Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
చైనా వైరస్ ఎఫెక్టేనా? అంతుచిక్కని వ్యాధితో పెద్ద సంఖ్యలో చిన్నారుల మరణాలు!
కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా ప్రపంచం బయటపడింది అనుకొని ఊపిరి పీల్చుకునేలోపే HMPV అనే పేరుతో ఓ వైరస్ మళ్లీ చైనా నుంచి విడుదలైంది. గత వారం ఈ వైరస్ మనదేశంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ వైరస్ కనుగొని చాలా సంవత్సరాలు అయినప్పటికీ చైనాలో ఇటీవల ఈ వైరస్ కారణంగా మరణాలు పెద్ద సంఖ్యలో నమోదువుతున్నట్లు వస్తున్న వార్తలు అందరినీ టెన్షన్ లో పెడుతున్నాయి. ముఖ్యంగా ఇది చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తుండటంతో ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి.
ఇదే సమయంలో జమ్మూకశ్మీర్ లో అంతుచిక్కని వ్యాధితో చిన్నారులు మరణిస్తుండటం అందరిలో భయాందోళనలు పెంచుతోంది. రాజౌరి జిల్లాలో గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా 13 మంది అంతుచిక్కని వ్యాధితో మరణించగా..ఇందులో అత్యధిక మంది చిన్నారులే కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఒక్క గ్రామంలోనే ఎక్కువగా
ఈ మిస్టరీ వ్యాధి బారినపడిన పిల్లలను లోకల్ హాస్పిటల్స్ లో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతుంది. ఒక్క బధాల్ గ్రామంలోనే అత్యధికంగా చిన్నారులు ఈ మిస్టరీ వ్యాధితో మరణించారు. దీంతో బధాల్ గ్రామస్థులు హడలిపోతున్నారు. ఈ మిస్టరీ వ్యాధికి సంబంధించిన ప్రాథమిక కారణాలు తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బధాల్ గ్రామంలో సంభవిస్తున్న వరుస మరణాలపై దర్యాప్తుకు బయోసేఫ్టీ లెవల్ -3 మొబైల్ లాబొరేటరీని కూడాా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజౌరికి పంపించింది.
ఈ వ్యాధి గురించి క్షేత్ర అధ్యయనం కోసం పుణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పీజీఐ (చండీగఢ్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(NCDC), ఢిల్లీ ఎయిమ్స్ నిపుణుల బృందాలు బధాల్ గ్రామానికి చేరుకున్నాయి.
లక్షణాలు ఇవే
అధిక జ్వరం, ఎక్కువగా చెమటలు పట్టడం, వాంతులు, స్పృహ కోల్పోతుండడం ఈ మిస్టరీ వ్యాధి లక్షణాలుగా ఉన్నాయి. ఈ వ్యాధి మూలాలు ఇంకా గుర్తించలేదు. ఇది ఒక కొత్త రకం వైరస్ కావచ్చని, లేదా ఇప్పటికే ఉన్న వ్యాధులలో ఒకటిగా ఉండవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సాయం పొందాలని అధికారులు సూచించారు.
ఈ మిస్టరీ వ్యాధిపై జమ్మూలోని రాజౌరి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ అశుతోష్ గుప్తా మాట్లాడుతూ.. ప్రాథమికంగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అని భావిస్తున్నామని, మరిన్ని టెస్ట్ ల తర్వాత దీనిపై ఓ నిర్ధారణకు వస్తామని తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications