Latest Updates
-
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి!
మహిళల మెరుగైన ఆరోగ్యానికి టాప్ 7 విటమిన్స్
మన ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. పెద్దల నుంచి పిల్లల వరకు విటమిన్ల కొరతలేకుండా ఆరోగ్యంగా ఉంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు అంటున్నారు. చాలా వరకూ మహిళలు డైట్ కాన్సియస్ నెస్ ను కలిగి ఉంటారు . మరియు హెల్తీ డైట్ ప్లాన్ ను ఫాలో అవుతుంటారు. స్త్రీలకైనా పురుషులకైనా డైటరీ సలహాలు గ్రేట్ గా సహాయపడుతాయి. ముఖ్యంగా విటమిన్స్ విషయంలో మహిళలకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా వరకు హెల్తీ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్ ను పొందవచ్చు.
ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్ది మహిళలకు వివిధ రకాల విటమాన్స్ ను అవసరం అవుతాయి. బరువు మెయింటైన్ చేయడానికి మరియు ఇతర జీవక్రియులు చురుకుగా జరగడానికి , వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి విటమిన్లు అవసరం అవుతాయి. విటమిన్లు ప్రతీ ఒక్కరికీ అవసరం. అయితే తక్కువ మోతాదులో అన్ని రకాల విటమిన్లూ మానవ శరీరానికి అవసరం అవుతాయి. జీవక్రియలు జరగడానికి, కణాలన్నీ పని చేయడానికి విటమిన్లు ప్రధా నంగా అవసరం అవుతుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న విటమిన్లు శరీరంలో తయారు కావు. ఒక్క ఆహారంతోనే శరీరానికి అందించాలి.
విటమిన్-డి ఒక్కటే శరీరంలో తయారవుతుంది. విటమిన్లలో రెండు రకాలు ఉంటాయి? ఒకటి కొవ్వులో కరిగేవి, రెండోది నీటిలో కరిగేవి. కొవ్వులో కరిగే విటమిన్లు ఎ,డి,ఇ, కె. నీటిలో కరిగేవి బి, సి విటమిన్లు. కొన్ని రకాల విటమిన్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీవక్రియలు పూర్తయిన తర్వాత విడుదలయ్యే ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపించడంలో ఉపయోగపడతాయి. విటమిన్లు శరీరంలో ఒక్కో పార్ట్ కు ఒక్కో విధమైన విటమిన్స్ అవసరం అవుతాయి. ప్రతి ఒక్క విటమిన్ ఒక్కో పనిచేస్తాయి . అందువల్లే మొత్తం ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం అవుతాయి.
ముఖ్యంగా మహిళ ఆరోగ్యానికి అవసరం అయ్యే విటమిన్ల లిస్ట్ ను ఈ క్రింది స్లైడ్ ద్వారా మీతో షేర్ చేసుకోవడం జరింది. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి.

1. విటమిన్ ఎ:
విటమిన్ ఏలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . కొన్ని పరిశోధనల ప్రకారం విటమిన్స్ ఎముకలు, దంతాలు, సాప్ట్ టిష్యు, స్కిన్ మరియు మ్యూకస్ ను స్ట్రాంగ్ గా ఉంచడానికి సహాయపడుతాయి. ఈ విటమిన్ ను రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నివారించుకోవచ్చు. కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు, ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తాయి . ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం. టమోటోలు, క్యారెట్, వాటర్ మెలోన్, జామపండ్లు, బ్రొకోలీ, కేలా, బొప్పాయి, పీచ్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

2. విటమిన్ బి2 :
విటమిన్ బి2ను రిబోఫ్లోవిన్ అని కూడా పిలుస్తారు . ఇది మంచి ఆరోగ్యానికి నార్మల్ గ్రోత్ మరియు మెటబాలిజం రేటు పెంచడానికి ఇది చాలా అవసరం. ఇది ఎనర్జీ పెంచడానికి మరియు వ్యాధినిరోధకత పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ విటమిన్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఒంట్లో అదురు, సలుపులు, ఆందోళ, ఒత్తిడి మరియు అలసటను తగ్గిస్తుంది. పెరుగు, చీజ్, పాలు, బాదం, నట్స్, సోయాబీన్స్, మరియు మష్రుమ్స్ లో విటమిన్ బి2 అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

3.విటిమన్ బి6:
ఈ విటమిన్ ను పెరిడాక్సిన్ అని కూడా పిలుస్తారు . ఇది శరీరానికి అవసరం అయ్యే ఒక గ్రేట్ విటమిన్ . ఈ విటమిన్ శరీరంలో హార్మోనులు ఉత్పత్తికి మరియు బ్రెయిన్ కెమికల్స్ విడుదల చేయడానికి గ్రేట్ గా సహాయపడుతాయి . దాంతో డిప్రెషన్, హార్ట్ డిసీజ్, మరియు మెమరీ లాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. బీన్స్, నట్సు, కోడి గుడ్లు, ముడి పదార్దములు , ఫోర్టిఫైడ్ సెరెల్స్, అవొకాడో, అరటిపండ్లు, మాంసాహారం, ఓట్ మీల్, మరియు డ్రైఫ్రూట్స్ లో అధికంగా ఉంటాయి.

4. విటమిన్ బి7:
దీన్నే బయోటిన్ అనికూడా పిలుస్తారు. ఇది శరీరంలో కణాల వ్రుద్దికి సహాయపడుతుంది మరియు ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడుతాయి . మరియు స్వేధగ్రంథులను, చర్మాన్ని, మరియు జుట్టును హెల్తీగా ఉంచడంలో విటమిన్ బి7గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు ఇది గోళ్లు పెళుసుబారకుండా కాపాడుతాయి. అలాగో ఎముకలు వ్రుద్దికి సహాయపడుతాయి. విటమిన్ బి7 ఎల్లో ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ , లెంటిల్స్, బ్రౌన్ రైస్, పెప్పర్స్, గుడ్డు పచ్చసొన, సోయాబీన్స్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీటిని కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

5. విటమిన్ బి9:
విటమిన్ బి9ను ఫోలిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఇది హార్ట్ డిసీజ్ లను నివారిస్తుంది. ఇంకా బ్లడ్ ప్రెజర్, డిప్రెషన్, క్యాన్సర్, మెమరీ లాస్ వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది. ఇది ఫెర్టిలిటికీ గ్రేట్ గా సహాయపడుతుంది . గర్భిణీ స్త్రీకి అత్యవసరం అయినటువంటి మూలకం విటమిన్ బి9.

6. విటమిన్ బి12:
విటమిన్ బి 12 శరీర ఆరోగ్యానికి అత్యవసరమైనటువంటిది. ఇది మెటబాలిజం రేటును పెంచడానికి, కణవిభజనకు మరియు ప్రోటీన్ సింథసిస్ కు గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు ఇది ఆరోగ్యకరమైన నాడీ కణవ్యవస్థకు కూడా సహాయపడుతుంది. విటమిన్ బి12 ఫిష్, షెల్ ఫిష్, డైరీప్రొడక్ట్స్, మాంసాహారాలు, గుడ్డు, పాలలో అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

7. విటమిన్ సి:
ఈ విటమిన్ సిని ఇమ్యూన్ బూస్టర్ గా కూడా పిలుస్తారు. ఈ విటమిన్ మహిళలకు చాలా ఉపయోగకరమైనది . గాయాలను త్వరగా మాన్పుతుంది, కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది మరియు క్యాన్సర్ ను నివారిస్తుంది . బ్లడ్ సెల్స్ ఉత్పత్తిలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. బ్రొకోలీ, గ్రేప్ ఫ్రూట్, కివి, ఆరెంజ్, పొటాటో, స్ట్రాబెర్రీస్ మరియు టమోటోల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications