Latest Updates
-
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం!
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కేసులు ముఖ్యంగా భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 14 ఏళ్ల లోపు వారిలో లింఫాటిక్ లుకేమియా అత్యంత సాధారణ క్యాన్సర్‌గా నమోదవుతున్నట్లు వెల్లడిస్తున్నాయి. గత ఐదేళ్లలో దేశంలో ఈ కేసులు 12.8 శాతం పెరిగాయని అంచనా. ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం.. దేశంలో ప్రతి ఏటా 50వేల కంటే ఎక్కువ మంది పిల్లలు లుకేమియాతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. పిల్లల తల్లిదండ్రులను ఆందోళనలో పడేసే ఈ బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఎందుకు వస్తున్నాయి.. దీనికి కారణాలు ఏంటి.. తెలుసుకుందాం..

DNAలో మార్పులే ప్రధాన కారణం
పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్‌కి అత్యంత సాధారణ కారణం మ్యుటేషన్ అంటే శరీరంలోని కణాల్లో డీఎన్‌ఏలో మార్పులే దీనికి దారితీస్తున్నాయని నిపుణులు అంటున్నారు. పెద్ద వయసు వారిలో ధూమపానం, పొగాకు అలవాటు, మద్యపానం, ఊబకాయం, హానికరమైన ఆరోగ్యకరమైన అలవాట్లు క్యాన్సర్‌కి కారణమైతే.. పిల్లల్లో క్యాన్సర్ వీటి వల్ల సంభవించదని చెబుతున్నారు. ఎదుగుతున్న పిల్లల్లో కొత్త కణాల పెరుగుదల వేగంగా ఉంటుంది. ఈ క్రమంలో డీఎన్‌ఏని కాపీ చేయడంలో ఏమైనా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ పొరపాట్లను డీఎన్‌ఏ రిపేర్ మెషీన్స్, రోగనిరోధక వ్యవస్థ సరిచేస్తాయి. కానీ మార్పులు ఎక్కువగా ఉండి వాటిని సరిదిద్దలేకపోతే క్యాన్సర్ సులభంగా అభివృద్ధి చెందవచ్చు.
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్?
తల్లిదండ్రుల తప్పు ఉందా..
చిన్న పిల్లల్లో వచ్చే లుకేమియాకి స్పష్టమైన కారణమనేది ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. పుట్టుకతో వచ్చే జెనెటికల్ సిండ్రోమ్‌లు ఈ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. దీనికి తల్లిదండ్రుల ఆహారపు అలవాట్లు కానీ జీవనశైలి కానీ కారణం కాదని చెబుతున్నారు.

పిల్లలు ఎదిగే క్రమంలో ఎముక మజ్జలో కొత్త రక్త కణాలు తయారవుతాయి. ఈ మజ్జ ప్రదేశం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే పిల్లలు పెరుగుతున్నప్పుడు కొత్త రక్త కణాల అవసరం ఉంటుంది. దీంతో మజ్జలోని కణాలు వేగంగా ఏర్పడి విభజన చెందే క్రమంలో వాటి పెరుగుదలను నియంత్రించే జన్యువుల్లో మార్పులు వస్తాయి. అసాధారణ తెల్ల రక్త కణాలు వేగంగా పెరిగి లుకేమియాకి దారితీసే ప్రమాదం ఉంది.
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం!
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
పిల్లల్లో లుకేమియా లక్షణాలు సాధారణంగా ఉంటాయి. వైరల్ ఫీవర్ లేదా ఇన్‌ఫెక్షన్ ఏర్పడవచ్చు. దీంతో ఈ వ్యాధిని గుర్తించడం ఆలస్యం కావచ్చు. ఈ క్రమంలో పిల్లల్లో తల్లిదండ్రులు పదే పదే ఈ లక్షణాలను గమనిస్తే వారు అప్రమత్తమై వైద్యుడిని సంప్రదించాలి.
ఈ లక్షణాల పట్ల అలర్ట్
పదేపదే జ్వరం రావడం, చేతులు, పాదాల్లో నొప్పులు రావడం, కీళ్ల వాపు, మెడ భాగంలో గడ్డలు, అవయవాల వాపు, ఉదర భాగంలో ప్లీహం పెరగడం వంటివి లుకేమియా లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. అయితే మలేరియా, టీబీ వంటి వ్యాధుల్లోనూ ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అందుకే తల్లిదండ్రులు ఇంటి వైద్యం జోలికి వెళ్లకుండా ఖచ్చితమైన రోగ నిర్ధారణ కోసం తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించాలి. దీని ద్వారా చికిత్స కూడా సులభం అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
