Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
దేశంలో తీవ్రమైన ఆరోగ్య సమస్య ఇదే..వంటనూనెపై మోదీ కీలక సూచన
మనదేశంలో ప్రస్తుతం ప్రతి 8 మందిలో 1 మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దేశంలో పెరుగుతున్న ఊబకాయం సమస్యపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ముఖ్యమైన సూచనలు చేశారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 23న 119వ ఎపిసోడ్ లో మాట్లాడిన మోదీ..ఊబకాయాన్ని తగ్గించడానికి లేదా నివారించడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరారు. దేశంలో తలెత్తుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్య ఊబకాయం అని, ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు ఊబకాయం కారణమవుతోందని మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది జనవరి 28న డెహ్రాడూన్ లో జరిగిన జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో కూడా ఊబకాయానికి కారణమయ్యే వంటనూనెల పాత్రను మోదీ హైలెట్ చేసిన విషయం తెలిసిందే. ప్రతి కుటుంబంలో నెలలో వంట నూనెల వినియోగాన్ని 10శాతం వరకు తగ్గించాలని ఆ సమయంలో మోదీ అన్నారు. ఆదివారం త మన్ కీ బాత్ రేడియో ప్రసంగంలో మోదీ ఒక అడుగు ముందుకేసి ఈ అంశంపై ఒలంపిక్ పతక విజేత నీరజ్ చోప్రా, బాక్సర్ నిఖత్ జరీన్, ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ దేవి శెట్టి సందేశాలను వినిపించి వారిని అభినందించారు. పంచుకున్నారు.

ఊబకాయం.. అనేక హృదయ సంబంధిత వ్యాధులు, మధుమేహం, బీపీ, ఫ్యాటీ లివర్ వంటి అనేక సమస్యలను కలిగిస్తోందని ప్రధాని అన్నారు. ప్రతి నెలా ఆహారంలో 10శాతం తక్కువ ఆయిల్ ఉపయోగించాలని మోదీ సూచించారు. వంట నూనె కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు 10శాతం తక్కువ నూనె కొనుగోలు చేయాలని,ఊబకాయాన్ని తగ్గించడంలో ఇదొక ముఖ్యమైన అడుగు అని మోదీ అన్నారు. పది శాతం నూనె వాడకం తగ్గించి.. ఆ విషయం పది మందికి చెప్పండి. ఆ పది మంది ఇంకో పది మందికి సవాల్ విసరాలి.. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మాదిరిగా ఆరోగ్య సంరక్షణకు ఆహార నియమావళిని పాటించాలి అని మోదీ అన్నారు.
ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని మోదీ అన్నారు. ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన భవిష్యత్తును బలంగా, ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా మార్చుకోవచ్చని మోదీ సూచించారు. ఊబకాయంతో పోరాడటం అనేది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే కాదని.. కుటుంబం పట్ల మన బాధ్యత కూడా అని ప్రధానమంత్రి అన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications