Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వైద్య శాస్త్రంలో అద్భుతం..ఖరీదైన స్కాన్ లకు చెక్..ఒక్క రక్త పరీక్షతో లంగ్ క్యాన్సర్ గుర్తింపు!
వైద్య రంగంలో అద్భుతమైన ముందడుగు పడింది. సాధారణంగా క్యాన్సర్ అంటేనే ఇక మరణం అన్న భయం చాలామందిలో ఉంటుంది. ఇక అందులోనూ లంగ్ క్యాన్సర్(ఊపిరితిత్తుల క్యాన్సర్) అంటే మంచంలో పడి నరకం అనుభవించి మరణించాల్చిందేనని చాలామంది భావిస్తుంటారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటేనే మరణానికి పర్యాయపదంగా భావించే రోజులకు ఇక కాలం చెల్లిపోనుంది. వ్యాధిని గుర్తించడంలో జరిగే జాప్యమే అత్యధిక మరణాలకు కారణమవుతోంది. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు బ్రిటన్ కు చెందిన యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ నార్త్ మిడ్ ల్యాండ్స్ (UHNM), కీలే, లౌబరో యూనివర్సిటీల పరిశోధకులు సంయుక్తంగా ఒక వినూత్న బ్లడ్ టెస్టును అభివృద్ధి చేశారు. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఒక కొత్త శకానికి నాంది పలకనుంది.

కాంతితో క్యాన్సర్ గుర్తింపు
సాధారణంగా క్యాన్సర్ కణితుల నుండి విడిపోయిన కణాలు రక్తంలో ప్రయాణిస్తాయి. ఇవి తరచుగా తమ ఆకారాన్ని, లక్షణాలను మార్చుకుంటూ ఉంటాయి. దీనివల్ల ప్రస్తుతం ఉన్న సంక్లిష్టమైన, ఖరీదైన టెస్ట్ ల పద్ధతులు వీటిని గుర్తించడంలో ఫెయిల్ అవుతున్నాయి లేదా ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి.
కానీ తాజాగా పరిశోధకులు డెవలప్ చేసిన కొత్త పద్ధతిలో ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇన్‌ఫ్రారెడ్ మైక్రోస్పెక్ట్రోస్కోపీ అనే అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
ఇది ఎలా పనిచేస్తుందంటే
డాక్టర్లు రోగి రక్త నమూనాపై ఇన్ ఫ్రారెడ్ కాంతిని ప్రసరింపజేస్తారు. ప్రతి మనిషికి వేలిముద్ర ఎంత ప్రత్యేకమో, మన శరీరంలోని ప్రతి కణానికి ఒక రసాయన వేలిముద్ర ఉంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల రసాయన వేలిముద్ర, సాధారణ ఆరోగ్యకరమైన కణాల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ తేడాను పసిగట్టి, లక్షలాది సాధారణ కణాల మధ్య దాగిన ఒక్క క్యాన్సర్ కణాన్ని కూడా ఈ టెక్నాలజీ గుర్తించగలదు.
ఏఐతో కచ్చితత్వం
ఈ పరిశోధనలో భాగంగా మూడు వేర్వేరు సమూహాలకు చెందిన 1814 మంది రక్త నమూనాలను విశ్లేషించారు. LungCanSeek అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అల్గారిథమ్ లను ఉపయోగించి ఈ పరీక్షను రూపొందించారు. ఇది కేవలం క్యాన్సర్ ను గుర్తించడమే కాకుండా, ఊపిరితిత్తుల క్యాన్సర్ లో ప్రధాన రకాలైన LUAD, LUSC, SCLC లను కచ్చితంగా వర్గీకరిస్తుంది.

అనవసర స్కాన్ లకు చెక్
ఈ బృందం రెండు దశల స్క్రీనింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. ముందుగా LungCanSeek ద్వారా రక్త పరీక్ష చేస్తారు. ఇందులో ఫలితం పాజిటివ్‌గా వచ్చిన వారికి మాత్రమే తక్కువ డోస్ CT స్కాన్ (LDCT) చేసి నిర్ధారిస్తారు. ఈ విధానం వల్ల రోగులకు అనవసరమైన, ఖరీదైన స్కాన్ ల బాధ తప్పుతుంది. రేడియేషన్ ప్రభావం కూడా తగ్గుతుంది.
ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జోసెప్ సులే సుసో మాట్లాడుతూ..మేము అభివృద్ధి చేసిన టెక్నాలజీ, అధునాతన ఇన్ ఫ్రారెడ్ స్కానింగ్ ను కంప్యూటర్ విశ్లేషణతో మిళితం చేస్తుంది. దీనివల్ల రోగి రక్తంలో ఉన్న ఒక్క క్యాన్సర్ కణాన్ని కూడా దాని రసాయన వేలిముద్ర ఆధారంగా గుర్తించగలుగుతున్నాం అని తెలిపారు.
మొత్తానికి ఈ కొత్త రక్త పరీక్ష అందుబాటులోకి వస్తే, ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించి ట్రీట్మెంట్ ప్రారంభించవచ్చు. తద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల రేటును గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications