Latest Updates
-
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!
Burundi Mysterious Virus: ఆఫ్రికాలో అంతుచిక్కని వైరస్, ముక్కు నుండి రక్తం కక్కుకుని చనిపోతున్న జనాలు
ఒకదాని తర్వాత మరో వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తున్నాయి. కరోనా తర్వాత దాని వేరియంట్లు ఆందోళన కలిగించాయి. ఈ మధ్యే H3N2 ఫ్లూ భయాందోళన కలిగించగా.. ఇప్పుడు మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది.
ముక్కు నుండి తీవ్ర రక్తస్రావం:
ఆఫ్రికాలోని బురుండి దేశంలో ఈ కొత్త వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. అంతుచిక్కని ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ వైరస్ సోకిన 24 గంటల్లోనే బాధితులు చనిపోయినట్లు బురుండి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వైరస్ సోకగానే ముక్కు నుండి రక్తం కారడం, తీవ్రమైన తలనొప్పి, జ్వరం, విపరీతమైన వాంతులు లాంటి లక్షణాలు ఉన్నట్టుండి కనిపిస్తున్నాయని అధికారులు చెప్పారు.
మృతులంతా ఒకే తెగకు చెందిన వారు:
బురుండి దేశంలోని బజిరో ప్రాంతంలో ఈ వైరస్ కనిపించింది. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు గిటోబ్ అనే తెగకు చెందినవారు. వారు బజిరో ప్రాంతంలోని మిగ్వా కొండ సమీపంలో నివసిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ కొత్త వైరస్ బాధితులంతా ఈ ప్రాంతానికి చెందినవారేనని వెల్లడించారు. అప్రమత్తమైన అదికారులు బజిరో పట్టణాన్ని క్వారంటైన్ చేశారు.
మార్‌బర్గ్ వైరస్‌పై అనుమానాలు:
ఇటీవల బురుండి దేశ దాయాది దేశమైన టాంజానియాలో మార్ బర్గ్ అనే వైరస్ కనిపించింది. ఈ వైరస్ ముప్పు ఇతర దేశాలకు కూడా పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ- WHO హెచ్చరించింది. ఇప్పుడు బురుండిలో కనిపించిన వైరస్ మార్ బర్గ్ వైరసా అనేది తేలాల్సి ఉంది.
ఈ వైరస్ మొత్తం 8 మందికి వ్యాపించగా అందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ వైరస్ కేసులు మొదట ఫిబ్రవరిలో కనిపించాయి. ఆ తర్వాత పశ్చిమ ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినిమయాలో వెలుగు చూశాయి. గత వారం ఈ కొత్త వైరస్ కు సంబంధించి మరో 8 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
దక్షిణ టాంజానియాలో గతేడాది ఇదే తరహా వైరస్:
గత ఏడాది జులైలో దక్షిణ టాంజానియాలో ముగ్గురు వ్యక్తులు ఈ నోస్ బ్లీడ్ వైరస్ సోకి చనిపోయారు. ఈ వ్యాధిని పరిశీలించడానికి ప్రస్తుతం వైద్య పరిశోధనా బృందాన్ని పంపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
