Latest Updates
-
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు
జొన్నలలో దాగున్న ఆరోగ్య రహస్యాలు
జొన్నలు.. వీటిని ఇప్పుడు ఆహారంగా తీసుకోవడం చాలా తగ్గించేశారు. కానీ.. వీటిలో ఉండే పోషకాల చిట్టా తెలుసుకుంటే.. మళ్లీ తినాలనిపిస్తుంది. జొన్నల్లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటానికి తోడ్పడతాయి. కాబట్టి అన్ని ధాన్యాల కంటే.. జొన్నలే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.
READ MORE: కార్న్(మొక్కజొన్న)లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
ప్రపంచవ్యాప్తంగా జొన్నలు అధికంగా పండుతాయి. గోధుమలు, బియ్యం, మొక్కజొన్న తర్వాత అధికంగా పండే పంట జొన్న. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్నలను డైట్ లో చేర్చుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు. జొన్నల ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవి క్యాన్సర్, మధుమేహం వంటి రోగ్యాలను నయం చేస్తాయి. విభిన్నమైన ఆరోగ్యప్రయోజనాలున్న జొన్నల గురించి తెలుసుకుందాం రండి.

పోషకాహారం
జొన్నలు మేలైన పోషకాహారం. పాస్పరస్, మాంగనీస్, కాపర్, కాల్షియం, జింక్, పొటాషియం వంటి రకరకాల పోషకాలు జొన్నల్లో సమృద్దిగా ఉన్నాయి. సరైన ఆరోగ్యానికి జొన్నలను తరచుగా తీసుకోవడం చాలా అవసరం.

యాంటీ ఆక్సిడెంట్స్
జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ప్లమ్స్ వంటి ఫ్రూట్స్ లో కంటే జొన్నల్లోనే ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయని అధ్యయనాలు నిరూపించాయి. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, టైప్ టు డయాబెటీస్, న్యూరోలాజికల్ వ్యాధులు దరిచేరకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి ఇన్ని లాభాలున్న జొన్నలను మీ డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరి.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి
జొన్నలలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా ఉండటానికి తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా.. యాక్టీవ్ గా ఉంటడానికి జొన్నలు సరైన ఆహార పదార్ధం.

క్యాన్సర్ నిరోధిని
జొన్నలను ఎక్కవగా ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాదు.. క్యాన్సర్ ను నిరోధించే శక్తి కూడా వీటిలో ఉంది. చర్మ క్యాన్సర్ కూడా దరిచేరకుండా చేస్తుంది.

ఉదర సమస్యలకు
ఉదర సమస్యలకు చెక్ పెట్టడానికి జొన్నలు బాగా తోడ్పడతాయి. కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు జొన్నలు తీసుకోవడం వల్ల రిలాక్స్ గా ఉంటుంది.

శక్తినిస్తుంది
విటమిన్ బీ6 అధికంగా ఉంటుంది. కాబట్టి శరీరానికి కావాల్సిన శక్తిని జొన్నలు అందిస్తాయి. శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తాన్ని పెంచే ఇనుము, క్యాల్షియం, బి విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.

తక్కువ క్యాలరీలు
జొన్నల్లో ఇనుము, జింకు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ఇవి క్యాలరీలు పెరగకుండా చేయడమే కాదు.. శరీరానికి కావాల్సిన శక్తిని కూడా అందిస్తాయి.

త్వరగా కోలుకోవడానికి
అనారోగ్యంతో బాధపడే వాళ్లకు జొన్నలు సరైన ఆహారం. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. కాబట్టి జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన ఆహారపదార్థాలు పెట్టడం ఎంతో మంచిది. సత్వర శక్తిని అందిస్తాయి.

పాలిచ్చే తల్లులకు
జొన్నలు అన్ని రకాల ధాన్యాలకంటే బలవర్ధకమైనవి. వీటిలో ఉండే పోషకాలు, తల్లికే కాదు.. బిడ్డకు మంచిదే. కాబట్టి పాలిచ్చే తల్లులకు జొన్నలతో చేసిన ఆహారం పెట్టడం మంచిది.



Click it and Unblock the Notifications
