Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
కొంతమందిని మాత్రమే దోమలు ఎక్కువగా కుడతాయ్..! ఎవరిని ? ఎందుకో తెలుసా ?
చట్టం ముందు అందరూ సమానమే కావచ్చు కానీ దోమల ముందు కాదు. అవును దోమకు అందరూ సమానమే అందరినీ కుడుతుందని చెబుతుంటారు. కానీ దోమలు కొందరిని మాత్రమే ఎక్కువగా కుడుతుంటాయ్. దీనికి చాలా కారణాలున్నాయ్. అందరితో కలిసి ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు వాళ్లల్లో కేవలం కొందరికి మాత్రమే దోమలు ఎక్కువగా కుట్టడం గమనిస్తాం. ఇతరులను దోమలు ఎక్కువగా కుట్టకపోవడాన్ని మనకు తెలిసినా అంతగా పట్టించుకోము. కానీ దీనికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయని పరిశోధనలో తేలింది.
మగ దోమల కన్నా ఆడ దోమలే ఎక్కువగా కుడతాయ్. ఆహారం కోసం మగ దోమ పువ్వుల్లో వున్న తేనెపై ఆధారపడితే ఆడ దోమ మనుషుల రక్తంపై ఆధారపడుతుంది. దోమ తన సంతానాన్ని పెంచిపోషించుకోవడానికి దానికి అవసరమైన ప్రొటీన్లు రక్తంలో మాత్రమే వుంటాయ్. అందువల్లే ఆడదోమలు రక్తాన్ని పీల్చుకొని ఆహారంగా మార్చుకుంటాయ్.

అయితే దోమ కుట్టే సమయంలో దోమనోటిలో వున్న లాలాజలం మనషి శరీరంలో ప్రవేశించడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతాయ్. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధుల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
దోమలు కుట్టే ముందు కొన్ని రకాలు మనుషులను, పరిస్థితులను ఎంచుకొని వారిని కుడతాయ్. దోమలు కేవలం కొంత మందిని మాత్రమే టార్గెట్ చేస్తాయ్. దోమలు ఏరకంగా టార్గెట్ చేస్తాయో తెలుసుకుందాం. జ్వరంతో బాధపడేవారిని, అధికబరువుతో వున్న వారిని, క్రీడాకారులను దోమలు ఎక్కువగా కుడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు.
బ్లడ్ గ్రూప్
బ్లడ్ గ్రూపును బట్టి కూడా దోమలు కుడతాయని పరిశోధనలో కనుగ్గొన్నారు. O+ve ( ఓ పాజిటివ్) బ్లడ్ గ్రూపుకు చెందిన వారినే దోమలు ఎక్కువగా కుడుతున్నాయట. ఓ పాటిజివ్‌కు చెందిన వారు వారి చర్మంలో కొన్ని ప్రత్యకమైన లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఆడ దోమలు వీరినే ఎక్కువగా ఎంచుకొని కుడుతున్నాయ్.
శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే
దోమలకు తల భాగంలో యాంటినాలుంటాయ్. ఇవి వాతావరణంలోని వేడిని చాలా సులువుగా పసిగట్టేస్తాయ్. శరీరంలో ఎక్కువ ఉష్ణోగ్రతలున్నవారిని ఎంచుకొని మరీ కుడతాయని కొనుగ్గొన్నారు. జ్వరంతో వున్నవారిని, క్రీడాకారులను, అధకి బరువుతో బాధపడేవారిని ఎంచుకొని మరీ కుడుతున్నట్లు అధ్యయనంలో తేలింది.
గర్భిణులకు ఆకర్శితులవుతాయ్
గర్భధారణ సమయంలో గర్భిణుల శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయ్. ఉష్ణోగ్రత మారడం, కార్బన్‌డైయాక్సైడ్ ఎక్కువగా విడుదలవడం, కొన్ని రాకాల రసాయనాలు రక్తం ద్వారా చర్మంలో విడుదలవ్వడం వల్ల ఆడ దోమలు ఎక్కువగా ఆకర్షితులై రక్తాన్ని పీల్చుకుంటాయ్. దోమల నుంచి గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలను తీసుకోవాలి.
చెమట
దోమలు ఎక్కువగా కుట్టడానికి చెమట కూడా ప్రధాన కారణం. కొంత మందిలో చెమట కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి వుండడం వల్ల దోమలు ఆకర్షితులయ్ కుట్టడానికి వస్తాయ్. కాబట్టి శరీరాన్ని శుభ్రంగా వుంచుకుంటే దోమలు కుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు.
మద్యం తాగడం
మద్యం తాగితే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని వల్ల శరీరం వేడిని మాత్రమే కాకుండా చెమటను కూడా ఉత్పత్తి చేస్తుంది. వేడికి, చెమటకు ఆకర్శితులయ్యే దోమలు సహజంగా మద్యం ఎక్కువగా తాగేవారిని కుడతాయని కనుగ్గొన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications