Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
వంకాయలో ఉన్నఆరోగ్య ప్రయోజనాలు
వంకాయ గుడ్డు ఆకృతిలో ఉండి,ఒక మెరిసే చర్మం కలిగి,ముదురు ఊదా,తెలుపు లేదా పసుపు రంగులలో ఉంటుంది. వంకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆహార ప్రేమికులకు ఇష్టమైన కూరగాయలలో ఒకటి.
కొన్ని అధ్యయనాల ప్రకారం వంకాయ మొక్కలో ఇతర మొక్కల కంటే ఎక్కువ నికోటిన్ ఉంటుందని నిరూపణ జరిగింది. ఆరోగ్యానికి వంకాయ మంచి చేస్తుందా అని ఒక సాధారణ ప్రశ్న కలుగుతుంది. కానీ,మీ శరీరంనకు హాని చాలా తక్కువగా ఉంటుంది. మీరు వంకాయ యొక్క ప్రయోజనాలను ఒకసారి తెలుసుకొంటే,ఆరోగ్యం కోసం వంకాయ మంచిదని తెలుస్తుంది.
మంచి ఆరోగ్యానికి ఏడు వండర్ ఫుల్ వెజిటేబుల్స్..:క్లిక్ చేయండి
ఇక్కడ వంకాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు మీ ఆహారంలో వంకాయను చేర్చడానికి మరిన్ని కారణాలను తెలియచేస్తుంది.

ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం
ఫ్రీ రాడికల్స్ వలన జరిగే సెల్ నష్టాల అన్ని రకాల బాధ్యతను తీసుకుంటుంది. వంకాయలో యాంటీఆక్సిడెంట్లు అధిక కంటెంట్ ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాడటానికి సహాయపడుతుంది. చ్లోరోగేనిక్ యాసిడ్ వంకాయలో ప్రధాన యాంటి ఆక్సిడెంటుగా పరిగణిస్తారు. ఇది ఫ్రీ రాడికల్స్ చర్య వలన వచ్చే వ్యాధులను నిరోధించడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన గుండె
వంకాయను క్రమం తప్పకుండా తీసుకొంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా మీ రక్తపోటు సాధారణ స్థాయిలో నిర్వహించడానికి సహాయపడుతుంది.సాధారణ కొలెస్ట్రాల్ స్థాయి మరియు రక్తపోటు గుండె వ్యాధులను తగ్గించటానికి దోహదం చేస్తుంది.

మెదడు పనితీరు
ఇది వంకాయ యొక్క అతి ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి.వంకాయ పైటోన్యూట్రియాంట్స్ కలిగి ఉంటుంది. కణ పొరలలో ఎలాంటి నష్టం జరగకుండా సురక్షితంగా ఉంచటానికి సహాయం చేస్తుంది.అంతేకాకుండా ఒక ఆరోగ్యకరమైన మెమరీకి సహాయం చేస్తుంది.

ఇనుము ఓవర్లోడ్ తొలగిస్తుంది
వంకాయను క్రమం తప్పకుండా తీసుకొంటే అదనపు ఇనుమును తొలగించేందుకు సహాయం చేస్తుంది. ఇది పోలి సైతేమియా ఉన్న రోగులలో బాగా ఉపయోగపడుతుంది.వంకాయలో ఉండే నసునిన్ అనే ఒక సమ్మేళనం శరీరం నుండి అదనపు ఇనుము తొలగించటంలో సహాయపడుతుంది.

యాంటీ బాక్టీరియల్ లక్షణాలు
అంటువ్యాధులను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం వంకాయ యొక్క ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి. వంకాయలో అంటువ్యాధుల మీద పోరాటం కొరకు సహాయపడే విటమిన్ సి అధిక మొత్తం కలిగి ఉంటుంది. ఈ ప్రయోజనంను అనుభవించడానికి మీ ఆహారంలో వంకాయను ఒక భాగంగా చేర్చండి.

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం
వంకాయ మీ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటంలో సహాయపడుతుంది.మీరు ఆరోగ్యకరముగా ఉండడానికి సహాయం చేస్తుంది. వంకాయలో యాంటీఆక్సిడెంట్లు,పైటోపోషకాలు మరియు విటమిన్ సి ఉండుట వలన ఆరోగ్య ప్రయోజనాలకు దోహదం చేస్తుంది.

ధూమపానం మానివేయాలి
ధూమపానం మానివేయటానికి నికోటిన్ మార్పిడి చికిత్స యొక్క సహజ పద్ధతి కోసం చూస్తూ ఉంటే,అప్పుడు వంకాయ ఒక అద్భుతమైన ఎంపికగా ఉంటుంది. ఎందుకంటే వంకాయలో నికోటిన్ కంటెంట్ ఉంటుంది.
ఆరోగ్యకరమైన చర్మం
వంకాయలో ఖనిజాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. వంకాయలో ఉండే విటమిన్లు మరియు పీచు అనేవి డెటాక్సిఫికేషన్ మరియు మీ చర్మం ప్రకాశించటానికి సహాయపడతాయి. వంకాయ చర్మంలో యాంతోసైనిన్లు అనే ఒక బలమైన యాంటి-ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

జుట్టు సంరక్షణ
వంకాయ తీసుకొంటే మీ చర్మంను హైడ్రేడ్ గా ఉంచడానికి సహాయం చేస్తుంది.వంకాయలో ఉన్న కొన్ని ఎంజైమ్లు కేశ మూలాలను ఉత్తేజపరిచటానికి సహాయపడతాయి. జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి మరియు మీ జుట్టు ఒక ఆరోగ్యకరమైన నిర్మాణంను నిర్వహించడానికి సహాయపడుతుంది.

హైడ్రేట్ చర్మం
ఇది వంకాయ యొక్క ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి.వంకాయలో నీరు గణనీయమైన స్థాయిలో ఉంటుంది.మీ చర్మంను హైడ్రేడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది.మీ పొడి చర్మం మరియు అనుబంధ సమస్యలను వదిలించుకోవటం కొరకు సహాయం చేస్తుంది.



Click it and Unblock the Notifications
