Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
పడుకునే ముందు మీ పాదాలకు ఇలా చేస్తే ఈ నాలుగు సమస్యలు తొలిగిపోతాయి!
నెయ్యి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. నెయ్యి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. కానీ నెయ్యితో మసాజ్ చేయడం వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయి. పడుకునే ముందు పాదాలకు నెయ్యితో మర్దన చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే పలు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. పాతకాలంలోనే ఇలాంటి పద్ధతులు పాటించేవారని కానీ కాలక్రమేణా అది మరుగున పడిందని చెబుతున్నారు. అసలు నెయ్యితో పాదాలకు మర్దన చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఏ విధమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మలబద్దకం దూరం
సాధారణంగా చలికాలంలో చాలా మంది మలబద్దకం, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యల బారిన పడుతుంటారు. ఎన్నో రకాల మెడిసిన్లు వాడినా కొందరు ఫలితం పొందలేకపోతారు. అలాంటి వ్యక్తులు రాత్రి పడుకునేటప్పుడు నెయ్యితో పాదాలకు మర్దన చేసుకోవడం వల్ల మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ప్రతిరోజూ పడుకునే ముందు కొంచెం నెయ్యితో అరికాలికి మర్దన చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక మలబద్దకం నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.

కీళ్ల నొప్పులు
చలికాలంలో చాలా మంది సాధారణంగానే కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు తీవ్రంగా వేధిస్తుంటాయి. అలాగే నడుము నొప్పి సమస్యలు కూడా బాగా బాధపెడతాయి. అయితే రాత్రుళ్ళు పడుకునే ముందు పాదాలకు మర్దన చేసుకొని పడుకోవడం వల్ల దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. నెయ్యి పాదాలకు రాయడం వల్ల కీళ్ల మధ్యలో ద్రవం సరిగ్గా ప్రవహిస్తుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, నడుపు నొప్పులు, ఒళ్ళు నొప్పులు కూడా దూరం అవుతాయి.
ప్రశాంతమైన నిద్రకోసం
మసాజ్ చేసుకున్న తరువాత ప్రతిఒక్కరికీ సహజంగానే మంచి నిద్ర పడుతుంది. అయితే ప్రతిరోజూ పాదాలకు నెయ్యితో మర్దన చేసుకొని పడుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఒత్తిడి దూరమై ప్రశాంతంగా నిద్రపోతారు. అలాగే నొప్పులు, చికాకులు దూరమవడం వల్ల చాలా మంచి నిద్రపట్టే అవకాశం ఉంటుంది. అలాగే శరీరం తేలికగా మారడంతో మంచి నిద్ర మీ సొంతం అవుతుంది.
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
చలికాలంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. దీని కారణంగా సరిగ్గా రక్త ప్రసరణ జరగదు. నెయ్యి పాదాలకు రాసుకొని మసాజ్ చేసుకోవడం వల్ల.. రక్త ప్రసరణ సరిగ్గా జరిగేందుకు సహాయపడుతుంది. పాదాలకు మసాజ్ చేయడం వల్ల నరాలు అన్నీ ఉత్తేజితం అవుతాయి. దీని కారణంగా రక్తప్రసరణ మెరుగుపడి.. గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే గుండె జబ్బులను నుంచి రక్షణ పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications