Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ ఇవే..పొరపాటున తింటే అస్సాం బండెక్కడమే!
మండే ఎండల నుంచి ఉపశమనాన్నిస్తూ మట్టి వాసనతో మనసును పులకింపజేసే వర్షాకాలం అంటే ఇష్టం ఉండని వారెవరుండరు. చిటపటలాడే వాన చినుకులను చూస్తూ అలా వేడి వేడి పకోడీలు ఓ మంచి మసాలా ఛాయ్ తాగాలనే కోరిక కలగడం సహజమే. కానీ ఈ ఆహ్లాదకరమైన వాతావరణమే అనేక అనారోగ్యాలకు కూడా ఆహ్వానం పలుకుతుందని మీకు తెలుసా? వర్షాకాలంలో గాల్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్ లు వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ సమయంలో మనం తీసుకునే ఆహారం విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అది నేరుగా మన ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్నే చూపెడుతుంది. కాబట్టి వర్షాకాలంలో కొన్ని ఆహారపదార్థాలు తినకుండా ఉండటం చాలా మంచిది. వర్షాకాలంలో ఏం తినకూడదో ఇక్కడ చూడండి.
ఆకుకూరలు
ఆకుకూరలు అనగానే ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా ఇవి తింటే ప్రమాదేముంది అనుకుంటే పొరబడినట్లే. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలు వర్షాకాలంలో కాస్త ప్రమాదకరం. తేమ, బురద కారణంగా వీటి ఆకులపై సూక్ష్మక్రిములు, కీటకాలు సులభంగా చేరతాయి. ముఖ్యంగా పాలకూర, మెంతికూర వంటివి సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఒకవేళ తినాలనిపిస్తే మాత్రం వీటిని వేడి నీటిలో బాగా కడిగి పూర్తిగా ఉడికించిన తర్వాతే తినడం మంచిది.

స్ట్రీట్ ఫుడ్
చాలామందికి వాన పడుతుంటే రోడ్డు పక్కన వేడి వేడిగా అమ్మే బజ్జీలు, సమోసాలు చూడగానే నాలుక లాగేస్తుంటది. అయితే వీటి తయారీలో వాడే ఆయిల్ ని పదేపదే వేడి చేయడం, కలుషితమైన నీటిని వాడటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ రుచులు తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి పెద్ద ముప్పుని కలిగిస్తాయి.
సీ ఫుడ్
వర్షాకాలంలో సముద్రంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువ. దీనివల్ల సీఫుడ్ ఫ్రెష్ గా ఉండదు.. హానికరమైన బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో సముద్రపు ఆహారానికి దూరంగా ఉండటమే బెటర్.
కూల్ డ్రింక్స్ కు దూరం
కూల్ డ్రింక్స్, సోడాలు మన జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. ఇవి శరీరంలోని ఖనిజ లవణాలను గ్రహించే శక్తిని తగ్గించి ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను సృష్టిస్తాయి. వీటికి బదులుగా గోరువెచ్చని హెర్బల్ టీ, నిమ్మరసం లేదా అల్లం టీ తాగడం ఉత్తమం.
పెరుగు, మజ్జిగతో కాస్త జాగ్రత్త
ఎండాకాలంలో అమృతంలా పనిచేసే పెరుగు, మజ్జిగ వర్షాకాలంలో శరీరానికి చలువ చేసి జలుబు, దగ్గు, గొంతు నొప్పికి కారణమవుతాయి. వీటిని పూర్తిగా మానాల్సిన అవసరమేమీ లేదు కానీ మితంగా కేవలం పగటిపూట మాత్రమే తీసుకోవడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications