కువ. ఇది వారి ట్రీట్మెంట్ కాలాన్ని, నొప్పిని మరింత క్లిష్టతరం చేస్తుంది.
రుతుక్రమం ఆగిన తర్వాత: మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో నొప్పి అనుభవం భిన్నంగా ఉండవచ్చు.
నిపుణుల సూచనలు
రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. ఇది మూత్రపిండాలను శుభ్రంగా ఉంచి, రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.
అధిక రక్తపోటు (BP), మధుమేహం కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటిని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.
ఉప్పు వాడకాన్ని తగ్గించండి. ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.
ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వాటిని వెంటనే మానేయడం శ్రేయస్కరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications