Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
హాస్పిటల్స్ లో లక్షలు పెట్టే కన్నా..పొద్దున్నే ఈ ఆకులు 5 తింటే రోగాలు దరిచేరవు!
మనదేశంలో ఇప్పటికీ పల్లెటూర్లకు వెళ్తే చాలామంది పెద్దోళ్లు పొద్దున్నే వేప ఆకులు నమలడం, వేప పుల్లలతోనే పళ్లు తోమడం వంటివి చేస్తుండటం మనం చూస్తుంటాం. వాస్తావానికి వేప చెట్టు వల్ల చల్లటి నీడ మాత్రమే కాదండోయ్..మనకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వేప ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచే దివ్యౌషధంగా పనిచేస్తాయి. అంతేకాకుండా కడుపు సంబంధిత సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తాయి.ఆయుర్వేదంలో వేపను సర్వరోగ నివారిణి,హెల్త్ ట్రీ అని పిలుస్తారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కేవలం 5 నుండి 10 ఫ్రెష్ వేప ఆకులను నమలడం వల్ల మీ ఆరోగ్యంలో కలిగే మార్పులకు మీరే ఆశ్చర్యపోతారు.
వేప ఆకులు నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు
శరీరానికి రక్షణ కవచం
తరచుగా జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్నారా? అయితే వేప ఆకులు మీ శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేసి శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి కడుపును తేలికగా ఉంచుతుంది. కడుపులో నులిపురుగుల సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా వేపలోని డీటాక్సిఫైయింగ్ లక్షణాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

సహజ సౌందర్యానికి చిరునామా
నిగనిగలాడే చర్మ సౌందర్యం ఎవరికి ఇష్టం ఉండదు? వేప ఆకులు రక్తాన్ని శుద్ధి చేసే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటాయి. పొద్దున్నే పరగడుపున వేప ఆకులునమిలితే మొటిమలు, మచ్చలు, చర్మ అలర్జీలు వంటి సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. చర్మం లోపలి నుండి పోషణ పొంది సహజంగా కాంతివంతంగా మెరుస్తుంది. వేపలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను దూరం చేసి మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
షుగర్ వ్యాధికి చెక్,దంతాలకు రక్ష
షుగర్ వ్యాధితో బాధపడేవాళ్లకు వేప ఆకులు సంజీవని లాంటివి. ప్రతిరోజూ ఉదయాన్నే వేపాకులు నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది క్లోమాన్ని ఉత్తేజపరిచి, ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇక నోటి ఆరోగ్యానికి వేపను మించింది లేదు. ఇది నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసి దుర్వాసనను పోగొడుతుంది. చిగుళ్ల వాపు, రక్తస్రావం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వేప పుల్లతో పళ్లు తోమడం వల్ల దంతాలు గట్టిపడి పుచ్చిపోకుండా ఉంటాయి.
ఎలా తీసుకోవాలి?
ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత బ్రష్ చేయకముందే 5-10 లేత వేప ఆకులను శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని బాగా నమలండి. మొదట్లో కొంచెం చేదుగా అనిపించినా, క్రమం తప్పకుండా తీసుకుంటే మీ శరీరానికి అంతులేని శక్తి లభిస్తుంది. అమృతం కూడా అతిగా తీసుకుంటే విషమే అంటారు కాబట్టి వేప ఆకులను మితంగానే తీసుకోవాలి. గర్భిణీలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ ని సంప్రదించిన తర్వాతే దీనిని వాడాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications