Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
రాత్రిపూట కాళ్ల తిమ్మిర్లు ఎందుకు వస్తాయో తెలుసా? లైట్ తీసుకుంటే డేంజరే!
రాత్రి పూట హాయిగా నిద్రపోదామని పడుకుంటే నిద్రపోతున్న సమయంలో సడెన్ గా కాలు కండరాలు పట్టేసి, తీవ్రమైన నొప్పితో మెలకువ వస్తుందా? రాత్రిపూట కాళ్ళ తిమ్మిర్లు వల్ల ముఖ్యంగా తొడ, పిక్క కండరాలలో నొప్పి ఎక్కువగా వస్తుంది. ఆశ్చర్యకరంగా 50 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 40శాతం మంది ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు పలు రిపోర్ట్ లు తెలియజేస్తున్నాయి. అయితే ఇది కేవలం కండరాల బలహీనతేనా లేక మరేదైనా అనారోగ్యానికి సంకేతమా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.
కాళ్ళ తిమ్మిర్లకు సాధారణ కారణాలు
చాలా సందర్భాలలో కాళ్ళ తిమ్మిర్లకు కొన్ని సాధారణ కారణాలు ఉంటాయి.
-అతిగా నడవడం లేదా పరుగెత్తడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరగడం.
-శరీరంలో నీటిశాతం (డీహైడ్రేషన్) లేదా లవణాల సమతుల్యత దెబ్బతినడం.
-గర్భధారణ సమయంలో కలిగే మార్పులు.
-ఆస్తమా వంటి వాటికి వాడే కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు.
-థైరాయిడ్ సమస్యలు లేదా కాల్షియం లోపం.
-వెన్నుపూసలో డిస్క్ జారడం వల్ల నరాలపై ఒత్తిడి.

ఎప్పుడు ప్రమాదకరం?
వారానికి మూడుసార్ల కంటే ఎక్కువగా లేదా రోజూ తిమ్మిర్లు వస్తుంటే దాన్ని అస్సలు లైట్ గా తీసుకోకూడదు. సాధారణంగా స్ట్రెచింగ్ వ్యాయామాలు, జీవనశైలి మార్పులతో ఈ సమస్య తగ్గుతుంది. కానీ, కొన్నిసార్లు ఇది తీవ్రమైన అనారోగ్యాలకు తొలి సంకేతం కావచ్చు. ముఖ్యంగా మోటార్ న్యూరాన్ వ్యాధి, పెరిఫెరల్ న్యూరోపతి వంటి నరాల సంబంధిత సమస్యలలో కూడా రాత్రిపూట కాళ్ళ తిమ్మిర్లు ఒక లక్షణంగా కనిపిస్తాయి. అయితే వీటితో పాటు కాళ్ళలో బలహీనత, స్పర్శ కోల్పోవడం, నడకలో తడబాటు, కండరాలు క్షీణించడం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.
రాత్రిపూట వచ్చే కాళ్ళ తిమ్మిర్లు మీ నిద్రను పాడుచేయడమే కాకుండా కొన్నిసార్లు అంతర్గత అనారోగ్యానికి సూచన కావచ్చు కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించి, సరైన కారణం తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం.
నిర్ధారణ, ట్రీట్మెంట్
డాక్టర్లు మీ ఆరోగ్య చరిత్రను పరిశీలించి, కొన్ని టెస్ట్ లు సూచిస్తారు. బ్లడ్ టెస్టుల ద్వారా కాల్షియం, మెగ్నీషియం, థైరాయిడ్ హార్మోన్ల లెవల్స్ ను చెక్ చేస్తారు. అవసరమైతే నిద్ర విధానాలను అధ్యయనం చేసే స్లీప్ స్టడీ కూడా చేయవచ్చు. ట్రీట్మెంట్ లో భాగంగా మొదట కండరాలను సాగదీసే వ్యాయామాలు, ఆల్కహాల్, కెఫిన్ కు దూరంగా ఉండటం వంటివి సూచిస్తారు. వీటికి స్పందించని వారికి విటమిన్ సప్లిమెంట్లు లేదా ఇతర మందులు సిఫార్సు చేస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
