Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
బురదలో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..
భానుడి భగగలకు మీ శరీరం అల్లాడిపోతోందా? వేడికి చర్మం కమిలిపోతోందా? అయితే ఈ సమ్మర్ లో ఖచ్చితంగా బురద స్నానం చేయాలి. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వేసవి కాలంలో బురదలో స్నానం చేయడం ఒక పురాతన ఆయుర్వేద చికిత్స. పూర్వకాలం నుంచి వస్తున్న ఈ ట్రీట్మెంట్ ఈ రోజుల్లో రసాయనాల కంటే ఎంతో ఉత్తమమైనది. నేలలోని సహజమైన ఖనిజాలు మన శరీరాన్ని డీటాక్స్ చేయడానికి, చర్మాన్ని శుభ్రపరచడానికి అద్భుతంగా పనిచేస్తాయి.
ఈ వేసవిలో రసాయనాలతో కూడిన ఉత్పత్తులకు బదులుగా, ప్రకృతి ఒడిలో లభించే ఈ అద్భుతమైన బురద స్నానాన్ని ప్రయత్నించండి. బురద స్నానం కేవలం ఆరోగ్యానికే కాదు మీ జుట్టు,చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

బురద స్నానం ఎలా పనిచేస్తుంది?
మన చుట్టూ ఉండే నేలలో ఎన్నో సహజమైన అంశాలు ఉంటాయి. ఇవి మన శరీరం నుంచి హానికరమైన విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. మనం బురదలో స్నానం చేసినప్పుడు ఆ బురద మన శరీరంపై ఒక పొరలా ఏర్పడుతుంది. ఇది చర్మ రంధ్రాలను తెరుస్తుంది. శరీరం లోపలి మలినాలను, విష పదార్థాలను తనలోకి లాగేస్తుంది. ఫలితంగా మన శరీరం శుభ్రపడుతుంది, చర్మం తాజాగా మారుతుంది.
చర్మ సౌందర్యానికి
బంకమట్టి ఒక అద్భుతమైన సహజ స్క్రబ్బర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన చనిపోయిన కణాలను సులభంగా తొలగిస్తుంది. దీనివల్ల మీ చర్మం రంగు మెరుగుపడుతుంది,ఫ్రెష్ గా కనిపిస్తుంది. అంతేకాకుండా బురద మీ చర్మాన్ని మృదువుగా,నునుపుగా చేస్తుంది. జిడ్డు చర్మం కలిగిన వ్యక్తులు బురద స్నానం చేస్తే చర్మంపై ఉండే అదనపు నూనె, మురికిని బంకమట్టి పీల్చేస్తుంది.
నొప్పి నివారిణి
బంకమట్టిలో సహజమైన శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. దీనివల్ల శరీరంలో ఎక్కడైనా వాపు, నొప్పి ఉంటే అది తగ్గుముఖం పడుతుంది. దురద, దద్దుర్లు వంటి చర్మ సమస్యలతో బాధపడేవారికి కూడా బురద స్నానం మంచి ఉపశమనం కలిగిస్తుంది.
వేసవి తాపానికి చల్లని పరిష్కారం
వేసవి కాలంలో మండుతున్న ఎండలకు శరీరం వేడెక్కిపోతుంది. చల్లని బురదలో స్నానం చేయడం వల్ల శరీరం తక్షణమే చల్లబడుతుంది. ఇది శరీరంలోని అధిక వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
అలసటకు,ఒత్తిడికి చెక్
బురదలో స్నానం చేయడం వల్ల మీ శరీరం అలసట నుంచి త్వరగా కోలుకుంటుంది. ఇది మీ శరీరానికి ఒక రకమైన లోతైన విశ్రాంతినిస్తుంది. మీరు క్రమం తప్పకుండా మట్టి స్నానం చేస్తే మీ కండరాలు రిలాక్స్ అవుతాయి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి,ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన సహజ చికిత్సగా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications