Latest Updates
-
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.!
నెమ్మది నడక వెనుక ఉన్న అసలు కారణం బయటపెట్టిన సైంటిస్టులు!..
సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్లు లేదా కొందరు మధ్య వయస్కులు నెమ్మదిగా నడవడం మనం చూస్తూనే ఉంటాం. వాళ్లు అలా నెమ్మదిగా నడుస్తుంటే..వయసు పైబడింది కదా, మోకాళ్ల నొప్పులు ఏమైనా ఉన్నాయేమో లేదా కీళ్ల నొప్పుల వల్ల నడవలేకపోతున్నారు అని తీసిపారేస్తాం. కానీ వైద్య శాస్త్రంలో జరిగిన తాజా పరిశోధనలు ఈ అపోహలను పటాపంచలు చేస్తున్నాయి. నెమ్మదిగా నడవడానికి మీ కాళ్లలో బలం తగ్గడం మాత్రమే కాదు, మీ వినికిడి లోపం కూడా ఒక ప్రధాన కారణం కావచ్చని విస్తుపోయే నిజాన్ని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

57,000 మందిపై జరిగిన మహా అధ్యయనం
అమెరికాలోని ప్రసిద్ధ మిచిగాన్ విశ్వవిద్యాలయం, ఒక ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీతో కలిసి ఓ అధ్యయనం చేపట్టింది. ఏకంగా 57,000 మందికి పైగా ఐఫోన్ వినియోగదారుల ఆరోగ్య డేటాను సేకరించి, సుదీర్ఘంగా విశ్లేషించింది. ఈ అధ్యయనంలో ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది. వినికిడి సమస్యలు లేని ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పోలిస్తే, వినికిడి లోపం ఉన్నవారు చాలా నెమ్మదిగా నడుస్తున్నారని డేటా స్పష్టం చేసింది.
నడకకు కాళ్లు మాత్రమే కాదు, చెవులు కూడా ముఖ్యం
నడక అనేది కేవలం కాళ్ళకు సంబంధించిన ప్రక్రియ మాత్రమే అని మనం అనుకుంటాం. కానీ పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం, మనం సజావుగా, ఆత్మవిశ్వాసంతో నడవాలంటే మన కళ్లు, చెవులు, మెదడు అన్నీ సమన్వయంతో పనిచేయాలి. మన శరీర బ్యాలెన్స్ కాపాడటంలో చెవుల పాత్ర చాలా కీలకం. మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కేవలం కళ్లతో చూడటం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న శబ్దాలను, మన అడుగుల చప్పుడును వినడం ద్వారానే మన మెదడు కదలికలను బ్యాలెన్స్ చేస్తుంది.
నడక వేగం... ఆరోగ్యానికి ఆరవ సూచిక
వైద్య నిపుణుల పరిభాషలో చెప్పాలంటే, ఒక వ్యక్తి నడక వేగం అనేది వారి శారీరక ఆరోగ్యానికి సంబంధించిన "ఆరవ అత్యంత ముఖ్యమైన సూచిక. ఒక వ్యక్తి చురుకుగా, తడబడకుండా నడుస్తున్నాడంటే, అతని గుండె, ఊపిరితిత్తులు, కండరాలు, నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నాయని అర్థం.

వినికిడి లోపం మెదడును ఎలా అలసిపోయేలా చేస్తుంది?
ఒక వ్యక్తికి వినికిడి శక్తి తగ్గినప్పుడు, చుట్టుపక్కల ఏం జరుగుతుందో గ్రహించడానికి మెదడు సాధారణం కంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. శబ్దాలను అర్థం చేసుకోవడానికే మెదడు తన శక్తిని మొత్తం ఉపయోగించడం వల్ల, నడకకు, శరీర సమతుల్యతకు తగినంత సహకారం అందించలేకపోతుంది.
దీనికి తోడు, తమ అడుగుల చప్పుడును సరిగ్గా వినలేకపోవడం వల్ల నడిచేటప్పుడు కింద పడిపోతామేమో అన్న భయం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల వారు తెలియకుండానే ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా వేస్తారు.
నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు
ఈ వినికిడి సమస్యను కేవలం నెమ్మది నడకకే పరిమితం చేసి చిన్నదిగా చూడకూడదు. దీనిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వినికిడి లోపం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, మానసిక కుంగుబాటు, ఒంటరితనానికి గురికావడం, నడుస్తూ అకస్మాత్తుగా కింద పడిపోవడం వంటి ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
