Latest Updates
-
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్!
తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం హరిది..అమృతంలా ఉంటుంది..ఇలా సింపుల్ గా చేసేయండి
తొలి ఏకాదశి పండుగకు మన తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో పేలాల పిండిని ప్రసాదంగా తయారుచేస్తుంటారు. అయితే గోదావరి జిల్లాల్లో అయితే ఎక్కువగా 'హరిది' అనే ప్రసాదాన్ని తయారుచేస్తుంటారు. అలాగే అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సారెగా కూడా దీన్ని పెడుతుంటారు. గోదావరి జిల్లాల స్పెషల్ తొలి ఏకాదశి ప్రసాదం హరిది మీ ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

హరిది తయారీకి కావాల్సిన పదార్థాలు
-బెల్లం
-పొడి బియ్యం పిండి
-నీళ్లు
-యాలకల పొడి
-పచ్చి కొబ్బరి తురుము
-నెయ్యి
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి
హరిది తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి. అందులోనే అరకప్పు బెల్లం తురుము, చిటికెడు ఉప్పు వేసి పెద్ద మంట మీద బెల్లాన్ని కరగనివ్వాలి.
-బెల్లం నీళ్లల్లో కరిగిన తర్వాత కొద్దిసేపు మరిగించుకోవాలి. బెల్లం నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మంటను మీడియంలో ఉంచి..పాన్ లో ఒకటిన్నర గ్లాసు పొడి బియ్యం పిండి వేసుకోండి. సాధారణంగా హరిది తయారీకి తడి బియ్యం పిండిని వాడుతారు. అయితే దీనికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా పొడి బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు.
-బియ్యం పిండి పాన్ లోని నీటిని అంతా పీల్చుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మూతపెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి.
-కొంచెం వేడి తగ్గిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక పల్లెంలోకి వేసుకోండి. చేత్తో ముద్దలా కలుపుకోండి. తర్వాత ఆ కలిపిన ముద్దలో నుంచి కొంచెం కొంచెం పిండిని చేతుల్లోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోండి.
-ఇప్పుడు చేతిలో పొడి బియ్యం పిండి చల్లుకొని దానిమీద రెడీ చేసుకున్న ఉండలను పెట్టి తాళికల్లా(పొడవుగా ఉండేలా)చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు బియ్యం పిండి వేసుకొని, అందులో 1 కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా పల్చగా కలిపి పెట్టుకోవాలి.
-ఇప్పుడు హరది చేసుకోడానికి స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో 4 గ్లాసుల నీళ్లు పోసి,అందులో 2 గ్లాసుల బెల్లం తురుము వేసి పెద్ద మంట మీద కలుపుకుంటూ బెల్లం కరిగాక కూడా 2 నిమిషాలు మరిగించుకోవాలి.
-బెల్లం నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు రెడీ చేసుకున్న తాళికలను అందులో వేసి మీడియం మంట మీద ఉంది జస్ట్ అవి మునిగేవరకు కలుపుకుంటే చాలు. 5 నిమిషాల పాటు గరిట పెట్టకుండా పాన్ ని అటు ఇటూ కదుపుకుంటూ ఉడికించుకోవాలి.
-తర్వాత ఒక తాళికను చేత్తో పట్టుకుంటే గట్టిగా ఉంటే పర్ఫెక్ట్ గా ఉడికినట్లు అర్థం.
-గట్టిగా ఉడికిన తర్వాత అందులో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని, ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యంపిండి నీళ్లను ఇందులో పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అందులో అర టీస్పూన్ యాలకల పొడి, 2 టీస్పూన్ల నెయ్యి వేసుకొని మెత్తం అంతా బాగా కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకోండి.
-అంతే తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం హరిది రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
