Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
నిమ్మకాయ రసాన్ని చాలా మంది కేవలం ఎండాకాలంలోనే ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. అలా కాకుండా ప్రతి రోజూ నిమ్మరసాన్ని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయ్. ఇందులో వైటమిన్ సి మాత్రమే కాదు, శరీరంలోంచి విషపదార్ధాలను తొలగించే డిటాక్స్ ప్రక్రియను చేపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచే పోషకాలు నిమ్మరసంలో ఉన్నాయ్.
మలబద్దకం
కడుపుకు సంబంధించిన మలబద్దకం, యాసిడిటీ లాంటివి తగ్గించే శక్తి నిమ్మరసానికి ఉంది. కేవలం ఎండా కాలంలోనే కాకుండా చలికాాలంలోనైనా సరే ఓ కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని పిండుకొని తాగండి. జీర్ణక్రియ వ్యవస్థలో ఏవైనా విషపదార్ధాలు ఉంటే తొలగిస్తుంది. శరీరం మొత్తన్నా డీటాక్స్ చేస్తుంది.

ఇన్‌ఫెక్షన్లు
ఒక గ్లాసు నిమ్మరసమే కావచ్చు, కాని దానికి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడే సామర్ధ్యముంది. నిమ్మలో ఉండే వైటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎటువంటి ఇన్‌ఫెక్షన్లకు కూడా గురికాకుండా చేస్తుంది.
చర్మం
నిమ్మలోొ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. చర్మంపై ఎటువంటి మచ్చలు, ముడతలు ఉన్నా రోజూ నిమ్మరసం తాగితే తొలగిపోతాయ్. చర్మంలో ఉంటే హానికరమైన బ్యాక్టీరియాను కూడా తొలగించడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
నోటి దుర్వాసన
నోటిదుర్వాసన పోవడానికి రకరకాల మౌత్‌ఫ్రెష్‌నర్లను వాడుతుంటాం. దానికి బదులుగా భోజనం చేసిన వెంటనే ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. నోటికి సంబంధించిన బ్యాక్టీరియా, పంటినొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
బరువు సమస్య
బరువును తగ్గించడంలో కూడా నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. ఒక నిమ్మలో ఉండే పోషకాల వల్ల ఎక్కువ కేలరీలు శరీరానికి అవసరం పడకుండా అవసరమైనంత శక్తినిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కూడా జీర్ణక్రియకు దోహదపడుతుంది. ప్రతీ రోజూ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోవడం ఖాయమని చెప్పవచ్చు.
గాయం మానుతుంది
నిర్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడుతుంది. ఏదైనా చిన్నగాయం అయితే రక్తం బయటకి వచ్చి తరువాత ఆ గాయం పై రక్తం గడ్డకట్టి మూసుకుపోతుంది. రక్తాన్ని గడ్డకట్టించేదే కొల్లాజెన్. కాబట్టి నిమ్మరసాన్ని ప్రతీ రోజు ఓ చిన్నకప్పు నీటిలోనైనా కలిపి తీసుకోవాలి.
కిడ్నీలో రాళ్లు
నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీరంలో సిట్రేట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లను కరిగించే సామర్ధ్యం ఉంటుంది. అందువల్ల నిమ్మరసం కిడ్నీలకు కూడా చాలా మంచిది.
నిమ్మకాయరసంతో కేవలం ఆరోగ్యప్రయోజనాలు మాత్రమే కాదు అందం కూడా పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications