Latest Updates
-
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు!
పరగడుపున ఒక్క వెల్లుల్లి రెబ్బ తింటే..నెల రోజుల్లో మీలో అద్భుత మార్పులు!
మనదేశంలో అందరి వంటగదుల్లో తప్పక ఉండే పదార్థాం వెల్లుల్లి. వెల్లుల్లి ఘాటైన వాసన, అద్భుతమైన రుచి వంటకాలకు ప్రాణం పోస్తాయి. అయితే వెల్లుల్లి కేవలం వంటల రుచికి మాత్రమే పరిమితం కాదండోయ్..అదొక అద్భుతమైన ఔషధ గని. మన పూర్వీకులు దీనిని ఆహారంలో భాగం చేసుకోవడానికి కారణం కూడా ఇదే.
వండిన వెల్లుల్లి కన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బను రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం 30 రోజుల్లోనే మీ శరీరంలో మీరు ఊహించని సానుకూల మార్పులను గమనిస్తారు.

అల్లిసిన్..అసలైన శక్తి కేంద్రం
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఒక శక్తివంతమైన సల్ఫర్ సమ్మేళనం ఉంటుంది. ఇదే వెల్లుల్లికి నేచురల్ యాంటీబయాటిక్ గా పేరు తెచ్చిపెట్టింది. వెల్లుల్లి రెబ్బను నలిపినప్పుడు లేదా కోసినప్పుడు ఈ అల్లిసిన్ రిలీజ్ అవుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉండి, శరీరంలోని హానికర సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది.
వెల్లుల్లితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
రోగనిరోధక శక్తికి రక్షణ కవచం: వెల్లుల్లి నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. రోజూ ఒక రెబ్బ తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
గుండె ఆరోగ్యానికి భరోసా: అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరం. ఇది రక్తపోటును నియంత్రించి, కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. రక్తాన్ని పలుచబరచి, గడ్డకట్టకుండా చూసి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఉదయాన్నే వెల్లుల్లి తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరిగి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే, ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
మెదడుకు మేలు, చర్మానికి మెరుపు: వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయి. వయసుతో పాటు వచ్చే మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలను నివారిస్తాయి. దీని యాంటీ మైక్రోబియల్ గుణాలు మొటిమలను తగ్గించి, చర్మాన్ని స్పష్టంగా, కాంతివంతంగా మారుస్తాయి.
మధుమేహం, కీళ్ల నొప్పులకు ఉపశమనం: వెల్లుల్లి రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. దీని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
పచ్చి వెల్లుల్లిని ఎలా తినాలి?
ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని దాన్ని కొద్దిగా నలిపి లేదా చిన్న ముక్కలుగా కోసి 5-10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల అల్లిసిన్ పూర్తిగా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆ ముక్కలను ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మింగండి. దాని ఘాటును తట్టుకోలేని వారు, కొద్దిగా తేనెతో కలిపి తీసుకోవచ్చు.
జాగ్రత్తలు
గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో తినవద్దు. రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు, ఆపరేషన్ కు సిద్ధమవుతున్న వారు తినే ముందు డాక్టర్ ని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications