Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
నేచురల్ వెజిటేబుల్స్ తినడం వల్ల పొందే ప్రయోజనాలు
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
సీజనల్ గా వచ్చే పండ్లు వెజిటేబుల్స్ ను ఆయా సీజన్ లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలను, ప్రోటీనుల, నూట్రీషియన్స్ ను పుష్కలంగా అంధిచవచ్చు. సీజనల్ గా లభించే పండ్లు చాలా విలువైనవి మరియ పూర్తి పోషకాంశాలు కలిగినవి అందుకే అవి అంత ఖరీదై ఉంటాయి.

ఉదాహారణకు స్వీట్ పొటాటో , ద్రాక్ష, బ్లాక్ బెర్రీస్, మరియు పీర్స్ వంటి సూర్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇవీ ఆ సీజన్ లో తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకత ఆరోగ్యంగా ఉంటుంది . కాబట్టి సీజనల్ గా లభించే న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్ రిచ్ పండ్లు, వెజిటేబుల్స్ తప్పకుండా తీసుకోవడం మంచిది. సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
శరీరంలోని మలినాలను తొలగించే బెస్ట్ ఫుడ్స్..క్లిక్ చేయండి
తృణధాన్యాలు-ఉల్లిపాయలు
తృణధాన్యాలు-మొక్కజొన్న, పాలిష్‌పట్టని బియ్యం, బార్లీ, గోధుమల్లో వివిధ ప్రమాణాల్లో ఐరన్, జింక్ ఉంటాయి. ఈ రెండు ఖనిజాలు శరీరంలో శోషణ కావాలంటే ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ ముఖ్యం.
చిక్కుళ్లు- కూరగాయలు
చిక్కుళ్లలో అధికంగా ప్రోటీన్లు, ఐరన్ ఉంటాయి. వీటిని పాలకూర, మొలకలు, బంగాళదుంపలతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. ' మన శరీరం పిండి పదార్థాలు, కొవ్వుల కంటే ప్రోటీన్ల జీవక్రియకు మూడు రెట్లు ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది' అని షీలా అంటారు. చిక్కుళ్లు, కూరగాయలు కలిపి తీసుకోవడంవల్ల బరువు పెరగడాన్ని నివారించొచ్చు. చిక్కుళ్లలోని ఐరన్ శోషణకు కూరగాయల్లోని విటమిన్-సి సహకరిస్తుంది.
జుట్టు పెరుగుదలకు టాప్ 10 వెజిటేబుల్స్: క్లిక్ చేయండి
టమాట-ఆలివ్‌నూనె
టమాటాలో విటమిన్-సి, లైకోపీన్ అనే యాంటిఆక్సిడెంట్ గణనీయమైన పరిమాణంలో ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్లు వృద్ధాప్య ప్రభావాలను, క్యాన్సర్‌ను, ఆస్టియోపోరొసిస్ (బోలు ఎముకల వ్యాధి), క్యాటరాక్ట్ (శుక్లాల వ్యాధి) వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్‌లో కూడా అధికంగా యాంటి ఆక్సిడెంట్లుంటాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఏర్పడటాన్ని ప్రోత్సాహిస్తాయి. ఆలివ్‌నూనె సమక్షంలో లైకోపీన్ ఉత్తమంగా శోషణ చెందుతాయి. అంతేకాక ఆలివ్‌నూనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధిచేయడమేకాక, పిత్తాశయంలోని రాళ్లను కరిగిస్తుంది. ఇవి రెండూ, కాలేయ పనితీరును మెరుగుపరచడమే కాక, శరీరాన్ని విషరహితంగా చేస్తుంది. అధిక రక్తపోటు వల్ల కలిగే ప్రభావాలను తగ్గిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
