Latest Updates
-
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.!
వర్షాకాలంలో వీటిని మాత్రమే తింటే సరిపోదు.. బీపీ, డయాబెటిస్ రోగులకు మేలు చేసే సూపర్ ఫుడ్స్.!
జీవనశైలిలో మార్పుల కారణంగా మందుల వాడకంతో పాటు పోషకాహారానికి ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. సమతుల్య ఆహారం ద్వారా శరీరానికి విటమిన్లు, మినరల్స్, పోషకాలు సరైన మోతాదులో అందుతాయి. తద్వారా వివిధ రకాల వ్యాధుల బారి నుంచి మన రోగ నిరోధక వ్యవస్థ పోరాడుతుంది. వీటినే ఫంక్షనల్ పుఢ్స్ అంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోజువారీ భోజనంలో వీటిని ప్రత్యేకంగా చేర్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు కొన్ని ప్రకృతి సిద్ధమైన ప్రత్యేక ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలోని వివిధ వ్యవస్థలు మెరుగ్గా చురుగ్గా పనిచేయడానికి దోహదపడతాయి. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటిస్, జీర్ణక్రియ సమస్యలు, ఎముకల బలహీనత వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రిస్తాయి. అయితే ఈ ఆహార పదార్థాలను వ్యాధి నివారణగా పరిగణించకూడదని.. మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఇతర ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
బ్రోకలీ
క్యాలీఫ్లవర్ ఆకృతిలో ఉంటే ఆకుపచ్చగా ఉండే బ్రోకలీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరం నుంచి హానికరమైన పదార్థాలను తొలగించేందుకు దోహదపడుతుంది. ఫైబర్, విటమిన్లు, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బ్రోకలీని కాసేపు ఆవిరి పైన ఉడికించి తినడం శ్రేయస్కరం.
కాకరకాయ
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ బెస్ట్ ఫుడ్. షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. కాకరకాయలోని సహజ పదార్థాలు బాడీలో చక్కెరను మెరుగ్గా ఉపయోగించుకుంటాయి. సరైన మోతాదులో రెగ్యులర్‌గా దీనిని తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను ఆరంభ స్థాయిలోనే అరికట్టవచ్చు.
బీట్‌రూట్
బీట్‌రూట్ శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. శక్తిని పెంచి, అలసటను తగ్గిస్తుంది. ఆవిరి మీద ఉడికించడం, సలాడ్‌లా తీసుకోవడం లేదా జ్యూస్ మాదిరిగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బార్లీ
బార్లీలోని ఫైబర్.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
అవిసె గింజలు
శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర పోషకాలు అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి. మహిళల్లో హార్మోన్ల సమస్యలకు అవిసె గింజలు మంచి పరిష్కారం. మెనోపాజ్ సమయంలో వారిలో కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి దోహదపడతుంది.
చెర్రీలు
చెర్రీలలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గిస్తాయి. యూరిక్ యాసిడ్ సంబంధిత సమస్యల బారి నుంచి కాపాడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు దోహదపడుతుంది. సరైన మోతాదులో రెగ్యులర్‌గా తీసుకోవడం శ్రేయస్కరం.
సోయాబీన్స్
ప్రొటీన్ పుష్కలంగా ఉండే సోయాబీన్స్‌లో సహజ సమ్మేళనాలు.. మెనోపాజ్ సమయంలో మహిళల్లో వేడి, అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. ఎముకలు, కండరాల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆమ్లా
ఆమ్లాలోని విటమిన్ సి.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మీ చర్మంపై సహజమైన మెరుపు కోల్పోకుండా నిలుపుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి జుట్టు బలంగా పెరగడానికి ఆమ్లా ప్రకృతి అందించిన గొప్ప వరం.
అల్లం
జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సీజనల్ వ్యాధులకు పచ్చి అల్లం ప్రకృతి సిద్ధమైన వైద్యంలా పనిచేస్తుంది. ఇందులోని సహజ సమ్మేళనాలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం, సమస్యల నుంచి కాపాడుతుంది. వికారం, వాంతులను తగ్గిస్తుంది.
కుంకుమపువ్వు
సరైన మోతాదులో కుంకుమ పువ్వు మానసిక ఆరోగ్యానికి సంజీవని లాంటిది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంచేందుకు, ఏకాగ్రత పెరిగేందుకు దోహదపడుతుంది. పాలల్లో కలిపి తీసుకోవడం ప్రయోజనకరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
