Latest Updates
-
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.!
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఆధునిక జీవనశైలి కారణంగా నేటి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య మెటబాలిక్ సిండ్రోమ్. వయసుతో సంబంధం లేకుండా మూడు పదులు నిండకుండానే దీని లక్షణాల బారిన పడుతున్నారు. బయటకు చూడటానికి బాగానే ఉన్నా.. అంతర్గతంగా వివిధ అనారోగ్యాలకు గురవుతున్నారు. అయితే మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక వ్యాధి కాదు.. శరీరంలో కొన్ని సమస్యలు ఏకకాలంలో సంభవించడం దీని అర్థం. మరి ఆ సమస్యలు ఏంటి.. అందుకు కారణాలు ఏంటి.. వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తెలుసుకుందాం..

మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏకకాలంలోనే శరీరంలో వివిధ రకాల అనారోగ్య లక్షణాలు ఏర్పడటం. వాటిలో పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు ఏర్పడటం, రక్తంలో చక్కెర స్థాయిలో అమాంతం పెరగడం, ట్రైగ్లిజరైడ్లు పెరగడం, గుడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోవడం వంటి లక్షణాలు దీని కిందకు వస్తాయి. ఈ లక్షణాల్లో ఒకేసారి మూడు సంభవించినా దానిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. దీని ఫలితంగా డయాబెటిస్, గుండె జబ్బులు, పెరాలసిస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలు
ఒక్కసారిగా మీరు బరువు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం గమనిస్తే మీ శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం కారణాలు కావచ్చు. ఇన్సులిన్ పనిచేయకపోతే ఈ లక్షణాలు ఒక్కసారిగా కనిపిస్తాయి. తరచూ మీకు దాహంగా అనిపిస్తుంటుంది. బాడీ డీహైడ్రేడెట్‌గా అనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినా, శరీరానికి ఎక్కువగా నీరు కావాల్సి వచ్చినా ఈ లక్షణాలు చూస్తారు. ఇంకా, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినా కూడా మీకు తరచూ మూత్ర విసర్జన చేయాలని అనిపిస్తుంటుంది. అంతేకాకుండా నిరంతరం అలసటగా, శక్తిహీనంగా అనిపిస్తుంటుంది.

చర్మం నల్లబడటం
దృష్టి మసకబారడం, మెడ, చంకల కింద చర్మం నల్లబడవచ్చు. స్కిన్ మందంగా మారడం వంటి లక్షణాలు మెటబాలిక్ సిండ్రోమ్‌కి దారితీయవచ్చు. దీనినే అకాంతోసిస్ నిగ్రికాన్స్ అని చెబుతారు. ఈ లక్షణాలన్నీ సాధారణంగా ఇన్సులిన్ తగ్గిపోయినా, శరీరం దానిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయినా కనిపిస్తాయి.

ట్రైగ్లిజరైడ్స్
రక్తపోటులో హెచ్చతగ్గులు, గుడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోవడం, ట్రైగ్లిజరైడ్స్ వంటి లక్షణాలు కనిపిస్తే మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. సమస్యను నిర్ధారించుకునేందుకు సంబంధింత చికిత్సలు తీసుకోవడం చాలా ముఖ్యం.
మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలు ఎక్కువగా జీవనశైలిలో మార్పుల కారణంగానే సంభవిస్తాయి. ఆహారపు అలవాట్లు మారడం, పని ఒత్తిడి, నిద్ర వేళలు, నిద్ర లేమి, వ్యాయామం చేయకపోవడం, నడక తగ్గిపోవడం, పోషకాహార లోపం ఇలా పలు కారణాలు ఏకకాలంలో వివిధ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడేలా చేస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటును చేసుకుంటూ ఒత్తిడిని దూరం చేసుకుంటే వీటి నుంచి బయటపడే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
