Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా!
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్?
మన శరీరంలో నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేసే అద్భుతమైన అవయువం గుండె. ఇది ఆరోగ్యంగా ఉంటేనే మనం ఉత్సాహంగా, దీర్ఘకాలం జీవించగలం. గుండెను జాగ్రత్తగా ఉంచుకోవాలని భావించినప్పుడు, ముందుగా అందరి దృష్టి ఆహారపు అలవాట్లపైనే పడుతుంది.
అయితే డైట్ మార్చాలనుకున్నప్పుడు చాలామందికి వచ్చే అతిపెద్ద సందేహం ఒక్కటే.. గుండెకు ఉప్పు ప్రమాదకరమా? లేక చక్కెరా? దేన్ని తగ్గిస్తే మన గుండె భద్రంగా ఉంటుంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు వైద్య నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారో ఇక్కడ చూడండి.

గుండె ఆరోగ్యం విషయంలో ఉప్పు, చక్కెర రెండూ ప్రమాదకరమైనవే. ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్నీ తక్కువ అంచనా వేయకూడదు. ఏదో ఒకదానిపై మాత్రమే దృష్టి పెట్టి, మరొకదాన్ని ఇష్టమొచ్చినట్లు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆరోగ్యకరమైన గుండె కోసం ఈ రెండింటి వినియోగాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఉప్పుతో వచ్చే ముప్పు
శరీరానికి ఉప్పు (సోడియం) అత్యవసరమే అయినప్పటికీ, అది శృతి మించితేనే అసలు సమస్య. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో నీరు నిలిచిపోయి బీపీ అమాంతం పెరుగుతుంది. ఇలా హై బీపీ నిరంతరంగా కొనసాగితే గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. కాలక్రమేణా ఇది గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచన ప్రకారం.. రోజుకు 5 గ్రాముల (సుమారు ఒక టీస్పూన్) కంటే తక్కువ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. మనం ఇంట్లో వంటల్లో వాడే ఉప్పు మాత్రమే కాకుండా చిరుతిళ్లు, ఊరగాయలు, పాపడ్, సాస్ లు, ఇన్ స్టంట్ నూడుల్స్, ప్యాక్ చేసిన ఆహారాల్లో దాగి ఉన్న సోడియం పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి.

తీయని విషం.. చక్కెర
చక్కెర అంటే కేవలం స్వీట్లు మాత్రమే అని పొరబడకండి. కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ఉండే అదనపు చక్కెర గుండెకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. వీటిలో ఉండే ఎంప్టీ క్యాలరీల వల్ల వేగంగా బరువు పెరుగుతారు. ఈ ఊబకాయం క్రమంగా టైప్ 2 మధుమేహం, హై బీపీ, గుండె జబ్బుల ముప్పును పెంచుతుంది.
WHO సూచన ప్రకారం.. మనం రోజూ తీసుకునే మొత్తం క్యాలరీలలో చక్కెర శాతం 10 కంటే తక్కువ (సుమారు 50 గ్రాములు) ఉండాలి. దీన్ని 5 శాతానికి (25 గ్రాములు) తగ్గించుకోగలిగితే గుండెకు మరింత మేలు జరుగుతుంది.
మరి ముందుగా దేన్ని తగ్గించాలి?
దీనికి అందరికీ సరిపోయే ఒకే ఫార్ములా లేదు. మీ శరీర తత్వాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇప్పటికే హై బీపీ ఉంటే, మీరు తక్షణం ఉప్పును తగ్గించాలి. అలాకాకుండా మీకు స్వీట్లు, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఎక్కువగా ఉంటే, ముందుగా చక్కెరను కంట్రోల్ చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
