Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కడుపు ఉబ్బరం, గ్యాస్ తో ఇబ్బందా? క్షణాల్లో ఉపశమనం ఇచ్చే మ్యాజిక్ ఫుడ్స్!
రుచికరమైన భోజనం లాగించిన తర్వాత లేదా ఏదైనా పండుగ పూట కాస్త ఎక్కువగా తిన్నప్పుడు కడుపు ఉబ్బరంగా, భారంగా అనిపించడం చాలా సాధారణం. కడుపులో గ్యాస్ చేరిపోయి, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతుంది.
ఇలాంటి సమయంలో వెంటనే మెడికల్ షాపుల వైపు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో లభించే కొన్ని సహజ సిద్ధమైన ఆహారాలు ఈ కడుపు ఉబ్బరం, గ్యాస్, వాపుల నుంచి మ్యాజిక్ లా ఉపశమనం కలిగిస్తాయి. మీ పొట్టను తేలికపరిచే ఆ అద్భుతమైన ఆహారాలు ఏమిటో ఇక్కడ చూడండి.

అద్భుతమైన అల్లం
అల్లం అనేది జీర్ణ సమస్యలకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఇందులో సహజసిద్ధమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ (శోథ నిరోధక) లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఇవి పేగులకు విశ్రాంతినిచ్చి, కడుపులో గ్యాస్ ఏర్పడటాన్ని అడ్డుకుంటాయి. మీరు భారీ భోజనం చేసిన తర్వాత కడుపు బిగుతుగా అనిపిస్తే..వేడి వేడిగా ఒక కప్పు అల్లం టీ తాగండి. ఇది కేవలం కొద్ది నిమిషాల్లోనే మీకు హాయినిస్తుంది.
చల్లని పుదీనా
పుదీనా ఆకుల్లో ఉండే సహజసిద్ధమైన ఆయిల్స్ జీర్ణవ్యవస్థను కూల్ చేస్తాయి. బిగుతుగా మారిన కడుపు కండరాలను శాంతపరిచి, లోపల ఇరుక్కుపోయిన గ్యాస్ ను బయటకు పంపుతాయి. ఉబ్బరంగా అనిపించినప్పుడు ఒక కప్పు వేడి పుదీనా టీ చేసుకొని తాగితే, క్షణాల్లోనే గ్యాస్ మాయమై ఉపశమనం లభిస్తుంది.
ప్రోబయోటిక్స్ తో కూడిన పెరుగు
మన పేగుల ఆరోగ్యానికి లైవ్ కల్చర్స్ తో ఉండే పెరుగు ఒక అమృతం. ఇందులోని ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) జీర్ణక్రియను సజావుగా సాగేలా చేస్తాయి. కడుపులో గట్ బాక్టీరియాను బ్యాలెన్స్ చేసి, ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. భోజనం తర్వాత లేదా కడుపు భారంగా అనిపించినప్పుడు ఒక చిన్న గిన్నెడు తాజా పెరుగు తింటే పొట్ట చాలా తేలికగా మారుతుంది.
సోంపు గింజలు
హోటల్స్‌లో భోజనం తర్వాత సోంపు ఎందుకు ఇస్తారో తెలుసా? ఇది జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించి, గ్యాస్ ను ఇట్టే తగ్గిస్తుంది. మీకు కడుపులో అసౌకర్యంగా ఉంటే, తక్షణ ఉపశమనం కోసం ఒక టీస్పూన్ సోంపు గింజలను నెమ్మదిగా నమలండి లేదా వేడి నీళ్లలో మరిగించి టీలాగా తాగండి.
అరటిపండ్లు
ఉప్పు (సోడియం) ఎక్కువగా ఉన్న ఆహారాలు తిన్నప్పుడు శరీరంలో నీరు నిలిచిపోయి వాపు వస్తుంది. అరటిపండ్లలో ఉండే పొటాషియం ఈ సోడియం లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల కడుపు బిగుతు తగ్గుతుంది. పైగా ఇవి చాలా సులభంగా జీర్ణమై, పొట్టకు విశ్రాంతినిస్తాయి.

చల్లదనాన్నిచ్చే దోసకాయ
దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది శరీరాన్ని అద్భుతంగా హైడ్రేట్ చేస్తుంది. కడుపులో పేరుకుపోయిన అదనపు ఉప్పును తొలగించి, వాపును తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కొన్ని దోసకాయ ముక్కలను స్నాక్స్ లాగా తినడం లేదా నీటిలో కలుపుకుని తాగడం మంచిది.
దివ్యౌషధం బొప్పాయి
బొప్పాయిలో శక్తివంతమైన జీర్ణ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి మనం తిన్న ఆహారంలోని కఠినమైన ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేసి, పేగుల మీద ఒత్తిడి పడకుండా కాపాడతాయి. భోజనం తర్వాత కొన్ని బొప్పాయి ముక్కలను తింటే, మీ పొట్ట ఎంతో తేలికగా మారుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications