Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మటన్‌లో ప్రాణాలు తీసే బ్యాక్టీరియా.. తింటే ఇక మటాష్.. సంచలన నిజం బయటపెట్టిన సైంటిస్ట్స్
మన దేశంలో చాలా మంది మాంసాహార ప్రియులు ఉంటారు. వారందరూ ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్ షాపుల ముందు క్యూలు కట్టుకొని నిలబడిపోతారు. అయితే చికెన్, మటన్ తినే వారికి ఆరోగ్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీటిని తినడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటిలో మానవులకు హాని చేసే యాంటీ బయోటిక్స్ ఉన్నాయని, ఇవి తినడం వల్ల అనేక రోగాలు వస్తాయని పేర్కొంటున్నారు. అయితే మటన్ తినడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి? ఎందుకు ఆ ప్రమాదం అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎందుకు ప్రమాదకరమంటే?
మన దేశంలో చాలా మంది పాడి రైతులు తమ తమ జంతువులను పెంచుకోవడానికి యాంటీ బయోటిక్స్‌ని వాడుతున్నట్లు తేలింది. కోళ్లను పెంచుకోవడానికి, మేకలను పెంచడానికి యాంటీ బయోటిక్స్ వాడుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ఇవి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. కేజీ మటన్‌లో 243 మిల్లి గ్రాముల యాంటీ బయోటిక్స్ ఉంటాయని, అదే కిలో చికెన్‌లో 35 మిల్లి గ్రాముల యాంటీ బయోటిక్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అలాగే మాంసంలో సిప్రోఫ్లాక్సాసిన్, ఎన్రోఫ్లాక్సాసిన్, డాక్సీసైక్లిన్, స్టెప్టోమైసిన్ వంటి ప్రమాదకరమైన యాంటీ బయోటిక్స్ అవశేషాలను గుర్తించామని వీటిని తింటే కచ్చితంగా మనిషికి ప్రాణాపాయం అని వెల్లడించారు.
ఎలాంటి వ్యాధులు వస్తాయంటే?
యాంటీ బయోటిక్స్ ఉన్న మాంసం తినడం వల్ల మనుషులు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని చెబుతున్నారు. మాంసం తినడం వల్ల చర్మ సమస్యలతో పాటు అనేక రకాల రోగాలు వస్తాయట. జీర్ణ సంబంధిత సమస్యలు, క్యాన్సర్ సమస్యలు కూడా వస్తాయని పేర్కొంటున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి ప్రాణం కూడా పోయే అవకాశం ఉందని, యాంటీ బయోటిక్స్ అంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
యాంటీ బయోటిక్స్ వేసిన జంతువుల్లో ఆ అవశేషాలు 14 రోజుల పాటు ఉంటాయని, అప్పటి వరకు వాటిని తినకూడదని పేర్కొంటున్నారు. వీటిని తినడం వల్ల అమ్మాయిలు 10 సంవత్సరాల లోపే రసజ్వల బారిన పడుతున్నారని, క్రమంగా వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. అందుకే మాంసం తినేటప్పుడు కచ్చితంగా ఒకటిని రెండుసార్లు చూసుకొని తినాలని, మరీ ముఖ్యంగా బాగా ఉడికిన తరువాతే తినాలని పేర్కొంటున్నారు.
ఎందుకు ఈ సమస్యలు
సాధారణంగా వ్యాపారులు తమ వ్యాపారం బాగా జరగాలని చూస్తారు. అందుకు అనుగుణంగానే తమ పెంపకాలకు యాంటీ బయోటిక్స్ ఇస్తున్నారని చెబుతున్నారు. 40 రోజుల్లోనే పెరగాలనే ఉద్దేశంతో వీటిని ఇవ్వడం వల్ల ఇలాంటి రోగాలు వస్తున్నాయని చెబుతున్నారు. అందుకే మాంసం తినేటప్పుడు మంచి మాంసాన్ని ఎంచుకోవాలని పేర్కొంటున్నారు.
గమనిక: ఈ స్టోరీలో మేము చెప్పిందంతా ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించడింది. వీటిని మేము కరెక్ట్ అని నిర్ధారించడం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications