Latest Updates
-
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే?
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు..
తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యం విషయంలో మనకు ఎన్నో ఆందోళనలు ఉంటాయి. బిడ్డ వరుసగా రెండు మూడు రోజులు నీరసంగా ఉన్నా, శరీరంపై కారణం తెలియని గాయం కనిపించినా మన మనసులో ఎన్నో భయాలు మెదులుతాయి. పిల్లలు ఆడుకునేటప్పుడు దెబ్బలు తగలడం, జ్వరం రావడం సహజమే అయినా.. కొన్నిసార్లు ఈ సాధారణ లక్షణాలు ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతం కావచ్చు.
పిల్లల్లో క్యాన్సర్ అనేది చాలా అరుదు. ఒకవేళ వచ్చినా, సరైన సమయంలో గుర్తిస్తే దాని నుంచి వారిని సులభంగా బయటపడేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు అయితే, ఏ లక్షణాలు సాధారణమైనవి? ఏవి ప్రమాదకరమైనవి? అనేది ప్రతి పేరెంట్ కచ్చితంగా తెలుసుకోవాలి.

తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్యమైన లక్షణాలు
ఈ క్రింది లక్షణాలు రెండు వారాలకు మించి కనిపిస్తే మాత్రం అప్రమత్తం కావాలి.
తీవ్రమైన నీరసం: ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండానే బిడ్డ ఎప్పుడూ అలసిపోవడం, ముఖం పాలిపోయినట్లు ఉండటం.
తగ్గని జ్వరం: స్పష్టమైన కారణం లేకుండా, మందులు వాడినా పదే పదే జ్వరం రావడం.
వింత గాయాలు, రక్తస్రావం: పిల్లలకు సాధారణంగా దెబ్బలు తగలని చోట (వీపు, చెవుల వెనుక) గాయాలు అవ్వడం. చర్మంపై ఎర్రటి మచ్చలు, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తం కారడం.
నొప్పి లేని గడ్డలు: మెడ, చంకలు లేదా గజ్జల్లో గడ్డలు ఏర్పడి, అవి తగ్గకపోవడం. అలాగే కడుపు అకారణంగా ఉబ్బడం.
ఎముకల నొప్పి: పగలు బాగానే ఉన్నా.. రాత్రిపూట బిడ్డను నిద్రలేపేంత స్థాయిలో ఎముకలు లేదా కీళ్ల నొప్పులు రావడం, కుంటుతూ నడవడం.
నరాల సమస్యలు: ఉదయం పూట తీవ్రమైన తలనొప్పి, వాంతులు కావడం. చూపు మందగించడం, నడుస్తూ తడబడటం.
కంటి సమస్యలు: అకస్మాత్తుగా మెల్లకన్ను రావడం, లేదా ఫోటోలు తీసినప్పుడు ఒక కంటిలో తెల్లటి చుక్క కనిపించడం.
బరువు తగ్గడం: ఆహారం బాగానే తీసుకుంటున్నా అకారణంగా బరువు తగ్గడం, రాత్రిళ్లు విపరీతంగా చెమటలు పట్టడం.
ఒక్క లక్షణం కాదు.. కలయిక ముఖ్యం
విడివిడిగా చూస్తే పైన చెప్పినవి సాధారణ అనారోగ్య సమస్యల్లాగే అనిపిస్తాయి. అందుకే వ్యాధి నిర్ధారణలో ఆలస్యం జరుగుతుంది. కానీ రెండు, మూడు లక్షణాలు ఒకేసారి కనిపించినా లేదా ఎక్కువ కాలం తగ్గకుండా ఉన్నా డాక్టర్లను సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
