Latest Updates
-
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి!
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే
పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు..ఉదయం ఒక రాష్ట్రంలో ఉంటే మధ్యాహ్నాం మరో రాష్ట్రంలో ..సాయంత్రం మరో దేశంలో..మరుసటి రోజు మరో ఖండంలో..ఇంత బిజీ పర్శన్ మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ. క్షణం తీరిక లేని షెడ్యూల్ తో గడిపే ప్రధాని మోదీ మొహంలో ఏ ఒక్క రోజు కూడా అలసట కానీ, ఎనర్జీ లెవల్స్ తగ్గినట్లు కానీ కనబడదు. ఎప్పుడూ ప్రశాంతంగా కబడతారు.
అసలు ఇదెలా సాధ్యం, ఆయన అంత ఇంత వయస్సులో అంత ఎనర్జిటిక్ గా ఎలా ఉంటున్నారు? వేల కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తున్నా కూడా ఆయనలో ఉత్సాహం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు..ఇదేలా సాధ్యం, అంత చురుగ్గా,శక్తివంతంగా ఎలా ఉంటున్నారని అని చాలామంది సందేహం.

వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని తన ఫిట్ నెస్ ద్వారా మోదీ నిరూపిస్తున్నారు. జిమ్ ల చుట్టూ తిరగకుండా, కేవలం మన భారతీయ సాంప్రదాయ పద్ధతులైన యోగా, వాకింగ్, ప్రాణాయామం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో ఆయన తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. మోదీని ఎప్పటికీ యవ్వనంగా, ఉత్సాహంగా ఉంచుతున్న 5 అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు ఏమిటో ఇక్కడ చూడండి.
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం, యోగా సాధన
ప్రపంచానికి యోగా గొప్పదనాన్ని చాటిచెప్పిన ప్రధాని మోదీ, స్వయంగా దానికి బ్రాండ్ అంబాసిడర్ లా జీవిస్తున్నారు. ఆయన ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు. రోజువారీ దినచర్యలో యోగా అనేది ఆయనకు శ్వాసతో సమానం. క్రమం తప్పని యోగాభ్యాసమే ఆయన శారీరక, మానసిక దృఢత్వానికి అసలైన పునాది.

ప్రకృతి ఒడిలో నడక
లేటెస్ట్ మెషీన్లు, జిమ్ వ్యాయామాల కంటే సహజసిద్ధమైన ఫిట్ నెస్ పద్ధతులకే ప్రధాని మోదీ ఆసక్తి చూపుతారు. ఆయన ఫిట్ నెస్ రొటీన్ లో నడకకు ప్రత్యేక స్థానం ఉంది. పంచతత్వాలను (నీరు, గాలి, భూమి, ఆకాశం, అగ్ని) ఆస్వాదిస్తూ, ప్రకృతితో మమేకమవుతూ ఉదయాన్నే నడవడం ఆయనకు ఎంతో ఇష్టం. ఇది కేవలం కండరాలకు మాత్రమే కాకుండా, మెదడుకు కూడా విశ్రాంతినిచ్చి రోజంతా ఆయన చురుకుగా పనిచేసేలా చేస్తుంది.
ప్రాణాయామం
మోదీ ఎప్పుడూ ప్రశాంతంగా కనబడటానికి ప్రధాన కారణం ఆయన చేసే శ్వాస వ్యాయామాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై నియంత్రణ సాధించడం ద్వారా, మనస్సును ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంచుకుంటారు. ఈ ప్రాణాయామం ఆయనలోని ఒత్తిడిని మాయం చేసి, కీలక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.
సాధారణ ఆహారం, ఉపవాస దీక్ష
గడచిన 50 ఏళ్లుగా తాను క్రమం తప్పకుండా ఉపవాసాలు ఉంటున్నానని మోదీ స్వయంగా తెలిరు. ఇక ఆహారం విషయానికొస్తే, ఖరీదైన డైట్ లను ఆయన ఫాలో అవ్వరు. సాధారణమైన, ఇంట్లో వండిన స్వచ్ఛమైన శాకాహారాన్నే ఆయన ఇష్టపడతారు. ఆకుకూరలు, పండ్లు ఆయన మెనూలో ఉంటాయి. ముఖ్యంగా పోషకాల గని అయిన మునగకాడలతో చేసిన పరాఠా లేదా మునగ సూప్ తన డైట్ లో తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు.
చెక్కుచెదరని క్రమశిక్షణ
మోదీ ఫిట్ నెస్ సీక్రెట్లలో అత్యంత కీలకమైనది క్రమశిక్షణ. తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఎంత అలసిపోయినా.. తన వ్యాయామ, ఆహార నియమాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
