మిమ్మల్ని నిత్యం యవ్వనంగా ఉంచే A to Z సూపర్ ఫుడ్స్

By Super

మనం నిత్యజీవితంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నామో గమనిస్తున్నామో. మంచి ఆరోగ్యకరమైన శరీరం, శక్తివంతమైన శరీరానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి అనేక ఆహారాలు మంచి ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన ఆహారాల్లో అనేక న్యూట్రీషియన్స్, విటమిన్స్, సూపర్ న్యూట్రీషియన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి సూపర్ ఫుడ్స్ అమేజింగ్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ గా మనకు సహాయపడుతాయి.

ముఫ్పై ఏళ్లు నిండాయంటే చాలు చర్మం పొడి బారడం, కోమలత్వం తగ్గడం, కళ్ల మిలమిల దూరం కావడం జరుగుతుంది. బయటికి అనకపోవచ్చు కానీ చెంపల్లో కెంపులు, పెదవుల్లో గులాబీలు దూరమయ్యాయని చాలా మంది అనుకంటారు. మొహంపై మడతలు కనిబడితే చాలు చాలా మంది నిరుత్సాహ పడుతుంటారు. ‘అయ్యో...ఇంత తొందరగా వచ్చిందేంటి వృద్ధాప్యం' అని బాధ పడుతుంటారు. మడుతలను మనం ఏదో ఒక రోజు ఆక్సెప్ట్‌ చేయాల్సిందే. కానీ మడతలు రాకుండా ఉండేందుకు మీరు ప్రయత్నించి విజయం సాధించవచ్చు.‘అరెరే' అనుకుంటూ బాధపడటం కన్నా మీ వంతు మీరు ప్రయత్నించండి.

దీనికోసం హిమాలయాలకు వెళ్ళి తపస్సుచేసే అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని తిండి విషయంలో కొంచెం జాగ్రత్త పాటించండి అంతే.. పండ్లు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఈ క్రింది లిస్ట్ లో ఇవ్వబడిన ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో మార్పుచేసుకుంటే చాలు, మంచి ఆరోగ్యం, మానసిక స్థితి, యవ్వనం మీ సొంతం అవుతుంది.

ఎ ఫర్ అవొకాడో

ఎ ఫర్ అవొకాడో

ఈ పండులో గుండెకు ఆరోగ్యానిచ్చే మోనో-శాట్యురేటడ్‌ ఫ్యాట్‌ శాతం అధికంగా ఉంటుంది. దీనిలోని ఫైటో కెమికల్స్ నోటి క్యాన్సర్ ను నివారిస్తాయి. ఈ పండును సాస్ కు బదులు శాండ్విచ్ తో తీసుకోవచ్చు. అవకాడో తినడం వల్ల శరీరంలో అనవసర కొవ్వును అదుపుచేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్‌-ఈ అధికంగా ఉండే అవకాడో చర్మానికి సరికొత్త నిగారింపును తీసుకుస్తుంది. బీ.పి.ని కంట్రోల్‌ చేయడంలో తోడ్పడుతుంది.

 బి ఫర్ బ్రొకోలీ

బి ఫర్ బ్రొకోలీ

బ్రకోలీ ‘క్రూసిఫెరస్‌' వంశానికి చెందినది. క్రూసిఫెరస్‌ వంశానికి చెందిన కాయగూరలు టాక్సీన్స్‌తో పోరాడే యోదులుగా చెబుతుంటారు. విదేశీయులు బ్రొకోలీగా పిలుచుకునే ఈ క్యాలీ ఫ్లవర్ లో పోషక తత్వాలు, విటమిన్ ఎ, యాంటి ఆక్సిడింట్స్ ఉన్నాయి. ఉడికించిన లేదా పచ్చి క్యాలీప్లవర్ ను వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకుంటే కండరాల నొప్పులు ఉండవు. హాయిగా బ్రకోలిని ఆరగించండి. తరువాత మన శరీరాన్ని విషతుల్యాల నుంచి కాపాడే సంగతి అదే చూసుకుంటుంది.

సి ఫర్ క్యారెట్

సి ఫర్ క్యారెట్

క్యారెట్లు చాలా ఆరోగ్యం . అవి కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు వీటిలో అవసరమైయ్యే విటమిన్లు అధికం. అదేవిధంగా, క్యారెట్స్ చర్మానికి ఉపయోగకరం మరియు ప్రయోజనకరం. క్యారెట్ లోని విటమిన్ ఎ సూర్యుని నుండి వెలువడే కఠినమైన యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది . అదేవిధంగా , చిన్న వయస్సులోని పెద్దవారిలా కనబడం, వృద్ధాప్యం , చర్మం రంగును మోటిమలు మరియు చెదురుమదురుగా చర్మాన్ని నిరోధిస్తుంది . క్యారెట్లను ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చు . అలాగే, క్యారెట్ జ్యూస్ ను త్రాగడం వల్ల లేదా క్యారెట్లు తినడం వల్ల చర్మానికి ఈ స్కిన్ కేర్ వెజిటేబుల్ తీసుకోవడం చాలా మంచి పద్దతి.

 డి ఫర్ డార్క్ చాక్లెట్

డి ఫర్ డార్క్ చాక్లెట్

చాక్లెట్లు ఎక్కువగా వినియోగించుట వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే కొంతకాలం వృద్ధాప్యంను తప్పించడంలో సహాయపడుతుంది. ముఖం మీద ముడతలు రాకుండా చేస్తుంది. మళ్లీ, యాంటీఆక్సిడెంట్లు ఈ ప్రయోజనాల కోసం బాధ్యత తీసుకుంటాయితలనొప్పి తగ్గాలని సాధారణంగా ఒక చాక్లెట్ తింటారు. ప్రత్యేకించి మహిళలు డార్క్ చాక్లెట్ తింటారు. డార్క్ చాక్లెట్ లో వున్న కోకో పౌడర్ రిలీఫ్ ఇస్తుంది. డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీలను కరిగిస్తుంది. శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలలను కరిగిపోయేలా చేస్తుంది. డార్క్ చాక్లెట్స్ లో కోక అధికంగా ఉండటం వల్ల కళ్ళ చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి అన్ స్వీటెడ్ డార్క్ చాక్లెట్ ను రెగ్యులర్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. మూడ్ ను కూడా హేపీగా మార్చేస్తాయని తాజాగా పోషకాహార నిపుణులు చెపుతున్నారు. కనుక మీ శరీరంలోని రసాయనాలను ఉత్తేజపరచాలంటే ఒక డార్క్ చాక్లెట్ తినండి.

ఇ ఫర్ ఎగ్స్

ఇ ఫర్ ఎగ్స్

కోడి గుడ్డులో ఉండే ఐరన్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. ఇంకా దీనికిలో ఉండే సల్ఫర్ జుట్టు పట్టులా నిగనిగలాడేలా చేస్తుంది. ఇలా గుడ్డు మన అందాన్ని ఆరోగ్యాన్ని రెండింటినీ కాపాడుతుంది. ఒకవేళ మీకు గుడ్డు తినడం ఇష్టం లేకపోతే మాత్రం దాన్ని పగులగొట్టి అందులో ఉండే తెల్ల సొనను జుట్టుకు పెట్టుకొని గంట తర్వాత కడిగేస్తే మీ కురులు నిగనిగలాడుతూ ఉంటాయి.

ఎఫ్ ఫర్ ఫిష్

ఎఫ్ ఫర్ ఫిష్

.చేపల్లోపోషక పదార్ధాలు - మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజములు పుష్కలంగా ఉంటాయి. మంచి రుచిగా ఉండే చేపల మాంసం తేలికగా జీర్ణమవుతుంది. అంతే కాదు, కొన్ని అధ్యయనాల ప్రకారం, రోజూ చేపలను తినడ ద్వారా అనేక హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. చేపలు తరచూ తినడం వల్ల, చిన్న పిల్లల్లో ఆస్తమా నుండి పెద్దల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వరకూ అన్ని రకాల జబ్బులను నివారించవచ్చు. ఈ లోఫ్యాట్ చేపలను డైలీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా కొన్ని పౌండ్ల బరువు తగ్గించుకోవచ్చు.చేపలు వారానికి 2లేదా 3 సార్లు తింటే యవ్వనంగా కూడా ఉండవచ్చు.

జి ఫర్ గార్లిక్

జి ఫర్ గార్లిక్

వెల్లుల్లిని మించిన యాంటి ఆక్సిడెంట్ లేదు, వెల్లుల్లిని ఏదో రూపంలో ఆహారంలో ఉండేటట్లు చూసుకుంటే చాలు, ఎన్నో రోగాలు మన దగ్గరికి కూడా రావు, వెల్లుల్లిలో ఉండే ఆంటిసెప్టిక్ , ఆంటి బ్యాక్టీరియల్, ఆంటీ వైరల్స్, స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉంచుతాయి. రక్తాన్ని శుద్ధపరచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్లడ్ ప్రెషర్ ను క్రమబద్ధం చేసి రక్తంలో చెడు కొవ్వును తగ్గించి ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.

హెచ్ ఫర్ హనీ

హెచ్ ఫర్ హనీ

చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచే తేనెను ఉపయోగించడం వల్ల ముఖం మీద ఏర్పడం మచ్చలను తొలగించి, చర్మంలో ఏదేని ఇన్ఫెక్షన్ ఉన్నా తొలగిపోతుంది. అంతేకాదు ఇది మంచి మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగపడుతుంది. తేనె ముఖానికి బాగా పట్టించి ఐదు నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసేసుకోవాలి. అంతే కాదు తేనెతో ఫేస్ ప్యాక్ ను అతి సులభంగా తయారు చేసుకోవచ్చు. రెండు టీ స్సూన్ల తేనెలో ఒక టీస్పూన్ నిమ్మరసం చేర్చి బాగామిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే ఫలితం మీకే తెలుస్తుంది.

ఐ ఫర్ ఐస్ బర్గ లెట్యుస్

ఐ ఫర్ ఐస్ బర్గ లెట్యుస్

లెట్యూస్ ను మనం ‘సలాడ్ పట్టా' అనవచ్చు . ఎందుకంటే వీటిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తుంటారు .ఇంకా సాడ్విచ్ మరియు బర్గర్సో లో ఉపయోగిస్తుంటారు . ఈగ్రీన్ లీఫీ వింటర్ వెజిటేబుల్ తో అనేక స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి . లెట్యుస్ లో విటమిన్ ఎ అధికంగా ఉంది, అందువల్ల , చర్మాన్ని మాయిశ్చరైజింగ్, తాజాగా ఉంచుతుంది. అలాగే ఇందులో పొటాషియం కంటెంట్ కూడా పుష్కలం. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. .లెట్యూస్ ను క్రమంగా తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలన్నింటిని తొలగిస్తుంది. దాంతో మన శరీరం మరియు చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

జె ఫర్ జపనీస్ గ్రీన్ టీ

జె ఫర్ జపనీస్ గ్రీన్ టీ

మరో యాంటిఆక్సిండెంట్ గ్రీన్ టీ. ఇది కావల్సిన శక్తిని ఇస్తుంది. మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఇది కూడా వయస్సు పైబడనీయకుండా ఉంచే వాటిలో ఒక అద్భుతమైనటువంటిదే.

కె పర్ కోంబుచ టీ

కె పర్ కోంబుచ టీ

ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు కాలే, బచ్చలికూర, కొల్లార్డ్ ఆకుకూరలు, రొమైన్ లెటుస్ మరియు స్విస్ కార్డ్ వంటి ముదురు ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్ సి, విటమిన్ K, ఫోలిక్ యాసిడ్, ఇనుము, పొటాషియం, కాల్షియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఆకుకూరలలో ఉన్న విటమిన్ B గుండె మరియు జ్ఞాపకశక్తిని రక్షిస్తుంది. విటమిన్ ఎ చర్మం కణజాల వృద్ధిని పెంచుతుంది మరియు ఆకుపచ్చ కూరగాయలు, చాలా వాటిలో లభించే ల్యుటిన్, కంటి దృష్టిని కాపాడుతుంది. ఆకుకూరలలో ఉన్న అనామ్లజనకాలు చర్మం ముడుతలు పడకుండా ఉంచుతాయి. లైకోపీన్ లుటీన్ మరియు బీటా కెరోటిన్ - సాధారణంగా ఆకుపచ్చ కూరగాయలన్నింటిలో లభిస్తాయి-వీటివలన చర్మం వేగంగా పెరగటానికి బ్లాక్ UV కిరణాలకు సహాయపడతాయి. ఆకుకూరలలోని పోషకాలు హృద్రోగాలు, ఉబ్బసం, కీళ్ల నొప్పులు మరియు కొన్ని రకాల క్యాన్సర్ ను నిరోధిస్తాయి.

ఎల్ ఫర్ లెగ్యుమ్

ఎల్ ఫర్ లెగ్యుమ్

ఎల్ ఫర్ లెగ్యుమ్

 ఎం ఫర్ మక్కెరెల్

ఎం ఫర్ మక్కెరెల్

మహిళలు అడవి సాల్మన్ వారానికి 12 ఔన్సుల తిన్నట్లయితే చర్మం మృదువుగా అవుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచిస్తున్నారు. సాల్మన్ చేపలో ఒమేగా -3, కొవ్వు ఆమ్లాలు,విటమిన్ బి 12, విటమిన్ D పుష్కలంగా ఉన్నాయి మరియు మంట తగ్గిస్తుంది మరియు దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కాకుండా తగ్గిస్తుంది. సాల్మన్ రక్తపోటును తగ్గిస్తుంది మరియు 50.2 పైగా మహిళలకు కలిగే సాధారణ ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

ఎన్ ఫర్ నట్స్

ఎన్ ఫర్ నట్స్

బాదం, పిస్తా, జీడిపప్పుల్లో విటమిన్‌ ఇ, ఐరన్‌, పొటాషి యమ్‌, జింక్‌, ఒమెగా-3ఫాటీ ఆసిడ్స్‌ ఉంటాయి. ఇవన్నీ శరీర సౌందర్యాన్ని పెంచేవి. ఇందులో ఉండే నూనెలో ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఉపకరిస్తాయి.

ఓ ఫర్ ఆనియన్స్

ఓ ఫర్ ఆనియన్స్

ఓ ఫర్ ఆనియన్స్

పి ఫర్ పార్స్లే

పి ఫర్ పార్స్లే

కూరాకు, మెంతి, అమరాంత్, పార్ల్సే, కొత్తిమీర, వంటి వాటిలో అద్భుతమైన బీటాకెరోటీన్ ఉంది. దీన్ని మాత్రమే అంధిచడం కాకుండా, క్యాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి మరియు పోషకాలను అంధిస్తాయి. కాన్సర్ వ్యతిరేకంగా పనిచేసే గ్లూటాతియోన్ ఒక క్రియాశీల పదార్ధంగా ఉంది.

క్యు ఫర్ క్వీనా

క్యు ఫర్ క్వీనా

ఈ శక్తివంతమైన ఆహారంలో 8 అమైనో ఆమ్లాలు, క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి

ఆర్ ఫర్ రెడ్ ఫ్రూట్స్

ఆర్ ఫర్ రెడ్ ఫ్రూట్స్

రెడ్ ఫ్రూట్స్ అయినటువంటి రాస్స్బెర్రీ, స్ట్రాబెర్రీ, రెడ్ పెప్పర్, రెడ్ క్యాబేజ్, రెడ్ ఆనియన్ వంటి వెజిటేబుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హార్ట్ డిసీజ్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ తో పోరాడుతుంది. మరియు స్ట్రోక్ ప్రమాదంను మరియు కళ్ళు క్షీనతను తగ్గిస్తుంది

యస్ ఫర్ స్పినాచ్

యస్ ఫర్ స్పినాచ్

ఆకుకూరల్లో విటమిన్ సి, పుష్కలంగా ఉంటుంది, అది చర్మం కాంతివంతంగా ప్రకాశించడంలో దోహదపడుతుంది. అంతేకాదు ఆకుకూరల్లో ఉండే క్యారోటినాయిడ్స్ చర్మం ముడతలను తొలగించి, ఆరోగ్యంగా ఉంచుతుంది.

టి ఫర్ టమోటో

టి ఫర్ టమోటో

అధిక రోగనిరోధకశక్తి గల కూరగాయ టమాటా. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు క్యాన్సర్లను అరికడుతుంది. ఇందులో 'ఎ, 'ఇ విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది. టమాటాను బ్యూటీపార్లర్‌లో ఫేస్‌ మాస్కుల్లో కూడా ఉపయోగిస్తారు.

యు ఫర్ అన్ కుక్డ్కు వెజిటేబుల్స్

యు ఫర్ అన్ కుక్డ్కు వెజిటేబుల్స్

తినే ఆహారాలను అధికంగా ఉడికించడంలో వాటిలో ఉండే న్యూట్రీషియన్స్ మరియు ఇతర పోషకాంశాలు కోల్పోవడం జరుగుతుంది. దాంతో మీకు పూర్తి పోషకాంశాలు అందవు. దాంతో మీరు సంత్రుప్తి చెందక జంక్ ఫుడ్ మీద కోరిక కలుగుతుంది. మరియు మీరు తీసుకొనే ఆహారం చాలా వరకూ పచ్చికూరలను సుషి, సలాడ్స్ , గ్రిల్డ్ వెజిటేబుల్స్, గ్రిల్ లేదా బేక్ చేసిన మాంసాహారం, చేపలు వంటివి తినడానికి ప్రయత్నించండి. మైక్రోవేవ్ ను నివారించండి.

వి ఫర్ వెజ్జీస్

వి ఫర్ వెజ్జీస్

ఈ వెజిటేబుల్స్ గ్రీన్ కలర్ కలిగినటువంటివి. అలాగే ఎక్కువ రెడ్ మరియు బ్రైట్ ఆరెంజ్ మరియు ఎల్లో కలిగిన వెజిటేబుల్స్ లో గరిష్టమైనటువంటి యాంటీయాక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి . అంతే కాదు వీటన్నింటిలో నీటి శాతం ఎక్కువ. మీరు వాటర్ బేస్డ్ ఫుడ్స్ తిన్నప్పుడు, మీ శరీరం ఎక్కువ సమయం హైడ్రేషన్ లో ఉంటుంది.

డబ్ల్యు ఫర్ వాల్ నట్స్

డబ్ల్యు ఫర్ వాల్ నట్స్

వాల్ నట్స్ కాపర్ కు ఒక గొప్ప మూలం, వాట్ నట్స్ జుట్టు తెల్లబడకుండా స్టాప్ చేస్తుంది మరియు దీర్ఘం కాలం పాటు నేచురల్ కలర్ ఉండేందుకు సహాయపడుతుంది.

ఎక్స్ ఫర్ క్సైలిటోల్

ఎక్స్ ఫర్ క్సైలిటోల్

జీరో క్యాలరీలు కలిగిన స్వీట్నర్. xylitol లో కృత్రిమ స్వీటెనర్లలో ఉన్నటువంటి ప్రమాద కారకాలు ఇందులో ఉండవు. మరియు ఇది దంతాలకు తగినంత పోషణను అందివ్వడానికి సహాయపడుతాయి.

వై ఫర్ ఎల్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్

వై ఫర్ ఎల్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్

ఇవి చాలా విరవిగా దొరికే వంటింటి సామాగ్రి అని అందరికీ తెలిసిందే. ఆరోగ్యానికి కానీ, అందానికి కానీ దీని మేలు అంతా ఇంతా కాదు. చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో దీన్ని మించింది లేదు. కాబట్టి దీని ప్రయోగజనం చాలానే ఉంటుంది. నిమ్మరసం ఉపయోగించి చాలా ప్రయోజనాలను పొందవచ్చు. ఇది చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది. మొటిమలు మచ్చలను వదలగొడుతుంది. ముఖ చర్మాన్ని శుభ్రం చేసి ఫ్రెష్ మెరుస్తుండేలా చేస్తుంది. కాబట్టి నిమ్మరసంను వేరే ఇతర పదార్థాలు ఉపయోగించకుండా డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేసి కొద్ది నిమిషాల్లోనే శుభ్రం చేసేసుకోవాలి.

జెడ్ ఫర్ జుచ్చిని

జెడ్ ఫర్ జుచ్చిని

జుచ్చిని పాస్తాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కార్బొహైడ్రేటెట్ పాస్తాలను నివారించడం వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు హైషుగర్ కంటెంట్ ను తగ్గించవచ్చు. కాబట్టి, వీటికి బదులుగా జుచ్చిని ను ఉపయోగించవచ్చు

Desktop Bottom Promotion